India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తన బిడ్డపై కరస్పాండెంట్ దాడి చేశాడని ఓ తండ్రి నారా లోకేశ్‌కు లేఖ రాశారు. ‘ నా బిడ్డ ములకలచెరువులోని SPVB పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బిడ్డపై ఆ స్కూల్ కరస్పాండెంట్ పైశాచికంగా దాడి చేశాడు. పాఠశాలలో బంధించడంతో తప్పించుకుని నా వద్దకు వచ్చాడు. ములకలచెరువు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’ అని శ్రీసత్యసాయి జిల్లా కుక్కంటి క్రాస్‌కు చెందిన విద్యార్థి తండ్రి ఇక్బాల్ ఆరోపించారు.

కడపకు స్టీల్ ప్లాంట్ కచ్చితంగా వస్తుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ విజయవాడలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఒక్కడే రూ.2లక్షలు దోచేస్తే.. ఎమ్మెల్యే, మంత్రులు మరో రూ.2లక్షలు దోచేశారని ఆరోపించారు. పులివెందులలో వైఎస్ జగన్‌ను ప్రజలు కొట్టే పరిస్థితులు వస్తాయని చెప్పుకొచ్చారు. 2029లోనూ జగన్‌ను ఓడిస్తామని శపథం చేశారు.

తాడేపల్లి ఎయిమ్స్ రోడ్డు వద్ద ఆదివారం ఓ ప్రేమోన్మాది నర్సుగా పనిచేస్తున్న అవనిగడ్డకు చెందిన కావ్యపై బ్లేడ్‌తో గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు విజయవాడకు చెందిన క్రాంతిగా గుర్తించారు.

ఓ దినపత్రికలో నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న నయీమ్ ఖాన్ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. తన మొబైల్ నంబరుకు ఆగంతకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోన్ చెల్లించాలని, లేని పక్షంలో అసభ్యకర ఫొటోలు పంపిస్తామంటున్నారని వాపోయారు.

ప్రొద్దుటూరు లోని నాగేంద్ర నగర్ కు చెందిన వెంకటరామిరెడ్డి అదే పట్టణంలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈయన కుమారుడు చేసిన అప్పులకు సంబంధించి కమలాపురం ప్రాంతానికి చెందిన ఒక కుటుంబంతో ఇటీవల వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వారు అధ్యాపకుడి ఇంటి పైకి వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి శనివారం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

వడ్డేశ్వరంలోని వసతి గృహం వద్ద యువతిపై ఓ ఉన్మాది బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో యువతి నర్సుగా పనిచేస్తూ వడ్డేశ్వరంలోని వసతి గృహంలో ఉంటుంది. పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో దాడి చేసినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన నిందితుడు క్రాంతిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఆగస్టులో రెండు సార్లు గరుడ వాహన సేవ జరగనుంది. 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్ప స్వామివారు గరుడవాహనం పై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో మూడో విడత ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లాస్థాయి పారిశ్రామిక శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సాయి వరప్రసాద్ తెలిపారు. టెన్త్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ, టీసీ, విద్యార్థితో పాటు తల్లిదండ్రులు ఆధార్ జిరాక్స్ తీసుకువెళ్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

‘డీలర్లు రాజీనామా చేస్తే షాపులకు ఇన్‌ఛార్జ్‌గా రెవెన్యూ అధికారులను నియమించి రేషన్ బియ్యం పంపిణీ చేయాలి. అలా కాకుండా TDP నేతల గృహాల్లో దిగుమతి చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు నిద్రపోతున్నారా’ అని మాజీ మంత్రి సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపిలోని YCP కార్యాలయంలో శనివారం మాట్లాడారు. YCP సానుభూతి పరులని చెప్పి అర్హులైన వారి పింఛన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జిల్లాలోని BSNL యూజర్స్ 4Gకి అప్‌గ్రేడ్ కావాలని జిల్లా BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.ముజీబ్ బాషా పేర్కొన్నారు. BSNL దేశవ్యాప్తంగా దశలవారీగా 4జీ టెక్నాలజీని ప్రవేశపెట్టిందని శనివారం కడపలో చెప్పుకొచ్చారు. 2జీ, 3జీ యూజర్లు 4జీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అంతరాయం కలిగినప్పుడు 54040కి sim అనే sms పంపడం ద్వారా కస్టమర్లు తమ సిమ్ రకాన్ని సిమ్ రకాన్ని(2జీ/3జీ/4జీ) సులభంగా తెలుసుకోవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.