India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం పట్టణ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో(మెకానికల్) ఫైనల్ ఇయర్ విద్యార్థులకు “మస్సాచు సిమిచ్చు” కంపెనీలో ఆరు నెలలపాటు ఉచిత ఇంటర్నెట్ షిప్ ప్రోగ్రాంను అందజేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జయచంద్ర రెడ్డి తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు రూ.18వేల స్టైఫండ్ కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

వేసవి సందర్భంగా విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్క్‌లో సందడి నెలకొంది. కొద్ది రోజులుగా జూ పార్కు సందర్శకులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో పిల్లలు, పెద్దలు వందలాది మంది జూని సందర్శిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జూ పార్కుకు వస్తున్నారు. సందర్శకులు వన్యప్రాణులను తిలకిస్తూ ఆనందిస్తున్నారు.

సివిల్స్, ఐఐటీ, నీట్ వంటి ఉన్నత చదువుల కోసం గ్రామీణ విద్యార్థులకు తమవంతు సహకారం అందిస్తామని పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ అధ్యక్షుడు లక్ష్మయ్య తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఈనెల 26న 6నుంచి10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.00 గంటలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అదేరోజు ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి పేరేచర్ల వెళుతున్న లారీ.. మేదరమెట్ల పైలాన్ రహదారి పక్కన ఆగి ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ శ్రీధర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. ఈ లోగా మంటలు చెలరేగి నెల్లూరు జిల్లా ఇనమనమడుగు గ్రామానికి చెందిన శ్రీధర్ ఆ మంటల్లో కాలిపోయారని స్థానికులు తెలిపారు.

ఎన్నికల పోలింగ్‌కు మందు రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగానెల్లూరులో ఓటర్లకు ఓ పార్టీ నేతలు కోళ్లు పంపిణీ చేశారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపించారు. ఈఘటనపై మొదట గ్రామంలో విచారణ జరిపిన అధికారులు అలాంటిదేమీ లేదని తేల్చారు. పునర్విచారణ జరపాలని కలెక్టర్‌తో పాటు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎంపీడీఓ, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బంది మంగళవారం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.

అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి 6,289 మందిని బైండోవర్ చేసినట్లు జిల్లా ఎస్పీ గౌతమి శాలి పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో 381మందిని బైండోవర్ చేశామని వెల్లడించారు. అదేవిధంగా రౌడీ షీటర్లు, కిరాయి హంతక ముఠా, సమస్యలు సృష్టించే 136మందికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.

ఎల్.కోట మండలం రంగారాయపురంలో ఊబిలో మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరమణ(62) పశువుల కాపరులతో కలిసి కరెడ్ల వారి కోనేరు సమీపానికి వెళ్లాడు. అక్కడ పశువులు కోనేరులో ఉన్న ఊబిలో దిగగా.. వాటిని నెట్టే ప్రయత్నంలో అతను ఊబిలో మునిగి చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎన్నికల సందర్భంగా జిల్లాలో 26 వేల మందిని ముందస్తు బైండోవర్ చేశామని ఎస్పీ సునీల్ తెలిపారు. గొడవలు సృష్టించిన 35 మంది వివరాలను జిల్లా కలెక్టర్ కు నివేదించామన్నారు. వారిపై చర్యలకు అధికారులు సమాయత్తమవుతున్నారని చెప్పారు. మారణాయుధాలతో పాటు.. విడిగా పెట్రోలు కలిగివున్నా రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ కార్యక్రమాలకు అనుమతులు తీసుకొని నిర్వహించుకోవాలన్నారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ బోర్డ్ అధికారి కృష్ణయ్య తెలిపారు. మంగళవారం రాయచోటిలోని జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిటెండెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. ఈనెల 24 నుంచి జూన్ 1వరకు జరిగే పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

పుట్టపర్తిలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. 29 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 7344మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకే పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థులు 9గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ మీనాక్షి సూచించారు.
Sorry, no posts matched your criteria.