Andhra Pradesh

News May 23, 2024

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు

image

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తత్కాల్ కింద గురువారం కూడా చెల్లించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఇస్తూ ఇంటర్ బోర్డు కమిషనర్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ పరీక్షల జిల్లా కన్వీనర్ వెంకటరమణనాయక్ కోరారు. తత్కాల్ కింద రూ.3వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు

News May 23, 2024

అనంత: బ్యాంక్ మాజీ మేనేజర్ ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలో రైలు కింద పడి తాడిపత్రి టౌన్ బ్యాంక్ మాజీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం రాత్రి జరిగింది. పట్టణ పరిధిలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో రైలు పట్టాలపై మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా తాడిపత్రికి చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

ఏలూరు: చిన్నారితో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు

image

ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన 8 ఏళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 40 ఏళ్ల వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు SI కుటుంబరావు తెలిపారు. చిన్నారి తినుబండారాలు కొనుక్కునేందుకు దుకాణానికి వెళ్లగా.. దుకాణదారుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఇంటికి వచ్చి కుటుంబీకులకు చెప్పగా.. వారు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News May 23, 2024

విశాఖ: బావిలో పడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు బావిలో పడి ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై శిరీష బుధవారం తెలిపారు. విశాఖలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన కె.శివాజీ కుమార్ (60)తో పాటు మరో నలుగురు చినకాద శివారు రాజుల పేటలో జరుగుతున్న పండగకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం వాష్ రూమ్‌కి వెళ్లిన కుమార్ ఎంతకీ రాలేదు. దీంతో పరిసర ప్రాంతాలు వెతకగా నేలబావిలో మృతదేహం లభించిందని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

News May 23, 2024

మండవల్లి: బాలికపై అత్యాచారం.. నిందితుల అరెస్టు

image

బాలికపై <<13297310>>అత్యాచారం కేసులో <<>>ముద్దాయి అయిన బాలుడిని కైకలూరు రూరల్ సీఐ బి. కృష్ణ కుమార్ అరెస్టు చేసి, విజయవాడ జువెనైల్ హోమ్‌కు పంపించినట్లు ఎస్‌ఐ రామచంద్రారావు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేయగా.. ఈ కేసులో వీడియోలు తీసి ఫార్వర్డ్ చేసిన నలుగురిని కూడా అరెస్ట్ చేసి కైకలూరు కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

News May 23, 2024

TPT: ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నందు 2024 సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, పీహెచ్డీలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రవి ప్రకటనలో పేర్కొన్నారు. AIEEA ( PG) ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News May 23, 2024

SKLM: కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. స్వస్థలాలకు విద్యార్థులు!

image

కిర్గిస్థాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న రాజాం విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీన మొదలైన అల్లర్లు ఇంకా సద్దుమణగకపోవడంతో అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని భావించి ఇంటి దారి పట్టారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ నెలాఖరుకు స్వదేశం వచ్చేలా విమాన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో వర్సిటీలకెళ్లి చదువుకోలేకపోతున్నామని వారు తెలిపారు.

News May 23, 2024

ప్రకాశం: కారు, పాలవ్యాను ఢీ.. ఒకరు మృతి

image

ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం ఉప్పలపాడు, పామూరుకు చెందిన వారికి రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా నెల్లూరు జిల్లా దుత్తలూరు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు, పాలవ్యాను ఢీకొట్టడంతో ఒకరు అక్కడిక్కడే చనిపోయాడు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

News May 23, 2024

అనంతపురం జిల్లాకు పరిశీలకులుగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు

image

అనంతపురం జిల్లాకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సందర్భంగా ప్రత్యేక అధికారులుగా అనంతపురం అర్బన్, రాప్తాడు నియోజకవర్గాలకు మనీష్ సింగ్, ఉరవకొండ, కళ్యాణదుర్గం, శింగనమలకు అజయ్ నాథ్, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాలకు అజయ్ కుమార్ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.

News May 23, 2024

నెల్లూరు: ఆదాల, విజయసాయిరెడ్డిపై కంప్లైంట్

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు వైసీపీ నేతలు ఓటరు జాబితాలను చించివేయడంతో పాటు తమను బెదిరించారని టీడీపీ బూత్ ఏజెంట్లు శరవణ, మహేశ్, శివకుమార్, శ్రీనివాసులు, రహీమ్ ఆరోపించారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. 102, 103 బూతుల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి, 148వ బూత్ లో విజయసాయిరెడ్డి, 184, 185, 186 బూతుల్లో మొయిళ్ల గౌరీ, సురేష్ రెడ్డి భయానక వాతావరణం కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.