Andhra Pradesh

News May 21, 2024

నంద్యాల: బంధువుల ఇంటికి పంపలేదని ఆత్మహత్య

image

చాగలమర్రిలోని చింతచెరువు రస్తాకు చెందిన బొర్ర వెంకటసుబ్బమ్మ(52) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఇంటికి పంపలేదన్న కారణంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబీకులు స్థానిక కేరళ వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 21, 2024

కడప: ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో పాటు 46 మందిపై కేసు

image

ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదైంది. కడప గౌస్ నగర్‌లో జరిగిన అల్లర్ల ఘటనలో టూటౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అంజద్ బాషాతో పాటు 21 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు 24 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసులు నమోదు చేసినట్లు
పేర్కొన్నారు.

News May 21, 2024

విశాఖ: ఈవీఎంల స్ట్రాంగ్ రూముల తనిఖీ

image

ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. పార్లమెంటు నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్‌తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను పోలీసు జాయింట్ కమిషనర్ ఫక్కీరప్పతో కలిసి తనిఖీ చేశారు. ప్రతి గదికి వేసిన తాళాలు, సీళ్లను పరిశీలించారు.

News May 21, 2024

పుంగనూరులో ఓట్లు లెక్కింపు ఇలా..!

image

పుంగనూరులో 2,38,868 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,06, 916 ఓట్లు పోలయ్యాయి. వచ్చే నెల 4వ తేదీన వీటిని లెక్కిస్తారు. ముందుగా పుంగనూరు మండలం ఎర్రగుంట్లపల్లి పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తర్వాత చౌడేపల్లె, సదుం, సోమల, రొంపిచెర్ల మండలాల ఈవీఎంలు తెరుస్తారు. చివరగా పులిచెర్ల మండలం కావేటిగారిపల్లి ఓట్లతో పుంగనూరు నియోజకవర్గ కౌంటింగ్ ముగుస్తుంది.

News May 21, 2024

స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన సత్యసాయి జిల్లా అధికారులు

image

హిందూపురం పట్టణ సమీపంలోని బిట్ కళాశాలలో స్ట్రాంగ్ రూములను సత్యసాయి జిల్లా అధికారులు పరిశీలించారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, పెనుకొండ సబ్ కలెక్టర్‌తో పాటు పలువురు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మంగళవారం సాయంత్రం కళాశాలలోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రతను పర్యవేక్షించారు.

News May 21, 2024

కడప-చెన్నై రహదారిపై రెండు బస్సులు ఢీ

image

ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం మలినేని పట్నం సమీపంలో కడప-చైన్నై ప్రధాన రహదారిపై మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. బద్వేల్ నుంచి కడపకు వెళ్తున్న బస్సును.. తిరుపతి నుంచి కర్నూలుకు వెళ్తున్న బస్సు ఢీకొనడంతో పాక్షికంగా దెబ్బతింది. సంఘటనా స్థలానికి ఎస్సై పెద్ద ఓబన్న చేరుకోని విచారిస్తున్నారు.

News May 21, 2024

మాజీ MLA మృతి.. రేపు మార్కెట్‌కు సెలవు

image

కొవ్వూరు మాజీ MLA పెండ్యాల కృష్ణబాబు మృతికి సంతాపంగా బుధవారం కొవ్వూరు మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అన్ని వ్యాపారవర్గాలు గమనించి సహకరించాలని సూచించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణబాబు మార్కెట్ అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. కాగా.. రేపు దొమ్మేరులో కృష్ణబాబు అంత్యక్రియలు జరగనున్నాయి.

News May 21, 2024

అసత్య ప్రచారాలు తగదు: కాకినాడ ఎస్పీ

image

ఓట్ల లెక్కింపు సందర్భంగా హింసాత్మక ఘటనలకు అవకాశం అంటూ వస్తున్న అసత్య ప్రచారాలు తగవని కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. లెక్కింపు రోజు, ఫలితాల తర్వాత కాకినాడ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న సందేశాల్లో ఏమాత్రం నిజం లేదని ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు. అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News May 21, 2024

REWIND: రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం ఉత్తరాంధ్రలో సాగింది

image

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం శ్రీకాకుళంలో మే 21, 1991న సాగింది. అప్పటి లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించారు. శ్రీకాకుళంలో జరిగిన భారీ బహిరంగ సభలో అభ్యర్థి డా.కణితి విశ్వనాథంకు మద్దతుగా ప్రసంగించారు. అక్కడ నుంచి విజయనగరం సభలో మాట్లాడారు. అనంతరం విశాఖ చేరుకుని అక్కడ నుంచి విమానంలో రాత్రి 10 గంటలకు తమిళనాడులోని పెరుంబుదూర్‌లో జరిగిన మానవబాంబు దాడిలో హత్యకు గురయ్యారు.

News May 21, 2024

అనంత: గుండెపోటుతో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ మృతి

image

గుత్తి RWS డీఈఈ రాజ్ కుమార్ మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఈయన అనంతపురంలో నివసిస్తూ గుత్తిలో పనిచేస్తున్నారు. గత సోమవారం గుండెపోటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు నగరంలోని సవేరా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బంది సంతాపం ప్రకటించారు.