India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరగనున్న ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డీఆర్డీ లవన్న తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాలులో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షపై సమన్వయ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో డీఆర్డీ సమావేశం నిర్వహించారు. పరీక్షను పక్కాగా నిర్వహించాలన్నారు.

ఈ నెల 25వ తేదీ నిర్వహించనున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని శుక్రవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాలలో మూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 605 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారని తెలిపారు. పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఉదయం 7.30 గంటల నుంచి 8.15 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

VZM జిల్లాలో డిప్యూటీ DEO పరీక్షను 6కేంద్రాల్లో అధికారులు శనివారం నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షకు 1470 మంది హాజరుకానున్నారు. రాజాం GMR కళాశాలలో 300 మంది, చింతలవలసలోని MVGR- 250, భోగాపురంలోని అవంతి- 170, బొబ్బిలిలోని స్వామి వివేకానంద- 90, విజయనగరంలోని సత్య- 150, కొండకరకాం సీతం కాలేజీలో 510 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి 11:30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పాములపాడు మండలం మిట్ట కందాలలో శుక్రవారం పిడుగు పడింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. పడిగుపడటంతో గడ్డివాముకు నిప్పంటుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గాలి ఎక్కువగా వీస్తుండటంతో మంటలు భారీగా చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

నారా లోకేశ్‌కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే, లోకేశ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించాలన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని ఎలాగూ కేబినెట్‌లోకి తీసుకుంటారని, దీంతో ఎటువంటి వివాదాలు ఉండవన్నారు. ఈ క్రమంలో లోకేశ్‌కు అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలనే వ్యాఖ్యలపై మీ కామెంట్.

నారా లోకేశ్‌కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే, లోకేశ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించాలన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని ఎలాగూ కేబినెట్‌లోకి తీసుకుంటారని, దీంతో ఎటువంటి వివాదాలు ఉండవన్నారు. ఈ క్రమంలో లోకేశ్‌కు అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలనే వ్యాఖ్యలపై మీ కామెంట్.

రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని సన్నిధిలో నాలుగో శనివారం సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉండనుంది. టిటిడి ఆధ్వర్యంలో ఒక లడ్డు రూ.50 చొప్పున విక్రయిస్తారు. ఉదయం 7:30 గంటల నుంచి భక్తులు కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.

APPSC డిప్యూటీ డీఈవో నియామక పరీక్షను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 లోపు చేరుకోవాలని DRO అనిత తెలిపారు. ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. పరీక్షా నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆమె శుక్రవారం సమీక్షించి పలు సూచనలు చేశారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు కేంద్రాలలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని శ్రీ సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియలో వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ అధికారులకు వివరించారు.

కృష్ణా వర్సిటీ పరిధిలోని పీజీ- మాస్టర్ ఆఫ్ లా(LLM) కోర్స్ 3వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షలను జూన్ 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Sorry, no posts matched your criteria.