India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ యం.అభిషిక్త్ కిషోర్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో రాయచోటి, సుండుపల్లె తంబళ్లపల్లె, పెద్దమండెం, బీ.కొత్తకోట, రామసముద్రం, పీలేరు నియోజకవర్గాలలో 13 మండలాలలో తాగునీటి సరఫరా జరుగుతోందని తెలిపారు.

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో ఈవీఎం మిషన్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణ కాంత్ మంగళవారం పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ ఫీడ్ వారు పరిశీలించారు. రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్ బ్లాక్ పరిసరాలను వారు పరిశీలించారు. పాణ్యం ఆర్ఓ నారపు రెడ్డి మౌర్య, కర్నూలు ఆర్వో భార్గవ తేజ్ పాల్గొన్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష తేదీ గడువు పొడిగించారు. జూన్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, బీటెక్, ఎంటెక్ కోర్సులలో చేరేందుకు ఈ పరీక్షలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

విజయనగరం ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఈవీఎంలను భద్రపరిచిన ఇంజినీరింగ్ కళాశాల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వుడు, సివిల్ పోలీసుల మూడంచెల భద్రతను మంగళవారం తనిఖీలు నిర్వహించారు. కళాశాలకు వెళ్లే మార్గాల వాహనా తనిఖీలు పర్యవేక్షించారు. అంతేకాకుండా ఆయా మార్గాల వెళ్లే వాహనాల వ్యక్తుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తామన్నారు. ఈవిఎంల భద్రతను అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల పర్యవేక్షణలో ఉంటుందన్నారు

ఎన్నికలు పోలింగ్ అనంతరం గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం ఎస్పీ రాధిక ఆదేశాలతో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఐలు, ఎస్సై ల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రజలకు గుర్తు చేశారు. కార్యకర్తలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈనెల 24వ తేదీన జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సత్యసాయి జిల్లా డీఆర్ఓ కొండయ్య పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు జరిగే పరీక్షలకు 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 28 మంది ఛీప్ సూపరింటెండెంట్లను నియమించడం జరిగిందన్నారు.

నేర నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్డెన్ & సెర్చ్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఎటువంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసి, 482 లీటర్ల ఐడీ లిక్కర్, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో మంగళవారం కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, పి.హెచ్.సీల పనితీరు, ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో అమలయ్యే వైద్య ఆరోగ్య శాఖల కార్యక్రమాలు ప్రతివారం సమీక్షిస్తామని అన్నారు.

విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా మే
27 నుంచి జూన్ 23 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ అధికారి కె.సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు-రాయగడ(17243), తిరుపతి-విశాఖపట్నం(22708)
డబుల్ డెక్కర్లను మే 27 నుంచి జూన్ 22 వరకు రద్దు చేశారు. రాజమండ్రి-విశాఖపట్నం(07466), విశాఖపట్నం-రాజమండ్రి (07467) మెమో ప్యాసింజర్లను మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దు చేశారు.

ఏపీ గవర్నర్ ఏస్ అబ్దుల్ నజీర్ మంగళవారం రాత్రి నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన జిల్లా అధికారులు స్వాగతం పలికారు. కలెక్టర్ ఎం.హరి నారాయణన్, విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ సుందర వల్లి, ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ పుష్పగుచ్ఛం అందజేశారు.
Sorry, no posts matched your criteria.