India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టమాటా ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి.
☞ పుంగనూరులో మొదటి రకం “10 కిలోల” బాక్స్ ధర గరిష్ఠంగా రూ.367, కనిష్ఠ ధర రూ.234
☞ పలమనేరులో గరిష్ఠ ధర రూ. 450, కనిష్ఠ ధర రూ.370
☞వీకోట గరిష్ఠ ధర రూ.420, కనిష్ఠ ధర రూ. 360
☞ కలికిరి గరిష్ఠ ధర రూ.400, కనిష్ఠ ధర రూ. 370
☞ ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.450, కనిష్ఠ ధర రూ. 350 వరకు పలుకుతోంది.

రాజధాని అమరావతి పనులు వేగవంతం కావడంతో విజయవాడ-గుంటూరు మధ్య రియల్ ఎస్టేట్ మళ్లీ కళకళలాడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణ రంగానికి ఊపిరి వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ఈ కారిడార్‌లో 20కి పైగా కొత్త అపార్ట్‌మెంట్లకు భూమిపూజ జరిగింది. కాజ, మంగళగిరి, పెదకాకాని ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులకు పోటీ పడుతున్నారు.

AP ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 132/33 KV గన్నవరం విమానాశ్రయ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సోమవారం ప్రారంభించనున్నారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లోటును అధిగమించేందుకు ఈ సబ్‌స్టేషన్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రులు వాసంశెట్టి, కొల్లు, గన్నవరం MLA యార్లగడ్డ పాల్గొననున్నారు.

కారులో ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలను GST, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద కారును ఆపి తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా కారులో ఉన్న రూ.3.7 కోట్ల విలువజేసే 3.1 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ట్రెజరీలో భద్రపర్చారు. సదరు వ్యక్తి వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మంగళగిరిలో ఇంట్లో ఉన్న ఓ ఇంటర్ విద్యార్థినిని (16) కొందరు యువకులు బలవంతంగా అపహరించుకుపోయిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఇంట్లోకి చొరబడి విద్యార్థినిని లాక్కెళ్తుండగా, అడ్డువచ్చిన తమపై కూడా దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ASపేట మండలం హసనాపురంలో మంత్రి ఆనం శనివారం రాజముద్రతో ఉన్న కొత్త పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న గందరగోళానికి చెక్ పెడుతూ.. పక్కాగా పట్టాలిస్తున్నామని స్పష్టం చేశారు. సర్వే రాళ్ల మీద తన బొమ్మ వేయించుకోవడానికి జగన్ ఏకంగా రూ.650 కోట్లు తగలబెట్టారని ఆరోపించారు. ఆ ప్రజా ధనాన్ని రైతుల సంక్షేమానికి వాడితే బాగుండేదని చురకలు అంటించారు.

రక్త సంబంధం లేకపోయినా చిన్న పిలుపుతో ఏర్పడిన అనుబంధం మానవత్వాన్ని చాటింది. బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను(45) శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, బంధువులు ఎవరూ రాలేదు. దీంతో శ్రీను ‘అక్క’ అని పిలిచే పొరుగున ఉన్న పతివాడ మావూళ్లమ్మ చలించిపోయింది. తానే స్వయంగా తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆమె చూపిన ఈ చొరవను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటూ, మావూళ్లమ్మ పెద్దమనసును అభినందించారు.

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఖుర్ధా రోడ్ డివిజన్ పరిధిలో భద్రతకు సంబంధించిన మరమ్మతు పనులు కారణంగా పలాస-భువనేశ్వర్-పలాస(68419/20) మధ్య నడిచే మెము రైలును ఈనెల 4, 5, 6, 7, 8వ తేదీలలో రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ వెల్లడించింది. ఈ రైలు ఇచ్ఛాపురం, సోంపేట, బారువ, మందస, పలాస రైల్వే స్టేషన్లలో ఆగేది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీవో సుధాకర రావు తెలిపారు. నిరుపేదలకు ఉపాధి హామీ కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్రం వికసిత్ భారత్ వీబీజీ రామ్ జీగా మార్పు చేసినట్లు తెలిపారు. పథకం మార్పులపై గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని చెప్పారు. పథకంపై సభలలో అవగాహన కల్పిస్తామన్నారు.

బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నరసాపురానికి చెందిన గన్నాబత్తుల సత్యవతిని నియమించారు. పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించి పార్టీ ఈ బాధ్యతను అప్పగించింది. సత్యవతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అగ్ర నాయకత్వానికి, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలోని ప్రతి మహిళకు చేరేలా చూస్తానన్నారు.
Sorry, no posts matched your criteria.