Andhra Pradesh

News May 20, 2024

శ్రీకాకుళం: చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

మడ్డువలస నుంచి తన స్వగ్రామమైన వీరఘట్టం మండలం నందివాడ బైకుపై వస్తోన్న గౌతం మోటార్ సైకిల్ మడ్డువలస, సరసనాపల్లి మధ్య శుక్రవారం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో గౌతం తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు బలమైన గాయం కావడంతో గత రెండు రోజులుగా శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై జనార్దన్ రావు తెలిపారు. చిన్న వయసులోనే మృతి చెందడంతో అతడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 20, 2024

చట్టపరంగా ఎటువంటి తప్పు చేయలేదు: విష్ణుకుమార్ రాజు

image

చట్టపరంగా, న్యాయపరంగా తాను ఎటువంటి తప్పు చేయలేదని విశాఖ నార్త్ BJP MLA అభ్యర్థి <<13279687>>విష్ణుకుమార్ రాజు<<>> అన్నారు. నగరంలోని బర్మా కాలనీలో రెండు కుటుంబాల మధ్య దాడికి సంబంధించి కేసును తప్పుదోవ పట్టించారని పోలీసులు ఆయనకు 41-ఏ నోటీసులు అందజేశారు. దీనిపై ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్టేషన్ బెయిలు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై మరోసారి విచారణ జరిపించాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

News May 20, 2024

కాకినాడ: స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు ఓటేశారు

image

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం గోకవరం పంచాయతీ పరిధి గిరిజనాపురం గ్రామస్థులు తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో మొత్తం 50 మంది ఉండగా.. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత 19మందికి తొలిసారి ఓటుహక్కు వచ్చింది. 12 కుటుంబాలకు చెందిన వీరు కొండదిగువన 4కి.మీ. దూరంలో వేములపాలెం పోలింగ్ బూత్‌లో ఓటేశారు. తమకు ఓటుహక్కు రావడంతో రాజకీయ నాయకులు సైతం తొలిసారి ప్రచారం చేశారని చెబుతున్నారు.

News May 20, 2024

ఆస్పరిలో ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రైవేటు బస్సు

image

ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని బస్టాండ్ దగ్గర ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ డ్రైవర్‌కి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా.. ఇంకెవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 20, 2024

విశాఖ: పోలింగ్‌లో రాష్ట్రంలోనే కొత్త రికార్డు

image

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మొత్తం 14 వార్డులు ఉన్నాయి. 90వ వార్డులోని 213 బూత్‌లో అత్యల్పంగా 7.74% పోలింగ్ నమోదు కాగా(620 మంది ఓటర్లుండగా కేవలం 48మంది ఓటేశారు).. 56వ వార్డులో 180 బూత్‌లో అత్యధికంగా 84.43% పోలింగ్ నమోదయింది. ఈ నియోజకవర్గంలో 69.78 శాతం పోలింగ్ నమోదయింది. గత ఎన్నికలతో పోలిస్తే 11.59% అధికంగా పోలింగ్ జరిగింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఒక కొత్త రికార్డు.

News May 20, 2024

అమరాపురం మండలంలో అధిక వర్షపాతం నమోదు

image

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అమరాపురం మండలంలో అధిక వర్షపాతం నమోదైనట్టు జిల్లా అధికారులు పేర్కొన్నారు. అమరాపురం మండలంలో ఆదివారం రాత్రి 75.8 మిల్లీమీటర్లు, కనగానపల్లి లో 74.8, రామగిరి లో 36.4, గుడిబండలో 21.6, లేపాక్షిలో 19.2, ఆగలి మండలంలో 18.6 మిల్లీమీటర్ల పొందుతున్న జిల్లాలోని 18 మండలాల్లో 389.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అన్నారు.

News May 20, 2024

అనంత: ఈనెల 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లమెంటరీ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీవీఈవో రఘునాథరెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌‌లోడ్ చేసుకోవాలని సూచించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ అధికారిక వెబ్‌‌సైట్ లాగిన్‌‌లో డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

News May 20, 2024

పెండ్లిమర్రి టాప్.. పెద్దముడియం లాస్ట్

image

శనివారం నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు జిల్లాలో వర్షం కురిసింది. 32 మండలాల్లో చిరుజల్లుల నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని అత్యధికంగా పెండ్లిమర్రిలో 39.4 మి.మి., అత్యల్పంగా పెద్దముడియం మండలంలో 0.8 మి.మి. నమోదయింది. 10 మి.మి. తోపు వర్షపాతం 22 మండలాల్లో నమోదు కాగా.. 10 నుంచి 20 మి.మి. 6 మండలాలు, మరో 3 మండలాల్లో 20 మి.మి. పైగా వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.

News May 20, 2024

UPDATE: జంగారెడ్డిగూడెంలో ACCIDENT.. యువకుడు మృతి

image

జంగారెడ్డిగూడెం శివారు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. వివరాలు.. పట్టణానికి చెందిన కోన సాయి (23) మొబైల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మిత్రుడు రాజ్‌కుమార్‌ను జగన్నాథపురంలో వదిలిపెట్టేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయి మృతిచెందగా గాయపడిన రాజ్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు.

News May 20, 2024

అనంత: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపుకు అవకాశం

image

అనంతపురం జిల్లా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తత్కాల్ కింద చెల్లించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ తెలిపారు. పరీక్ష ఫీజుతో పాటు తత్కాల్ కింద రూ. 3 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని, ఆయా ప్రిన్సిపల్ ను కలిసి ఫీజు చెల్లించాలని సూచించారు.