India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయనగరం జిల్లాలో ఆరోగ్యశ్రీకి సంబంధించి దాదాపు రూ.50 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులతో చర్చలు జరిపారు. అవి విఫలం కావడంతో నేటి నుంచి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు 46 ఉన్నాయి. వీటిలో ఏడాదికి రెండు లక్షలకు పైగా రోగులు చికిత్స పొందుతున్నారు.

బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం తిమ్మయ్యగారి పల్లికి చెందిన ఓబిలి నరసింహులు(47) కువైట్‌లో 3 రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని విమానం ద్వారా మంగళవారం గ్రామానికి తీసుకువచ్చారు. మృతునికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేవీపీఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఓబిలి పెంచలయ్య మృతునికి స్వయాన సోదరుడు.

గోరంట్ల మండల పరిధిలో కొత్తబోయినపల్లి వద్ద ఆదివారం వాలంటీర్‌ను హత్యచేసిన నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుకొండ డీఎస్పీ బాబీ జాన్ సైదా వివరాల ప్రకారం.. గోరంట్ల మండలం మల్లాపల్లికి చెందిన వాలంటీర్ అనిల్ కుమార్ యాదవ్‌ను కొత్తచెరువుకు చెందిన ఆరుగురు యువకులు మద్యం మత్తులో తీవ్రంగా కొట్టడంతో మృతి చెందినట్లు వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచినట్లు పేర్కొన్నారు.

భీమిలి నియోజకవర్గం తగరపువలస-ఆనందపురం సర్వీసు రోడ్డులో వలందపేట దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లవలస రాజేశ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రిటైర్డ్ కానిస్టేబుల్ దండు వెంకటపతిరాజు(64) పూజ సామగ్రి కోసం సంగివలసకు బైకుపై వచ్చారు. తిరిగి వెళ్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలతో ఆయన మృతిచెందారు. రాజు కుమారుడు లండన్‌లో చదువుతుండగా సంగివలసలో కుమార్తె సాయిలక్ష్మి దగ్గర ఆయన ఉంటున్నారు.

ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం మునిపల్లికి చెందిన భీమేంద్ర గొల్లవిల్లికి చెందిన లలిత(29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తరచూ వీరిమధ్య గొడవలు జరుగుతుండగా సోమవారం ఆమె ఉరేసుకొని చనిపోయింది. అల్లుడు వివాహేతర సంబంధాలు పెట్టుకొని తన కూతురిని చంపేశాడని మృతురాలి తల్లి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్లు SI మనోహర్ జోషి తెలిపారు.

కర్నూలులో ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులు వేసిన చోట కాకుండా వేరే బూత్‌లో విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కామేశ్ నాయక్‌ను ఎస్పీ కృష్ణకాంత్ సస్పెండ్ చేశారు. కామేశ్ నాయక్ కృష్ణానగర్‌లో ఉన్న ఓ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులకు డ్యూటీ వేశారు. ఆయన సిల్వర్ జూబ్లీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేయించారని వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేశారు.

అతని టార్గెట్ ఇళ్లు, ఉద్యోగుల గెస్ట్ హౌస్, స్టూడెంట్ హాస్టళ్లే. ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళ ల్యాప్‌టాప్ దొంగలించడమే అతగాడి పని. పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు మంగళవారం నిందితుడిని పట్టుకున్నారు. అతను చిత్తూరుకు చెందిన కుమార్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి 25 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు.

ఎన్నికల విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులపై నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్ సీరియస్ అయ్యారు. పోలింగ్ రోజు విధులకు గైర్హాజరైన 100 మందికి పైగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు ఎందుకు హాజరు కాలేదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఉద్యోగుల్లో పలువురు మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చారు.

నెల్లూరు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి లవన్న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు పదోతరగతి, ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు జరిగే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.వీరయ్య చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.