Andhra Pradesh

News May 24, 2024

మార్కాపురం: విద్యుత్ షాక్‌తో ఏడు పాడి గేదెలు మృతి

image

విద్యుదాఘాతంతో 7 పాడి గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామానికి చెందిన పలువురి రైతులకు చెందిన 7 పాడి గేదెలు శుక్రవారం గ్రామ శివారులో మేత మేస్తున్నాయి. ఈ క్రమంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ గేదెల విలువ రూ.5లక్షలు ఉంటుందని రైతులు వాపోయారు.

News May 24, 2024

జయ బాడిగకు అభినందనలు తెలిపిన చంద్రబాబు

image

కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా జయ బాడిగ ఇటివల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు X వేదికగా అభినందనలు తెలిపారు. జయ బాడిగ విజయవాడకు చెందిన వారు కావడం గర్వకారణమని అన్నారు. ఆమె పదవి కాలాన్ని విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని అన్నారు.

News May 24, 2024

చంద్రగిరిలో వ్యక్తి హత్య

image

చంద్రగిరి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. పనపాకం గ్రామం వద్ద గుర్తు తెలియని ఓ వృద్దుడు హత్యకు గురైనట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. రెండు రోజుల క్రితం ఘటన జరిగినట్లు నిర్థారించారు. ఎవరో తలపై దాడి చేసి హత్య చేశారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. 

News May 24, 2024

ప.గో.: బ్యాంకులో మహిళకు గుండెపోటు.. కుప్పకూలి మృతి

image

తణుకు పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆవరణలో ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఆలపాటి లక్ష్మీనారాయణమ్మ తన భర్తతో కలిసి శుక్రవారం నగదు లావాదేవీల నిమిత్తం బ్యాంకుకు వచ్చారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణమ్మ (55) గుండెపోటుతో బ్యాంకులోనే కుప్పకూలి మృతి చెందారు.

News May 24, 2024

ఓట్ల లెక్కింపు కోసం పకడ్బంధీ ఏర్పాట్లు: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఓట్ల లెక్కింపు కోసం పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. ఆయా శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. మూడు రోజుల ముందే ఏర్పాట్లు పూర్తికావాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జేసీ కె.కార్తీక్ పాల్గొన్నారు.

News May 24, 2024

శ్రీకాకుళం: రేపే పరీక్ష.. 830 మందికి 4 కేంద్రాలు

image

APPSC ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈనెల 25వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు శుక్రవారం పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 830 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆయా కేంద్రాల‌ వ‌ద్ద 144 సెక్ష‌న్ అమ‌లు చేయాల‌ని పోలీసులకు సూచించారు.

News May 24, 2024

కోడూరు: బైకు, లారీ ఢీ.. ఒకరు మృతి

image

రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండల పరిధిలోని అప్పరాజుపేట వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పెనగలూరు మండలం కొండూరుకు చెందిన పసుపులేటి సుబ్బ నరసయ్య మృతి చెందగా, తోట వెంకటరమణ గాయపడ్డాడు. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 24, 2024

విజయవాడలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

కృష్ణా నది వద్ద శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని వన్ టౌన్ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి తెలిపారు. కృష్ణానది వద్ద స్థానికులు గుర్తుతెలియని మృతదేహం ఉందన్న ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించగా 50 సంవత్సరాల వ్యక్తి గల మృతదేహం లభ్యమైందని సీఐ తెలిపారు. ఆ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసిన యెడల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News May 24, 2024

కౌంటింగ్‌పై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

కౌంటింగ్ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన, పట్టు కలిగి ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, విధి విధానాలపై అంబేడ్కర్ ఆడిటోరియంలో కౌంటింగ్ సూపర్‌వైజర్‌లు, మైక్రో అబ్జర్వర్‌లు, కౌంటింగ్ అసిస్టెంట్లు తదితర సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

News May 24, 2024

పలాసలో 40 తులాల బంగారం చోరీ

image

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రోటరీనగర్‌లో తెల్లవారుజామున ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. NREGSలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అలివేణి అనే మహిళ తన స్వగ్రామానికి వెళ్లగా, ఇదే అదనుగా భావించి దోచేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి 40 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.18 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.