India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కుప్పం మాజీ ఎమ్మెల్యే వెంకటేశం కుమారుడు డీవీ చంద్రశేఖర్(72) కన్నుమూశారు. నిన్న రాత్రి 12:20 గంటలకు ఆయన స్వగ్రామం గుండ్ల సాగరంలో అనారోగ్యంతో చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1967, 1972లో వరుసగా రెండుసార్లు వెంకటేశం కుప్పం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీ 25-2024 జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు ఆదివారం మధ్యాహ్నం పరీక్ష జరిగింది. ఎచ్చెర్లలోని రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, నరసన్నపేటలోని ఒక కేంద్రం, టెక్కలిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాల్లో 999 హాజరు కాగా 38 మంది గైర్హాజరయ్యారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో పచ్చిమిర్చి ధర కేజీ రూ.100 వరకు చేరింది. దీంతో సామాన్యుల వంటింటికి పచ్చిమిర్చి రానంటోంది. మిర్చి తోటల నుంచి దిగుబడి తగ్గడంతో పచ్చిమిర్చి ధర పెరిగిందని అమ్మకందారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి ధర పెరగడంతో అధికారులు రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు అమ్మకం సాగించాలని ప్రజలు కోరుతున్నారు.

తన భర్త మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని కొవ్వూరు పట్టణానికి చెందిన ఓ వివాహిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బాబురావు ఆదివారం తెలిపారు. ద్వారపూడికి చెందిన సారాదేవికి కొవ్వూరుకు చెందిన విజయ్ కుమార్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. నెలరోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత విజయ్ తనను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

నరసన్నపేట మండలం చోడవరం ఎస్సీ కాలనీకి చెందిన బక్క నీలం పెంచుకుంటున్న 30 మేకలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. పశువుల శాలలో కట్టిన 55 మేకల్లో 30 మూగజీవాలను ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నరసన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మేకల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

నేడు జరగనున్న పైడితల్లి అమ్మవారి దేవరోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్ వనంగుడిలో కొలువుదీరిన అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ఆలయ ప్రదక్షిణ అనంతరం సా.5గంటలకు ఊరేగింపుగా హుకుంపేట తీసుకొస్తారు. అక్కడ నుంచి ఘటాలతో మంగళవారం తెల్లవారుజామున కొత్తపేట, పార్కుగేటు, శివాలయం వీధి మీదుగా ఊరేగింపుతో మూడులాంతర్ల చదురుగుడికి తీసుకొస్తారు. వచ్చే రెండువారాల వరకు అమ్మవారు అక్కడే పూజలందుకుంటారు.

నకిలీ ఫేస్‌బుక్ ఐడీ సృష్టించి అర్ధ నగ్నచిత్రాలు పంపిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశామని నిడదవోలు SI అప్పారావు ఆదివారం తెలిపారు. తూ.గో. జిల్లా సమిశ్రగూడేనికి చెందిన దుర్గాప్రసాద్ పట్టణంలోని ఓ వివాహిత పేరిట ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ సృష్టించి మరో మహిళ ఫోన్‌కు మహిళల అర్ధనగ్న చిత్రాలను మార్ఫింగ్ చేసి పంపించారు. వివాహితకు విషయం తెలియటంతో పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

ప్రకాశం జిల్లా చెస్ టోర్నమెంట్‌లో పొదిలికి చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆదివారం ఒంగోలు భాగ్య నగర్‌లోని జెకె రాజు చెస్ అకాడమీలో జరిగిన అండర్ 7 బాలిక, అండర్ ఓపెన్ విభాగాల్లో పొదిలి సంస్కృతి విద్యా సంస్థలకు చెందిన జె పాణ్య శ్రీవల్లి, జె విఘ్నేష్ గుప్తా, నిహల్, విహల్‌లు రజత పతకాలను సాధించారు. ఈ విద్యార్థులను పలువురు అభినందించారు.

జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపనున్నట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఆదివారం నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని నవాబ్ పేట, కావలి 1 టౌన్, కావలి 2 టౌన్, కావలి రూరల్, ఉదయగిరి, వింజమూరు పరిధిలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

24, 31వ తేదీల్లో కౌంటింగ్ సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆర్ఓ, ఏఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డౌట్ క్లియరింగ్ సెషన్స్‌లో నిర్దేశించిన విధంగా 17సీ, పిఓ డైరీ, 17ఏ తదితర డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.