Andhra Pradesh

News May 25, 2024

తూ.గో జిల్లాకు జూన్ 7లోగా రుతుపవనాల ఎంట్రీ

image

వచ్చేనెల మొదటివారంలోనే ఉమ్మడి తూ.గో జిల్లాకు రుతుపవనాలు రానున్నాయి. ఈనెల 29 నుంచి 30 లోగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని అంచనా వేస్తున్నారు. ఇవి నాలుగు లేదా ఐదవ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీరానికి చేరుతాయి. అప్పట్నుంచి భారీగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లా సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ సారి 105 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

News May 25, 2024

కృష్ణా: అడ్మిషన్లకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగిలిపోయిన సీట్లను అర్హులైన విద్యార్థులతో భర్తీ చేస్తామని పాఠశాలల DCO సుమిత్రాదేవి తెలిపారు. ఈ మేరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష రాసి 5వ తరగతిలో సీటు పొందలేకపోయిన విద్యార్థులకు ఈ నెల 28న కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. అడ్మిషన్ కావాల్సిన విద్యార్థులు సంబంధిత పాఠశాలలలో సంప్రదించాలని కోరుతూ సుమిత్రాదేవి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News May 25, 2024

విశాఖలో విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ ఫెయిల్ అయ్యిందని తండ్రి మందలించడంతో కుమార్తె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం సింగిరెడ్డివలసకు చెందిన విద్యార్థిని (17) విశాఖలోని మహారాణిపేట బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఇంటర్ ఫెయిల్ అయిన విషయం తెలుసుకున్న తండ్రి కుమార్తెకు ఫోన్ చేసి మందలించాడు. మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం మహారాణిపేట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News May 25, 2024

ఒంటిమిట్టలో హరిత శోభకు TTD ప్రణాళిక

image

ఒంటిమిట్టలో హరిత శోభ కోసం TTD అధికారులు ప్రణాళిక రూపొందించారు. కోదండ రామాలయం పరిసర ప్రాంతాలు, కాలిబాటలు, సీతారాముల కళ్యాణ వేదిక, శృంగిశైలం, నాగేటి తిప్పపై పచ్చదనం పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం DFO శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు ప్రశాంతి, శివప్రసాద్, హరికృష్ణల ఆధ్వర్యంలో అధికారుల బృంద సభ్యులు ఇక్కడికి వచ్చారు. నీడ, ఆహ్లాదం పెంచే మొక్కలు నాటి సంరక్షించాలని చర్చించారు.

News May 25, 2024

విశాఖలో ఎల్.కోట మహిళ మృతి

image

కుమార్తెను కాలేజీలో చేర్చడానికి తన కుమారుడితో బైక్‌పై వెళ్తుండగా వెల్లంకి సాధుమఠం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతిచెందగా, కుమార్తె, కుమారుడు గాయాలపాలయ్యారు. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం గనివాడకు చెందిన సవళ్ళ నవ్య(40) తన కుమార్తె ఝాన్సీని ఇంటర్‌లో జాయిన్ చేయడానికి వెళ్తుండగా లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

News May 25, 2024

రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోనే..!

image

ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. తాజా లెక్కల ప్రకారం అన్ని జిల్లాల నుంచి 5,39,189 ఓట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 ఓట్లు పోలయ్యాయని, తరువాత స్థానంలో నంద్యాల జిల్లా (25,283) ఓట్లు రాగా, మూడో స్థానంలో కడప జిల్లా (24,918) ఓట్లు పోలయ్యాయి. ఇక అత్యల్పంగా నరసాపురంలో (15,320) ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

News May 25, 2024

ఏలూరు అత్యాచార ఘటనపై స్పందించిన షర్మిల

image

ఏలూరు జిల్లా మండవల్లిలో టెన్త్ విద్యార్థినిపై క్లాస్ రూంలోనే తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. దీనిపై ‘X’ వేదికగా వైఎస్.షర్మిల స్పందించారు. ‘లండన్‌లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న CM జగన్‌కు రాష్ట్రంలో మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవా..?. ఈ ఘటనపై మీ మహిళా మంత్రులు , నాయకులు సిగ్గుతో తల దించుకుంటారో, సిగ్గు లేకుండా మిన్నకుండుపోతారో..? ప్రజలు గమనిస్తున్నారు’ అని అన్నారు.

News May 25, 2024

పిఠాపురం: రూ.50 నోట్ల ఎర చూపి రూ.6 లక్షల దోపిడి

image

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని కొండప్ప వీధికి చెందిన ధాన్యం వ్యాపారి నందిపాటి నారాయణమూర్తి శుక్రవారం SBI నుంచి రూ.6 లక్షల నగదు డ్రా చేసి బైక్‌పై ఇంటికి బయలు దేరారు. సీతయ్యగారితోట వద్దకు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు వారి వద్ద ఉన్న రూ.50 నోట్లు కింద పడేసి మీ నగదు పడిపోయిందని ఆ వ్యాపారిని నమ్మించారు. ఆయన వద్ద ఉన్న రూ.6 లక్షలు కాజేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 25, 2024

కడప: పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌కు హెల్ప్ లైన్ సెంటర్లు ఇవే

image

ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించి విద్యార్థులు నిర్ణీత షెడ్యూల్ మేరకు ధ్రువపత్రాల పరిశీలనకు తమ దగ్గర్లోని హెల్ప్ లైన్ సెంటర్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. ఉమ్మడి కడప జిల్లాలో కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్, రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను హెల్ప్ లైన్ సెంటర్లుగా ఏర్పాటు చేశారు.

News May 25, 2024

అనంత: నాలుగు వరుసల రైల్వే లైన్ల నిర్మాణానికి కసరత్తు

image

రాష్ట్రంలోనే మొదటిసారి గుంతకల్లు రైల్వే డివిజన్‌లో 4 వరుసల రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇందుకోసం సర్వే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గుంతకల్లు నుంచి చెన్నై వైపు గుత్తి, తాడిపత్రి, కడప మీదుగా ఓబులవారిపల్లి వరకు 188.75 కి.మీ. పొడవుగా ప్రస్తుతమున్న రెండు వరుసల రైల్వేలైన్లకు తోడుగా మరో రెండు లైన్లు నిర్మించనున్నారు.3,4 వరుసల లైన్లను అందుబాటులోకి తేవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.