Andhra Pradesh

News May 21, 2024

నెల్లూరు: భారీగా నిలిచిన వాహనాలు

image

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు వద్ద కొత్తగా రోడ్డు పనులు చేస్తున్నారు. వీటిని గ్రామస్థులు అడ్డుకున్నారు. నూతన రహదారి నిర్మాణ క్రమంలో పెద్దపడుగుపాడు గ్రామానికి ఊన్న దారిని మూసేస్తున్నారని చెప్పారు. తమ రోడ్డు అలాగే ఉంచాలంటూ ఆందోళనకు దిగారు. ఈక్రమంలో సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్థులు ఆందోళనకు అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.

News May 21, 2024

కాకినాడ: వివాహిత ఆత్మహత్య.. అక్రమ సంబంధమే కారణమా..?

image

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం అమరవిల్లికి చెందిన బోరా దుర్గ (38) మంగళవారం గ్రామ శివారులోని ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దుర్గకు కొన్నేళ్లుగా ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్నారు. ప్రియుడితో గొడవలు పడిందని, అతడు ఆమె తలపై కొట్టాడని తెలుస్తుంది. దుర్గకు భర్త, పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 21, 2024

అనకాపల్లి: 10 ద్విచక్ర వాహనాలు.. మూడు ఆటోలు సీజ్

image

అనకాపల్లి పట్టణ శివారు ప్రాంతాలైన సుబ్రమణ్యం కాలనీ, డీబీ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల నాలుగవ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

News May 21, 2024

బంగారు పతకం సాధించిన పామూరు యువతి

image

పామూరు చెందిన నూకసాని హర్షిత జాతీయస్థాయి ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలలో తన ప్రతిభతో బంగారు పతకాన్ని సాధించింది. గంగాధర్ రావు, శారదల కుమార్తె హర్షిత పట్నాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో మూడో సంవత్సరం విద్యను అభ్యసిస్తుంది. అయితే ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి నైపుణ్య పోటీలలో హర్షిత తయారుచేసిన కాస్ట్యూమ్స్‌కి బంగారు పతకం వరించింది. దీంతో గ్రామస్థులు, హర్షిత తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

News May 21, 2024

తూ.గో.: మాజీ MLA మృతి

image

కొవ్వూరు మాజీ MLA పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణ బాబు) మంగళవారం మృతి చెందారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఆయన స్వగృహంలో మృతిచెందారు. తణుకు, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్ నేతగా పేరుగాంచిన కృష్ణ బాబు తదనంతర కాలంలో వైసీపీలో చేరారు. పారిశ్రామికవేత్తగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కృష్ణబాబు విశేష సేవలు అందించారు.

News May 21, 2024

ప.గో.: మాజీ MLA మృతి

image

కొవ్వూరు మాజీ MLA పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణ బాబు) మంగళవారం మృతి చెందారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఆయన స్వగృహంలో మృతిచెందారు. తణుకు, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్ నేతగా పేరుగాంచిన కృష్ణ బాబు తదనంతర కాలంలో వైసీపీలో చేరారు. పారిశ్రామికవేత్తగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కృష్ణబాబు విశేష సేవలు అందించారు.

News May 21, 2024

అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

image

అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పార్లమెంటుకు 483మంది సిబ్బంది, 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 578 మంది మొత్తం 1,061 మంది అవసరం ఉంటుందని ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. పరిస్థితిని బట్టి ఈ సంఖ్య మరికొంత పెరగవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం ర్యాండమైజేషన్ అనంతరం సిబ్బందికి నియోజకవర్గాలు కేటాయిస్తారు.

News May 21, 2024

TPT: ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU) లో ఫుల్ టైం రెగ్యులర్ పద్ధతిలో శిక్ష ఆచార్య (ఎంఈడి), శిక్ష శాస్త్రి (బీఈడీ) ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. CUET – PG 2024 ప్రవేశపరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ లో చూడాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 14.

News May 21, 2024

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు కలెక్టర్, ఎస్పీ

image

జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కలెక్టర్ శ్రీకేశ్, ఎస్పీ మలికా గర్గ్‌తో కలిసి నరసరావుపేట జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్, రిటర్నింగ్ అధికారి రమణ కాంత్ రెడ్డి, సరోజ తదితరులు పాల్గొన్నారు.

News May 21, 2024

చీరాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

వాడరేవు – రామాపురం రోడ్డులో మంగళవారం ఉదయం బైక్ అదుపుతప్పి ఊటుకూరి సుబ్బయ్య పాలెంకు చెందిన మత్స్యకారుడు బాలాజీ (55) దుర్మరణం చెందాడు. ఉదయం బైక్‌పై వేగంగా వెళుతుండగా అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఈపూరుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.