India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కౌంటింగ్ ఏర్పాట్లు జూన్ 1వ తేదీ కల్లా పూర్తి చేస్తామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, SP హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. కలెక్టరేట్‌లో వారు మీడియాతో మాట్లాడారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల తర్వాతే EVMలు లెక్కిస్తామని.. జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ ఉండదని స్పష్టం చేశారు. చంద్రగిరిలో 4 చోట్ల రీపోలింగ్ జరిపించాలని చెవిరెడ్డి కోరిన విషయం తెలిసిందే.

నాయుడుపేట రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న రైలు… పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు నీలం రంగు జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రింద పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. వినుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రిందపడి మృతి చెందాడు. మృతుడు బ్లూ కలర్ చొక్క, నల్ల రంగు పాయింట్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుడి వివరాల తెలిస్తే ఎవరైనా నరసరావుపేట రైల్వే ఎస్సై సుబ్బారావుని సంప్రదించాలని సూచించారు.

ఉరవకొండ మండలం పాల్తూరు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో విడపనకల్ మండలానికి చెందిన మల్లికార్జునాచారి (65) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉండబండ నుంచి ఉరవకొండకు వెళ్తుండగా.. అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళ్తున్న కారు ఢీకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

కోటబొమ్మాలి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్న వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తోట మల్లేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ సోమవారం బయలు దేరారు. అయితే కణితివూరులో పోలీసులు తిలక్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. మల్లేష్ అంతిమయాత్రలో కూడా పాల్గొనకుండా చేయడంపై తిలక్ అసహనం వ్యక్తం చేశారు.

వేసవికాలం కావడంతో కోళ్ల పెంపకం తగ్గింది, దీంతో బ్రాయిలర్ కోళ్ల లభ్యత తగ్గడంతో విశాఖలో ధరలు పెరిగాయి. గడచిన రెండు నెలల్లో చికెన్ ధర రూ.230 నుంచి రూ.260 వరకు ఉండేది. సోమవారం దీని ధర రూ.296కు పెరిగింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 20 రోజుల్లో కిలోపై రూ.40 వరకు పెరిగింది. గుడ్లు ధరలు కూడా పెరుగుతున్నాయి. మార్చి నెలలో 100 గుడ్ల ధర రూ.425 ఉండగా నేడు రూ.550గా ఉంది.

కొమరోలు మండలం చింతలపల్లి గ్రామ సమీపంలోని జియో టవర్ సరిగా పనిచేయకపోవడంతో జియో సేవలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి జియో టవర్ పని చేయకపోవడం వల్ల జియో సిగ్నల్ లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి జియో టవర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై, భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 10 నుంచి జూలై 1 వరకు ప్రతి సోమవారం చెన్నై, భువనేశ్వర్ (నెం.06073), జూన్ 11 నుంచి జూలై 2 వరకు ప్రతి మంగళవారం భువనేశ్వర్, చెన్నై (నెం.06074) మధ్య ఈ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.

కర్నూలు జిల్లా నగరవనం చెరువులో ఆదివారం మూడు మహిళల మృతదేహాలు కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే వాటిలో రెండు మృతదేహాలలో రెండు ఎవరివనేది పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు వనపర్తికి చెందిన అరుణ, జానకి కాగా.. మరో మహిళ ఎవరినేది తెలియలేదు. వీరి మృతికి గల కారణాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

ఉమ్మడి ప.గో.లో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. జీలుగుమిల్లి 75.2 మి.మీ వర్షపాతం నమోదవగా.. అత్తిలి 33.8, జంగారెడ్డిగూడెం 32.8, తణుకు 32.0, ఇరగవరం 16.0, బుట్టాయిగూడెం 12.2 , పెనుగొండ 8.6, పోడూరు- పాలకోడేరు 7.4, పెంటపాడు 6.0, కొయ్యలగూడెం 4.2, పెనుమంట్ర 2.8, లింగపాలెం 2.2, పోలవరం 1.0, ఏలూరు 0.8, దెందులూరు, కామవరపుకోట 0.6, తాడేపల్లిగూడెంలో 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
Sorry, no posts matched your criteria.