India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో వేరుసెనగ విత్తనం కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 27,868 క్వింటాళ్లకు 31,555 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని డీఏవో ఉమామహేశ్వరమ్మ, ఏపీసీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 24, 520 క్వింటాళ్ల వేరుసెనగ విత్తనకాయలు ప్రాసెసింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

నంద్యాల: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ సుధాకర్రెడ్డి, ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ లక్ష్మీనారాయణలు తెలిపారు. జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. హాల్ టికెట్‌లను https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

కడప జిల్లాలో ఇప్పటి వరకు MLAలుగా గెలిచి మంత్రి పదవులు పొందిన వారు చాలామంది ఉన్నారు. ప్రొద్దుటూరు, రాయచోటి MLAల్లో ఏ ఒక్కరికీ మంత్రి పదవులు దక్కలేదు. ఎక్కువగా కడప నియోజకవర్గ MLAలకు మంత్రి పదవులు దక్కాయి. కడప నుంచి ఆరుగురికి, జమ్మలమడుగు, పులివెందుల నుంచి ముగ్గురికి, రాజంపేటలో ఇద్దరికి, కోడూరు, బద్వేలు, కమలాపురం, మైదుకూరు నుంచి ఒక్కొక్కరికి పదవులు దక్కాయి. ఈ సారి ఎవరికి వరిస్తుందో కామెంట్ చేయండి.

వైశాఖ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందన సమర్పణను వైభవంగా నిర్వహించారు. మొదటి విడత మే 10వ తేదీన 120 కిలోల చందనాన్ని స్వామికి సమర్పించగా, రెండో విడత గురువారం మరో 120 కిలోల చందనాన్ని స్వామికి సమర్పించారు. పలువురు భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

ఈనెల 24 నుంచి జూన్ 3వ తేది వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు డిఈఓ బి.వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 45 సెంటర్లు ఏర్పాటు చేశామని, ఉదయం 9: 30 గంటల నుంచి 12:45 గంటల వరకు జరిగే పరీక్షలకు 13,332మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఫెయిల్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇచ్చాపురం మండలం డోంకూరులో బుధవారం అర్ధరాత్రి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. వాసుపల్లి ఉష(30) కొద్దిరోజులుగా తలనొప్పితో బాధపడుతుంది. బుధవారం తీవ్రమైన తలనొప్పి రాగా, భరించలేక ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వాసుపల్లి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులకు నందన(10), రిత్విక్(5) సంతానం.

చికెన్ ప్రియులను ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం వేసవికాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి..చికెన్ ధర అమాంతం పెరిగింది. మనుబోలు మార్కెట్లో బుధవారం చికెన్ ధర ఏకంగా రూ.330 అయింది. దీంతో మాంసం ప్రియులు కడుపు నిండా చికెన్ తినాలంటే జేబులు కాస్త ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బీసీవై పార్టీ మద్దతుదారుపై వైసీపీ నాయకులు దాడి చేసినట్టు బాధితురాలు ఆరోపించింది. బర్నేపల్లి గ్రామానికి చెందిన శంకర్ భార్య అంజమ్మపై అదే గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులు చంద్రశేఖర్, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ బుధవారం కత్తితో దాడి చేసి గాయపరిచారని ఆమె ఆరోపించింది. ఆమె భర్త శంకర్ ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల కేసులో సబ్ జైల్లో ఉన్నారు. సీఐ రాఘవరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరు శివారులో యువకుడి డెడ్‌బాడీ కలకలం రేపింది. కైరం నాగశ్రీనివాస్(34) తన తండ్రి పోతురాజుతో పొలం పనులకు వెళ్తూ ఉంటాడు. గురువారం ఉదయం గ్రామ శివారున శ్రీనివాస్ స్పృహ లేకుండా పడి ఉండడం చూసి తండ్రి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అతడు చనిపోయినట్లు తెలపగా.. తండ్రి పోతురాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.శ్రీనివాస్ తెలిపారు.

అనంత జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకూ నిర్వహిస్తున్నట్లు డీవీఈఓ వెంకటరమణనాయక్ తెలిపారు. అనంతపురం జిల్లాలో 34 కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. జనరల్ కోర్సుల మొదటి ఏడాది విద్యా ర్థులు 15,921మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5017మంది, వృత్తిపరమైన ప్రథమ సంవత్సరం 980, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 592మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.