India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మదనపల్లిలోని రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి స్థానిక వైఎస్ఆర్ కాలనీలో శేషును ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్యచేసినట్లు ప్రాథమిక సమాచారం. యువకుడి హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న మదనపల్లి రెండో పట్టణ పోలీసులు ఘటనాస్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వ్యక్తిగత విభాగం ఏర్పాటు చేసినట్లు జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి బి.జగన్నాథరావు తెలిపారు. అక్రమ తవ్వకాలు చేపడుతుంటే 6281799518 నంబరుకు ఫిర్యాదు చేయాలని ఆయన పేర్కొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు జరిపితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

పాడి పంటలతో కళకళలాడే పచ్చటి పల్నాడు జిల్లాలో రాజకీయ కార్చిచ్చుకు ఆహుతై పోతున్నాయి. కులమతాలకు అతీతంగా ఉండే ఆత్మీయులే ఎన్నికల సమయానికి బద్ధ శత్రువులుగా మారుతున్నారు. క్షణికావేశంలో జరిగే దాడులతో పురుషులు జైళ్ళపాలు అవుతుంటే.. మహిళలు వ్యవసాయ కూలీలవుతున్నారు. పల్నాడు ఫ్యాక్షన్‌లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉండగా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని బిక్కుబిక్కుమంటున్నారు.

విజయవాడ సిద్ధార్థ నగర్‌లో బాడీ స్పా నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్ పై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ గుణరామ్ తెలిపిన వివరాల ప్రకారం, సిద్ధార్థ నగర్‌లో బ్యూటీ పార్లర్ పేరుతో బాడీ మసాజ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఈ దాడిలో ముగ్గురు యువతులను, ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని తెప్పపై ఉంచి కోనేటిలో ఊరేగించారు. నేత్రపర్వంగా సాగిన ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు భక్తజనులు కోలాహలంతో పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో కోన మారుమోగింది.

పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 27న క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ ప్రకటించారు. ఐటీఐ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) ట్రేడ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మే 26 ఉదయం 7 గంటలకు కడపలోని రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో U-16 పురుషుల క్రికెట్ ఎంపికలు జరుగుతాయని జిల్లా క్రికెట్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్, కిట్ బ్యాగు తప్పక తీసుకురావాలని తెలిపారు. 2008 సెప్టెంబర్ 1 నుంచి 2010 ఆగస్టు31 మధ్య జన్మించి ఉండాలి.

సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై అనంతపురం జిల్లా అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ గౌతమి శాలి కలిసి జిల్లాలోని అధికారులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ రోజు చేపట్టాల్సిన అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి సంబంధించి మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కే.శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కౌంటింగ్ పర్సనల్స్ 1వ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కౌంటింగ్ కోసం 813 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు.

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈవో పరీక్ష నేడు విశాఖ జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో జరుగుతుందని, మొత్తం 4,498 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని డీ.ఆర్.ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.