India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో డొక్కు బస్సులతో ప్రయాణికులకు నిత్యం అగచాట్లు తప్పడం లేదు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో 50 కి పైగా బస్ సర్వీసులను పెంచారు. కండీషన్‌లో లేని బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కుప్పం క్రిష్ణగిరి మధ్య రాకపోకలు సాగించే అంతర్ రాష్ట్ర బస్ శనివారం ఆర్టీసీ బస్టాండ్లో మొరాయించడంతో ఇదిగోండి ఇలా తోసి స్టార్ట్ చేశారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 27 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ ప్రకాశం జిల్లా జెడ్పీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీరందరూ గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోలుగా పనిచేస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు బదిలీపై వచ్చారు. తిరిగి మళ్లీ వారిని వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వుల వెలుపడ్డాయి.

నెల్లూరు దర్గామిట్టలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ హాజరయ్యారు. సమావేశానికి మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మంత్రి నారాయణ మీద అనేక సార్లు విమర్శలు చేస్తుంటారు. అయినా మంత్రి పట్టించుకోకుండా కరచలనం ఇచ్చి ఆత్మీయంగా పలకరించారు.

శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించారు. ‘ఎంతోమందిని బాధపడితే ఆ ఉసురు తగులుతూనే ఉంటుంది. సొంత కుటుంబమే మాట్లాడాక.. నేను ఏం చెబుతాను. కుటుంబ వ్యవహారాల గురించి మనమేం మాట్లాడతాం. దువ్వాడను ముందుగా భార్యపిల్లలకు సమాధానం చెప్పమనండి’ అని మంత్రి అన్నారు. రెండ్రోజులుగా దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

ది కృష్ణా మిల్క్ యూనియన్‌లో ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికకు శుక్రవారం నామినేషన్లు స్వీకరించగా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. విజయవాడ కృష్ణా మిల్క్ యూనియన్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభించామని, గతంలో ఎన్నడు లేని విధంగా 3 డైరెక్టర్ల పదవికి నామినేషన్లు రాలేదని ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో ఎన్నిక ప్రక్రియ ముగిసిందని ఆ అధికారి ప్రకటించడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని ఆసక్తి నెలకొంది.

ప్రకాశం జిల్లాలో విజయనగర సామ్రాజ్య కాలం నాటి పురాతన శాసనాలు బయటపడ్డాయి. యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామ సమీపంలో రెండవ దేవరాయల కాలం నాటి శాసనాన్ని స్థానికులు గుర్తించారు. ఈ శాసనం నల్లమల అడవిలో ఉన్న నంది స్తంభానికి నాలుగు వైపులా చెక్కి ఉంది.

రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల సౌకర్యార్థం డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించినట్లు చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జి.విణేశ్ తెలిపారు. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల విధానం అమలులో ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విధానాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. టికెట్ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ వసతి ఉంటుందని ప్రయాణికులు వినియోగించుకోవచ్చునని తెలిపారు.

నామినేటెడ్ పదవుల భర్తీకై సీఎం చంద్రబాబు సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఆశావహులు ఆ పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు కార్పొరేషన్ పదవులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ఊహాగానాలు వచ్చినందున ఆ పదవులు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపేట్టారు. జిల్లాలోని 10 ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానం టీడీపీ దక్కించుకుంది. దీంతో నామినేటెడ్ పోస్టలకు కూటమి పార్టీల నుంచి ఆశావహులు భారీగా ఉన్నారు.

నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పి సర్వసభ్య సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బల్లి కళ్యాణ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు.

చీరాలలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా చీరాల ఎమ్మెల్యే ఎం. కొండయ్య రైల్వే స్టేషన్లో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాగర్లమూడిలో కుప్పుస్వామి చౌదరి విగ్రహ ఆవిష్కరణకు వెంకయ్యనాయుడు హాజరయ్యేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.