India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పటిష్ఠమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు ఆయన ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భద్రత, సి.సి. టివిలు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు.

సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని కలెక్టర్ డా.జీ.సృజన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుంచి సాధారణ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు.

ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో చివరి ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కమిటీ అధ్యక్షుడు నెల్లూరు సిటీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ కౌంటింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. స్థానిక కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్‌తో కలిసి పరిశీలించారు.

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 6వ తేదీ వరకు బాణాసంచా విక్రయించరాదని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ బంకులలో కేవలం వాహనాలలో మాత్రమే పెట్రోల్ పోయాలని, బాటిళ్లలో పోయవద్దని సూచించారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అల్లర్లకు దూరంగా ఉండాలని కోరారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 11 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మరి మన తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.

పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2024కు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆయా వెబ్‌సైట్‌లో డౌన్లోడ్ చేసి సంబంధిత కాపీలను విద్యార్థులకు అందజేయవలసిందిగా విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 11 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మరి మన ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.

కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసామని జిల్లా కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలపై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

బీఈడీ కోర్సులో ప్రవేశాలకు రాయాల్సిన ఎడ్‌సెట్-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తులలో తప్పులు దొర్లి ఉంటే ఏపీ ఉన్నత విద్య మండలి సవరించుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులలో కరెక్షన్స్ ఉంటే ఈ నెల 25లోపు సరిదిద్దుకోవచ్చని సూచించింది. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.

ప్రయాణికుల రద్దీ మేరకు పలాస మీదుగా చెన్నై ఎగ్మోర్, సత్రాగచ్చి(పశ్చిమ బెంగాల్) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 4 నుంచి జులై 2 వరకు ప్రతి మంగళవారం చెన్నై ఎగ్మోర్-సత్రాగచ్చి (నం.06079), జూన్ 5 నుంచి జూలై 3 వరకు ప్రతి బుధవారం సత్రాగచ్చి-చెన్నై ఎగ్మోర్ (నం.06080) ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలోని విజయనగరం, దువ్వాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.