Andhra Pradesh

News August 10, 2024

ధవళేశ్వరం బ్యారేజీ UPDATE

image

రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 6.81 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.40 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

News August 10, 2024

ఢిల్లీలో పంద్రాగస్టు వేడుకలకు గుంతకల్ విద్యార్థి ఎంపిక

image

దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవాల్లో నిర్వహించే పరేడ్‌లో పాల్గొనే అవకాశం గుంతకల్లులోని ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి కె.సంజీవరాయుడికి దక్కింది. కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంజీవరాయుడు NSS విభాగం తరఫున పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొననున్నారు. ఎంపికైన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మయ్య, అధ్యాపకులు అభినందించారు.

News August 10, 2024

మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు ఇన్ స్పెక్టర్ లైంగిక వేధింపులు

image

తెనాలిలో ఓ ఇన్‌స్పెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఎస్ఐ వెంకటాద్రి వివరాల మేరకు.. తెనాలి రైల్వేస్టేషన్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్‌గా మహిళ పనిచేస్తున్నారు. తనతో ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ అబ్ధుల్ ఖలీల్ అసభ్యంగా మాట్లాడటమే కాకుండా జులై 19న తనను పట్టుకుని రూంకు రావాలని వేధించినట్లు బాధితురాలు ఆర్పీఎఫ్ పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు శుక్రవారం కేసు నమోదైంది.

News August 10, 2024

కిడ్నాప్ కేసు.. కర్నూలులో వైసీపీ నేత అరెస్ట్

image

కర్నూలులో సంచలనం సృష్టించిన వ్యాపారి ప్రవీణ్ కుషాల్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేతతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 8న ప్రవీణ్‌ను కిడ్నాపర్లు బలవంతంగా అపహరించారు. తండ్రి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నేత పెద్ద మద్దిలేటి ఆయన అనుచరులు అనిల్, సురేశ్, భాస్కర్, మిథున్‌ను అరెస్ట్ చేశారు. కోడుమూరు MLA టికెట్ విషయంలో డబ్బులు తీసుకుని మోసం చేయడంతో కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది.

News August 10, 2024

ఉరవకొండ: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

image

ఉరవకొండ పట్టణంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. స్థానిక శాంతినగర్‌లో నివాసం ఉంటున్న రఫిక్ (22) అనే ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు గమనించి హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పుల బాధతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 10, 2024

సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి

image

సకాలంలో వైద్యం అందక తల్లి, బిడ్డ మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. గూడెం కొత్తవీధి మండలం ఊబ పొలం గ్రామానికి చెందిన వంతల పరిమళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా స్థానికులు చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడంతో వైద్యం కోసం నర్సీపట్నం తరలించారు. నర్సీపట్నం వైద్యులు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్పారు. బిడ్డను బయటకు తీయగా తల్లి కూడా మృతి చెందింది.

News August 10, 2024

పిఠాపురం: మట్టి గణపతిని ఏర్పాటుచేసిన పవన్ కళ్యాణ్

image

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మామిడాకులు, పూలతో పందిరిని అందంగా అలంకరించారు. వినాయకచవితికి నెలరోజుల ముందే ఈ ఏర్పాట్లు చేయడం విశేషం. కాగా చేతి సంచితో బజారుకు వెళదాం అనే సందేశంతో ఓ సంచిని వినాయకుని వద్ద ఉంచారు.

News August 10, 2024

సెంట్రల్‌ జోన్‌ అథ్లెటిక్‌ పోటీలకు దోర్నాల బాలికల ఎంపిక

image

దోర్నాలలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సెంట్రల్‌ జోన్‌ అథ్లెటిక్‌ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన అథ్లెటిక్‌ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారన్నారు. సెప్టెంబరులో జరిగే సెంట్రల్‌ జోన్‌ అథ్లెటిక్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు.

News August 10, 2024

ప్రొద్దుటూరు: ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. అరగంట ఆగిన రైలు

image

ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 9.30కు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్‌కు రైలు వచ్చి ఆగింది. బండిని ఆపే సమయంలో వర్షం పడగా, పదే పదే బ్రేకులు వేయడంతో ఏసీ బోగి చక్రాల కింద ఉన్న బ్రేకర్ నుంచి పొగ వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య ఉందని గుర్తించి, దాన్ని అధికారులు సరిచేయగా 30నిమిషాల తర్వాత రైలు బయలుదేరింది.

News August 10, 2024

కోవూరు : బాలికను గర్భవతిని చేసిన కారు డ్రైవర్

image

బాలికపై అత్యాచారం చేసి గర్భిణిని చేసిన ఘటన కోవూరులో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి మధ్యలో ఆపేసి ఇంటి దగ్గరే ఉంటోంది. ఆమె సమీప బంధువు కారు డ్రైవర్ K శ్రీనివాసులు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు నలతగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భిణిగా వైద్యులు నిర్ధారించారు. బాలికను నిలదీయగా నిజం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సోకేసు నమోదు చేశారు.