Andhra Pradesh

News March 23, 2024

పులివర్తి నాని కారుకు ప్రమాదం

image

చంద్రబాబు ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్తున్న టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కారు ప్రమాదానికి గురైంది. గుంటూరు వద్ద కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులివర్తి నానితో పాటు కారులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

News March 23, 2024

మార్కాపురం: 7 మంది వాలంటీర్లు రాజీనామా

image

మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయలలో పనిచేసే 7 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు 2024లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కి అందచేశారు.

News March 23, 2024

సోషల్ మీడియా ట్రోలింగ్స్‌పై నిఘా: ఎస్పీ రాధిక 

image

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్స్, తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జి.ఆర్ రాధిక హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన జారీ చేశారు. అలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచామని, అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News March 23, 2024

నంద్యాల: పరీక్షా కేంద్రం వద్ద గుండెపోటుతో ఇన్విజిలేటర్ మృతి

image

బనగానపల్లెలో శనివారం విషాదం చోటుచేసుకుంది.
పదవ తరగతి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌ గా విధులు నిర్వహిస్తున్న షాషావలి(55) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతిచెందారు. పరీక్షా కేంద్రంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చి ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలారు. స్థానికులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News March 23, 2024

పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

image

ఉమ్మడి ప.గో 15 నియోజకవర్గాల్లో 2చోట్లే ఇప్పటివరకు వైసీపీ MLAలు గెలవలేదు. 2019లో 13 స్థానాల్లోనూ వైసీపీ గెలిచినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండా ఎగిరింది. పోలవరంలో 2012(ఉప), 2019లో తెల్లం బాలరాజు వైసీపీ నుంచి 2సార్లు MLAగా గెలిచారు. మిగతా అన్నిచోట్ల వైసీపీ ఒకసారే గెలిచింది. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. పాలకొల్లు, ఉండి స్థానాలనూ వదిలేది లేదంటూ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయి.

News March 23, 2024

గుడివాడ: గుంతలో పడి వ్యక్తి మృతి 

image

గుడివాడలో పామర్రు- కత్తిపూడి జాతీయ రహదారిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రహదారి గుంతలో పడి టెంట్ హౌస్ కూలి కాటూరి స్వామి(54)అనే వ్యక్తి మృతిచెందాడు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయిందని, రోడ్డుపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. జీవనాధారం కోల్పోయిన తమను ఆదుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.   

News March 23, 2024

పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

image

ఉమ్మడి ప.గో 15 నియోజకవర్గాల్లో 2చోట్ల మాత్రమే ఇప్పటివరకు వైసీపీ MLAలు గెలవలేదు. 2019లో 13 స్థానాల్లోనూ వైసీపీ సత్తా చాటినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండానే ఎగిరింది. కొవ్వూరు, 2012(ఉప), 2019 ఎన్నికల్లో ప్రసన్నకుమార్.. పోలవరంలో 2012(ఉప), 2019లో తెల్లం వైసీపీ నుంచి 2సార్లు MLAలుగా గెలిచారు. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. ఆ 2 వదిలేది లేదంటూ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయి.

News March 23, 2024

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 రోజుల బస్సు యాత్ర: పెద్దిరెడ్డి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేపడుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంత్రి నివాసంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సమావేశం అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. 2న పీలేరు, 3న చిత్తూరు జిల్లాలో బస్సు యాత్ర, నాయకులతో సమావేశం, 4న తిరుపతి జిల్లాలో బస్సు యాత్ర.. శ్రీకాళహస్తి లేదా నాయుడుపేటలో నాయకులతో సమావేశం జరుగుతుందన్నారు.

News March 23, 2024

ప్రకాశం: వైసీపీ MLAపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణలపై గిద్దలూరు MLA రాంబాబుపై శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. ఈ నెల 18న మార్కాపురంలో షాదీఖానా స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయనతోపాటు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అలిబేగ్, 20వ వార్డు కౌన్సిలర్ షేక్ సలీం పాల్గొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా వారిపై కేసు నమోదు చేయించారు.

News March 23, 2024

శ్రీకాకుళం: ఘోరం.. ఎలుగు దాడిలో ఇద్దరు మృతి

image

వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి, చీపురుపల్లి సమీపంలో ఘోర ఘటన జరిగింది. ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందగా.. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. జీడి తోటలో పనులకు వెళ్లిన సీహెచ్.లోకనాథం, అప్పికొండ కుమార్ అనే రైతులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!