Andhra Pradesh

News August 14, 2024

నెల్లూరు: మూడు రోజుల్లో నిశ్చితార్థం.. యువకుడి స్పాట్ డెడ్

image

తల్లికి మందులు తీసుకునేందుకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన ఆత్మకూరులో జరిగింది. మర్రిపాడు మండలం కదిరినేనిపల్లికి చెందిన సాలెహా(28) జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లి వారం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. మూడు రోజుల్లో నిశ్చితార్థం.. ఇంతలో తన తల్లికి ఆరోగ్యం బాగొలేకపోపవడంతో మందులను తీసుకునేందుకు ఆత్మకూరుకు బైక్‌పై వెళ్లాడు. తిరిగి గ్రామానికి వెళ్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News August 14, 2024

ATP: హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

image

కంబదురు మండలంలో సోమవారం జరిగిన తిప్పేస్వామి హత్యకేసులో రాళ్ళపల్లి గ్రామానికి చెందిన మల్లెల రాజు, నరేశ్‌లను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ రవికుమార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంపై వస్తున్న తిప్పేస్వామిని రోడ్డుకు అడ్డగించి బండ రాళ్లతో దాడిచేసి హత్య చేసినట్లు విచారణలో తేలినట్లు వివరించారు. కేసు ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు.

News August 14, 2024

మొదటి విడతలో కడపకు దక్కని ఛాన్స్

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలలో కడప జిల్లాకు స్థానం దక్కలేదు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం చేసే జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కడప జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రారంభానికి చోటు దక్కలేదు. దీంతో జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రెండో విడత జాబితాలో జిల్లాకు స్థానం దక్కుతుందా లేదా అనేది తెలియాల్సిఉంది.

News August 14, 2024

మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డీగా పోలినాయుడు

image

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓఎస్డీగా ఎం.పోలినాయుడును నియమిస్తూ మంగళవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లా పరిషత్‌లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ఓఎస్డీగా నియమించారు. 2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పోలినాయుడు అచ్చెన్నాయుడుకు ఓఎస్డీగా ఉన్నారు.

News August 14, 2024

కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైల బదిలీ

image

జిల్లాలో ఆరుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. కర్నూలు 1వ పట్టణ ఎస్సై బాలనర్సింహులును హొళగుందకు, ఎమ్మిగనూరు ఎస్సై రమేశ్ బాబు కర్నూలు 1వ పట్టణ పీఎస్, వీఆర్‌లో ఉన్న ప్రహైద్‌ను ఆదోని పీసీఆర్‌కు, తిరుపతి వీఆర్‌లో ఉన్న పరమేశ్ నాయక్‌ను మంత్రాలయం స్టేషన్‌కు, కర్నూలు వీఆర్‌లో ఉన్న హెచ్‌.డా.నాయక్‌ను ఎమ్మిగనూరు స్టేషన్‌కు, అనంతపురం జిల్లా బొమ్మనహల్‌లో ఉన్న శ్రీనివాసులును నందవరం పీఎస్‌కు బదిలీ చేశారు.

News August 14, 2024

సింహాద్రి అప్పన్న నిత్యన్నదానానికి నేటితో 35 ఏళ్లు

image

సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రారంభించిన నిత్య అన్నదాన సత్రానికి నేటితో 35 సంవత్సరాలు పూర్తికానుంది. 1989 ఆగస్టు 14వ తేదీన అప్పటి దేవస్థానం ఉద్యోగులు మొదటి విరాళంగా రూ.50 వేలుతో ఈ అన్నదానాన్ని ప్రారంభించారు. 2024 ఆగస్టు 14తో 36వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 35 కోట్ల 50 లక్షల రూపాయలు డిపాజిట్‌తో ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు.

News August 14, 2024

అనంతపురం JNTU బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

image

అనంతపురం జిల్లాలోని జేఎన్టీయూ పరిధిలో మే, జూన్ నెలల్లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్ కేశవరెడ్డి తెలిపారు. బీఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్లు, రెండో సంవత్సరం రెండో సంవత్సరం ఒకటి, రెండో సెమిస్టర్, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్, నాలుగో సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్ల సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.

News August 14, 2024

విద్యాశాఖ మంత్రితో విశాఖ నార్త్ ఎమ్మెల్యే భేటీ

image

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అమరావతిలో మంగళవారం భేటీ అయ్యారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు.

News August 14, 2024

ఆదోని: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7749 పలికింది. సోమవారంతో పోలిస్తే పత్తి ధర స్వల్పంగా రూ.10 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.4,000, వేరుశనగ గరిష్ఠ ధర రూ.7,280 కనిష్ఠ ధర రూ.3,449 పలికింది. మార్కెట్‌లో 509 క్వింటాళ్ల పత్తి, 3320 క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు జరిగినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

News August 14, 2024

ఇసుక రీచ్‌ల వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్‌ల వద్ద అవసరం మేరకు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక రవాణాకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సహజ వనరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరి అధికారులపై ఉందన్నారు.