Andhra Pradesh

News August 19, 2024

శ్రీసిటీలో 15 కంపెనీలను ప్రారంభించనున్న చంద్రబాబు

image

శ్రీసిటీలో 15 పరిశ్రమలను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. శ్రీసిటీలో రూ.1570 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమల ద్వారా సుమారు 8480 మందికి ఉపాధి లభిస్తుంది. మరో ఆరు పరిశ్రమల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మరో ఐదు పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. వీటి ద్వారా 4060 మందికి ఉపాధి లభిస్తుంది.

News August 19, 2024

గుంటూరు: 21న జిల్లా అథ్లెటిక్ జట్ల ఎంపిక

image

అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో అండర్ -14, 16 బాలబాలికలు, అండర్-18, 20 యువతీ, యువకుల జిల్లా స్థాయి అథ్లెట్ల ఎంపిక నిర్వహిస్తామని ప్రధాన కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ పోటీలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 21న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారిని సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకు ఏఎన్ యూలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.

News August 19, 2024

సోనూసూద్ సాయం.. అమలాపురం కుర్రోడు అమెరికాకు

image

సినీ నటుడు సోను సూద్ అందించిన రూ.10 లక్షల ఆర్థిక సాయంతో అమలాపురం టౌన్‌కు చెందిన విద్యార్థి పిల్లాడి మధుకృష్ణ చంద్రబాబు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాడు. పంజాబ్‌లోని లూథియానా సిటీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో డిగ్రీ చేశాడు. తద్వారా జే-వన్ వీసాపై హాస్పిటాలిటీ స్టూడెంట్ ఎక్సేంజ్ విజిటర్‌గా 12నెలలు అమెరికా వెళ్లనున్నాడు. కాగా అతను చిరు వ్యాపారి కుమారుడు.

News August 19, 2024

ఏలూరు: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

ఏలూరు శనివారపుపేట ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినిని ప్రేమించాలంటూ వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శనివారపుపేట ప్రాంతానికి చెందిన పదవ తరగతి విద్యార్థినిని విష్ణు అనే యువకుడు ప్రేమించాలంటూ వేధిస్తూ ఉండడంతో బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో ఏలూరు త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 19, 2024

21న జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు

image

కడప నగరంలోని డాక్టర్ YSR క్రీడాపాఠశాలలో ఈనెల 21న జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టి. నారాయణరావు తెలిపారు.సబ్ జూనియర్,జూనియర్,సీనియర్ విభాగాల్లో బాలబాలికలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.జిల్లా జట్టుకు ఎంపికయిన వారు ఈనెల 31నుంచి సెప్టెంబర్ 1వరకు అనకాపల్లి నందు రాష్ట్రస్థాయి వెయిట్రిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు.

News August 19, 2024

చీరాల రైల్వే స్టేషన్ @125

image

చీరాల రైల్వే స్టేషన్ ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయ్యాయి. దేశంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ బ్రిటిష్ పాలకులు రైల్వే లైను నిర్మించారు. ఇందులో భాగంగా కోల్ ‌కతా, చెన్నై ప్రధాన రహదారిలో చీరాల రైల్వేస్టేషన్‌ను 1899లో అప్పటి పాలకులు ఏర్పాటు చేశారు. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజన్ పరిపాలన కింద ఉంది.

News August 19, 2024

కర్నూల్ జిల్లాలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

image

ఎమ్మిగనూరు ఎన్నికల డీటీ రఘువీర్, హొళగుంద ఆర్‌ఐ రాజశేఖరన్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. రెవెన్యూ శాఖలో విధుల్లో నిర్లక్ష్యం, వివాదాల భూములను తొలగించడం తదితర కార్యకలాపాలకు పాల్పడటంతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News August 19, 2024

కడప: ఆర్టీసీ ఈడీ నియామకంపై అయోమయం

image

కడప RTC కడప జోన్ ED నియామకంపై అయోమయ పరిస్థితి నెలకొంది. కడప పరిధిలో 8 జిల్లాలు, 52 డిపోలు, 1వర్క్షాప్ ఉండగా, అందులో దాదాపు 25 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నాలుగు జోన్లలో కడప జోన్ పెద్ద జోన్‌గా గుర్తింపు పొందింది. ప్రతినిత్యం ఈడీ పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుని అధికారులు, ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకు వెళుతుంటారు. అలాంటి కీలక అధికారి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News August 19, 2024

శ్రీకాకుళం: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు

image

విజయవాడ డివిజన్‌లో ట్రాక్ భద్రతా పనులు చేస్తున్నందున శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట మీదుగా ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌(నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు సెప్టెంబరు 2 నుంచి 28 వరకు ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాక గుడివాడ-భీమవరం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల మధ్య ఈ రైలుకు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.

News August 19, 2024

ఆరు కాళ్లతో గొర్రెపిల్ల జననం

image

అనంతపురం జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలంలోని ధర్మపురి గ్రామంలో ఎరికల నల్లప్ప అనే గొర్ల కాపరి గొర్రెకి ఆరు కాళ్లతో గొర్రె పిల్ల జన్మించింది. ప్రత్యేకంగా పుట్టిన ఈ గొర్రెపిల్లను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. విషయాన్ని స్థానిక పశువైద్యాధికారి దృష్టికి యజమాని తీసుకెళ్లారు.