India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లాలో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో తహశీల్దార్లు, పోలీసు అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. జిల్లాలో రాజకీయ ఘర్షణలు జరగకుండా కిందిస్థాయి సిబ్బందితో సమాచారం తెప్పించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

గుంటూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు నందు అవుట్ సోర్సింగ్ బేసిస్‌పై 3 ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మంగళవారం తెలిపారు. OC-01, EWS -01, BC–B(W)-01 పోస్టులకు, ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్ధులు 18 నుంచి 42 సం.ల లోపు వయస్సు కలిగి ఉండి, 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్హతలు కలిగి ఉండాలని సూచించారు.

కంకిపాడు మండలం దావులూరులో దారుణం చోటు చేసుకుంది. అంగవైకల్యంతో ఉన్న ‘దివ్యాంగురాలి’ పై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారని బాలిక తల్లి కంకిపాడు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు ‘రెండు వారాల’ నుంచి కడుపు నొప్పితో బాధపడుతుండటంతో.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గర్భవతని తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సందీప్ తెలిపారు.

ఇటీవల ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చే కాల్స్‌తో ప్రజలు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి నకిలీ కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎం.దీపిక సూచించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. కొరియర్ సర్వీసులతో వచ్చే నకిలీ కాల్స్‌ను నమ్మి, సైబర్ మోసాల బారిన పడొద్దని కోరారు. ఈ తరహా సైబర్ మోసగాళ్ల కాల్స్ భయపడాల్సిన పని లేదని, ఇటువంటి కాల్స్ ప్రజలెవరూ స్పందించకూడదన్నారు.

ఉపాధి నిమిత్తం ఖతర్ వెళ్లిన తన భార్య అక్కడ అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని, ఆమెను స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలని ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఉర్ల నవీన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిగూడెంలోని హెల్ప్‌డెస్క్ కార్యాలయంలో గట్టిం మాణిక్యాలరావుకు వినతిపత్రం అందజేశారు. యజమానులు భోజనం సైతం పెట్టడం లేదని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై పలు పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని తెలిపారు.

22, 23వ తేదీల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాదికి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు. 22న చిన్నటేకూరులో బాలురకు కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 23న దిన్నేదేవరపాడులో ఉన్న గురుకుల పాఠశాలలో ఆర్డర్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

అనంతపురంలోని కలెక్టరేట్‌లో మంగళవారం విద్యాశాఖ అధికారులతో డీఆర్ఓ కొండయ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 10,461 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూములను ఎస్పీ మణికంఠ మంగళవారం పరిశీలించారు. ఈవీఎంలు ఉంచిన గదుల్లోకి వర్షపు నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఆరిపుల్లా, ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా, ఆర్ఐ నీలకంఠేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశామని బొబ్బిలి రూరల్ తిరుమల రావు తెలిపారు. మంగళవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తెర్లాం ఎస్ఐ రమేశ్‌కు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు తెర్లాం జంక్షన్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసునున్నామన్నారు. వారి వద్ద నుంచి 1.5 కేజీ గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించామని సీఐ వివరాలను వెల్లడించారు
Sorry, no posts matched your criteria.