India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గోదావరి స్నానాలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించి ప్రమాదాల బారిన పడవద్దని కొవ్వూరు రూరల్ SI సుధాకర్ హెచ్చరించారు. మద్దూరులంక, విజ్జేశ్వరం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రేవులు ప్రమాదకరంగా ఉన్నందున ఎవరూ నదీ స్నానాలకు రావొద్దన్నారు. గోదావరి ప్రమాదకరంగా ఉండటంతో పాటు నాచు ఉండటంతో స్నానానికి దిగిన వారు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. కాగా.. ఇప్పటికే గోదావరిలో మునిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

పోలవరం పునరావాస బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద దేవీపట్నానికి చెందిన ఉండమట్ల సీతారామయ్య(73) పురుగు మందు తాగాడు. పరిహారం, R&R ఇవ్వడం లేదని, ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదంటూ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత (33) భార్యాభర్తల వివాదాల నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై శివ బసవరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎస్సై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి శుక్రవారం తెలిపారు. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు గుంటూరు-డోన్ (17228), హుబ్లీ-విజయవాడ (17329), కాచిగూడ- నడికుడి- కాచిగూడ (07791/07792) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. వచ్చే నెల 1 నుంచి జులై 1వ తేదీ వరకు డోన్-గుంటూరు (17227), జూన్ 2 నుంచి జులై 1వ తేదీ వరకు విజయవాడ-హుబ్లీ(17330) రైళ్లు నడవవని పేర్కొన్నారు.

భానుడి భగభగలతో జిల్లా ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాస్త ఉపశమనం పొందినా.. తిరిగి సూర్యుడు విలయతాండవం చేస్తున్నాడు. శుక్రవారం జిల్లాలో అత్యధికంగా జమ్మలమడుగులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వల్లూరు, పెద్దముడియంలో 40.7, ఒంటిమిట్ట, కడప, సిద్దవటంలో 40.6, అట్లూరులో 39.1, చెన్నూరులో 39.8 డిగ్రీలు, ఇలా మిగిలిన మండలాల్లో సైతం 35 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈవో పరీక్ష నేడు విజయనగరం జిల్లాలో 6 కేంద్రాల్లో జరుగుతోందని, మొత్తం 1,470 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని డీఆర్‌ఓ అనిత పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని సూచించారు.

పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరుడు మధుసూదన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నెల 13న నల్లమాడ మండలంలోని నల్ల సింగయ్యగారి పల్లెలో మధుసూదన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలపై దాడికి ప్రయత్నించిన ఘటనలో అతడిపై కేసు నమోదైంది. ఎస్సై రమేశ్ బాబు మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా అతడు పరారీలో ఉన్నారు.

డోన్ జాతీయ రహదారిలోని ఉంగరానిగుండ్ల వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోరు వర్షంలో బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముని, ప్రభాకర్, దశరథ అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాకి చేరుకొని ప్రమాద ఘటనను పరిశీలించారు.

జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఉదయం 8 గం. ఓట్ల లెక్కింపు మొదలౌతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ 3 రౌండ్లలో పూర్తి చేస్తారు. అనంతరం EVMల లెక్కింపు ప్రారంభం అవుతుంది. తొలి ఫలితం విశాఖ వెస్ట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 16 రౌండ్లలో కౌంటింగ్ చేయగా మ. 3:15కి తొలి ఫలితం వస్తుంది. తుది ఫలితం భీమిలిలో 26 రౌండ్లు పూర్తి కాగా రాత్రి 7.30కి వచ్చే అవకాశం ఉంది.

పోలవరం పునరావాస బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద దేవీపట్నానికి చెందిన ఉండమట్ల సీతారామయ్య(73) పురుగు మందు తాగాడు. పరిహారం, R&R ఇవ్వడం లేదని, ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదంటూ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.