Andhra Pradesh

News May 24, 2024

తూ.గో జిల్లాలో తొలి ఫలితం కొవ్వూరుదే

image

తూ.గో జిల్లాలో ఓట్ల లెక్కింపు నాడు కొవ్వూరు నియోజకవర్గ ఫలితం మొదట వెలువడనుంది. జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 116 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కొవ్వూరు-13 రౌండ్లు, నిడదవోలు-15, రాజానగరం-16, అనపర్తి-17, రాజమండ్రి సిటీ-17, రాజమండ్రి రూరల్-20, గోపాలపురం-18 రౌండ్లలో ముగియనుంది. ఒక్కో నియోజకవర్గానికి 14చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. మొత్తం 1577 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది.

News May 24, 2024

కడప: ALERT.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

image

కడప జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్, టెన్త్ అడ్వాన్సుడ్, సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 37 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో 17,688 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. 16 పరీక్షా కేంద్రాల్లో 3528 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు వివరించారు. నిమిషం ఆలస్యమైన ప్రవేశం నిషిద్ధమని RIO స్పష్టం చేశారు.

News May 24, 2024

VZM: సైబర్ నేరగాళ్ల నుంచి 60 మందికి విముక్తి

image

కంబోడియా సైబర్ నేరగాళ్ల నుంచి ఎట్టకేలకు 60 మందికి విముక్తి లభించింది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న విశాఖ వాసి ఒకరు ఇచ్చిన సమాచారంతో విశాఖ నగర కమిషనర్ స్పందించారు. విశాఖకు చెందిన 150 మంది, దేశవ్యాప్తంగా 5,000 మంది కంబోడియా మోసగాళ్ల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. విముక్తి లభించిన 60 మంది గురువారం భారత్‌కు బయలుదేరినట్లు విశాఖ పోలీసులకు సమాచారం అందింది. వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

News May 24, 2024

తాడిపత్రి రాళ్లదాడిలో మరో 11మంది అరెస్ట్

image

తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య జరిగిన రాళ్లదాడికి సంబంధించి మరో 11మందిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. రాళ్లదాడిపై ఇప్పటికే సిట్ బృందం దర్యాప్తు చేసి అల్లర్లలో 728 మంది ప్రమేయం ఉందని నివేదికను అందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 91 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం మరో 11 మందిని అరెస్టు, 9మంది బైండోవర్ చేసినట్లు తెలిపారు.

News May 24, 2024

విశాఖ: సైబర్ నేరగాళ్ల నుంచి 60 మందికి విముక్తి

image

కంబోడియా సైబర్ నేరగాళ్ల నుంచి ఎట్టకేలకు 60 మందికి విముక్తి లభించింది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న విశాఖ వాసి ఒకరు ఇచ్చిన సమాచారంతో విశాఖ నగర కమిషనర్ స్పందించారు. విశాఖకు చెందిన 150 మంది, దేశవ్యాప్తంగా 5,000 మంది కంబోడియా మోసగాళ్ల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. విముక్తి లభించిన 60 మంది గురువారం భారత్‌కు బయలుదేరినట్లు విశాఖ పోలీసులకు సమాచారం అందింది. వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

News May 24, 2024

కర్నూలు జిల్లా విద్యా శాఖలో 44 మంది సస్పెండ్

image

ఎన్నికల విధులకు హాజరుకాని 40 మంది ఉపాధ్యాయులను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ సస్పెండ్ చేశారు. వీరితో పాటు మరో నలుగురు ప్రధానోపాధ్యాయులను కడప ఆర్జేడీ సస్పెండ్ చేశారు. అయితే 79 మందిలో 44 మంది సస్పెండ్ కాగా.. మరో 23 మంది ఇచ్చిన సంజాయిషీలను సంబంధిత రిటర్నింగ్ అధికారుల వద్దకు పరిశీలనకు పంపామని వారు పేర్కొన్నారు.

News May 24, 2024

EVM ధ్వంసం ఘటనలో పలువురు సస్పెండ్.. వివరాలివే..!

image

రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పగలగొట్టిన విషయంలో అధికారులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ శ్రీకేశ్ తెలిపారు. GJC జూనియర్ కాలేజ్, సత్తెనపల్లిలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేసే PV సుబ్బారావు (ప్రిసైడింగ్ ఆఫీసర్), వెంకటాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో, స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ షహనాజ్ బేగం (పోలింగ్ ఆఫీసర్ /అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్)ను విధుల నుంచి తొలగించామన్నారు.

News May 24, 2024

ప్రకాశం: ALERT.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్, సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ సైమన్ విక్టర్ తెలిపారు. 43 పరీక్ష కేంద్రాల్లో 22,366 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం 15,291, ద్వితీయ సంవత్సరం 7,075 మంది విద్యార్థులు ఉన్నారు. నిమిషం ఆలస్యమైన ప్రవేశం నిషిద్ధమని ఆర్ఐఓ స్పష్టం చేశారు.

News May 24, 2024

భ్రూణ హత్యలను నివారించండి: తిరుపతి కలెక్టర్

image

జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పటిష్ఠంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. సమాజంలో స్త్రీ, పురుషులు సమానమేనని, ఆడపిల్లల పట్ల వివక్షత ఉండకూడదని కలెక్టర్ తెలిపారు.

News May 24, 2024

కౌంటింగ్ కేంద్రాలలో పటిష్ఠ బందోబస్తు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని చోళసముద్రం, మలుగూరు కౌంటింగ్ కేంద్రాలలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. కేంద్ర బలగాలతో పాటు సుమారు 460 మంది సివిల్ పోలీసులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటిని మానిటరింగ్ రూమ్‌కు అనుసంధానం చేసి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.