India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉదయగిరిలోని శివారు ప్రాంతం కొత్త చెరువులో ప్రమాదపుశాత్తు కాలుజారి పడి ఉపాధి కూలి పెరుమాళ్ల వెంకటలక్ష్మి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పనులకు వెళ్లేందుకు చెరువు దగ్గర దాచి ఉంచిన పనిముట్లను తీసుకునేందుకు ముగ్గురు మహిళలు వెళ్లారు. పనిముట్లు తీసే క్రమంలో వెంకటలక్ష్మి కాలుజారి చెరువులో పడిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆమెను ఉదయగిరి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇరు పార్టీలకు అత్యంత నమ్మకమైన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించే దిశగా అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇతర ఏజెంట్లకు దీటుగా వారిని తట్టుకునే శక్తియుక్తులున్న వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. విశ్వసనీయుల పేర్లనే రిటర్నింగ్ అధికారులకు పంపించేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు.

కూర రుచిగా వండలేదని ఓ యువకుడు కుటుంబీకులతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురానికి చెందిన అబ్బులు(24) ఈ నెల 18న మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. కూర బాగా లేదని కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగాడు. అనంతరం వెళ్లి పంట చేనులో దాచి ఉంచిన పురుగు మందు తాగాడు. కుటుంబీకులు కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ అబ్బులు మృతి చెందాడు.

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వాతావరణం శనివారం చల్లబడింది. వారం రోజులుగా భానుడు తన ఉగ్రరూపాన్ని చూపించడంతో ప్రజలు ఉష్ణ తాపానికి ఇక్కట్లు పడ్డారు. నిన్న సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి.

పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని శుక్రవారం రాత్రి అశ్వ వాహనంపై ఊరేగించారు. ప్రత్యేక వాయిద్యాలు, భక్త జన కోలాహలం నడుమ ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ ఉత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. చివరిగా ఇవాళ రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను గోనుపల్లి గ్రామంలో ఊరేగించనున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు.

ప.గో జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి HYDలో మామపై బ్లేడ్‌తో దాడి చేశాడు. మధురానగర్ పోలీసుల వివరాల ప్రకారం.. HYDలోని యాదగిరినగర్‌కు చెందిన మాధవికి 2024 మార్చిలో సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. ఇద్దరికీ అది రెండో పెళ్లి. సుబ్రహ్మణ్యం మాధవిని వేధిస్తుండటంతో పుట్టింటికి వచ్చింది. శుక్రవారం మాధవి ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్యం మామతో గొడవపడి బ్లేడుతో గాయపర్చాడు. సుబ్రహ్మణ్యం వివరాలు తెలియాల్సి ఉంది.

అడల్ట్ BCG వ్యాక్సిన్ వేయించుకోవటానికి గుంటూరు జిల్లాలో 1.77లక్షల మంది వారి సమ్మతి తెలియజేశారని DMHO విజయలక్ష్మి తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రంలో 12 జిల్లాలను కేస్ స్టడీ కింద ఎంపిక చేశారని, వాటిల్లో గుంటూరు జిల్లా కూడా ఒకటని తెలిపారు. కావున జిల్లాలో వ్యాక్సిన్ కోసం సమ్మతి తెలియజేసిన వారికి ప్రతి గురువారం వార్డు సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ వ్యాక్సిన్ వేస్తారన్నారు.

నిన్న మొన్నటి వరకు కోడి గుడ్డు ధర రూ.5ల వరకు ఉండగా నేడు ఎనిమిది రూపాయలకు ఎగబాకింది. ఎండాకాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు. ప్రస్తుతం ఉదయగిరిలో 30 గుడ్లు రూ.200 పలుకుతున్నాయి. హోల్ సేల్‌లో ఒక కోడిగుడ్డు రూ.6.5లు కాగా రిటైల్ మార్కెట్లో రూ.8 రూపాయలు పలుకుతుంది.

నూజివీడు సంస్థానంలో నియోజకవర్గం ఏర్పడిన నాటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డ్ సృష్టించిన ఘనత డాక్టర్ ఎంఆర్ అప్పారావుకు దక్కుతుంది. నియోజకవర్గంలో 1952, 55, 62, 67, 72లలో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేదు. కోటగిరి హనుమంతరావు 4 సార్లు, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ మూడు సార్లు గెలుపొందారు.

కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కొందరు ఏజెంట్లు నమ్మించిన ఘటనలో పలాస వాసి
ఉన్నట్లు సమాచారం. ఆ యువకుడి నుంచి రూ.1.50 లక్షలు తీసుకుని చైనా, కాంబోడియా కంపెనీల ఏజెంట్లకు అప్పగించారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. భారత రాయబార, విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో కొందరు రెండు విమానాల్లో శుక్రవారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. వారిలో పలాస వాసి ఉన్నట్లు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.