India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల: ఎన్నికలు ముగిసే వరకు నాయకులు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుటకు పోలీస్ శాఖ వారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు అభ్యర్థులు, నాయకులు సహకరించాలన కోరారు.
కృష్ణా వర్సిటీ పరిధిలోని డిగ్రీ(2019- 20 బ్యాచ్) విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి 20 వరకు ఈ పరీక్షలు ఆయా తేదీల్లో జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, పరీక్షల టైం టేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
ప్రశాంత ఎన్నికల కోసం.. పటిష్టమైన నియంత్రణ చేస్తున్నామని, కడప కలెక్టరేట్ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పకడ్బందీగా పర్యవేక్షణ చేస్తున్నట్లు కంట్రోల్ రూమ్ అధికారి సూర్యసాయి ప్రవీణ్ చంద్ పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘన సహితమైన 17,517 (పబ్లిక్), 12,532 (ప్రైవేటు) అంశాలపై చర్యలు తీసుకున్నామన్నారు. రూ.80వేలు నగదు, రూ.14,76,830 విలువైన లిక్కర్, ఇతర సామగ్రి సీజ్ చేసినట్లు తెలిపారు.
ఏప్రిల్ 18 నుంచి జరిగే నామినేషన్లు జరగనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ట్రైల్ రన్ నిర్వహించారు. వచ్చే నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక అధికారుల నియామకం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజులపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. వారాహి వాహనంపై పర్యటన ఉండేలా ఏర్పాట్లకు సిద్ధం కావాలన్నారు. టూర్ మేనేజ్మెంట్, టీం కన్వీనర్లు, కో కన్వీనర్లతో ఎన్నికల ప్రచారంపై చర్చించారు. ఈ మేరకు గొల్లప్రోలులో అనుమతి సైతం తీసుకున్నారు.
పది పరీక్షల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా తెలిపారు. జిల్లాలో మొత్తం 151 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా గణితం పరీక్షకు 21,539 మంది విద్యార్థులకు గానూ 391 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 30 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని డీఈఓ తెలిపారు.
ఏలూరు నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటివరకు గెలిచిన MLAలలో ఒక్కరు కూడా మహిళలు లేరు. 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‘ఐ’ తరఫున మాగంటి వరలక్ష్మి బరిలో ఉన్నప్పటికీ ఆమెపై టీడీపీ అభ్యర్థి మరడాని రంగారావు 9247 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీల నుంచి పురుషులే బరిలో ఉన్నారు.
మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు 1972లో కాంగ్రెస్, 1983, 85లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కృష్ణప్రసాద్ 2019(మైలవరం)లో వైసీపీ తరఫున గెలిచారు. తాజాగా ఆయన టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వసంత మరోసారి గెలిస్తే రెండు వేర్వేరు పార్టీల తరఫున విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకుమారులుగా రికార్డెలకెక్కనున్నారు.
గుండెపోటుతో బొబ్బిలిలో హోం గార్డు కెంగువ మహేష్ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మూడురోజులు క్రితం తమ్ముడు రామారావు మృతి చెందడంతో ఒత్తిడికి గురై తీవ్ర అస్వస్థత గురయ్యారు. కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా.. మూడు రోజులు వ్యవధిలో అన్నదమ్ములు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ గండి బాబ్జి భేటీ అయ్యారు. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని బాబ్జికి లోకేశ్ హామీ ఇచ్చారు. దీంతో పార్టీకి చేసిన రాజీనామాను బాబ్జి వెనక్కి తీసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానన్నారు.
Sorry, no posts matched your criteria.