India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలు జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద శ్రీ ఈరన్న నరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. శ్రావణ మాస ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్వాహకులు, పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఆదోని DSP శివ నారాయణ స్వామి, EO వెంకటేశ్వర్లు, CIలు నాగరాజు యాదవ్, ప్రసాద్, SI నరేంద్ర కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం గొప్పిలి ప్రాంతానికి చెందిన యువతీ, యువకుడు మృతిచెందారు. జాతీయ రహదారి ఫ్లై ఓవర్ వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డుపై పడి యువతి మృతిచెందగా.. ఫ్లై ఓవర్ పైనుంచి కిందపడి యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. మంగళవారం విశాఖలో కార్మికుల సమస్యలపై ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, పీఎఫ్, పీఎస్ఐ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం వివిధ కార్మిక సంఘాల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. త్వరలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకృతి విపత్తుల సంస్థ తెలిపింది. జిల్లాలోని పలు మండలాలలో సైతం వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ప్రకటన విడుదల చేసింది. వర్షాలు కురిసే సమయంలో రైతులు వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.

కావలి రూరల్ మండలం ఆముదాలదిన్నె వాసి ఉప్పాల శివ కోటయ్య మంగళవారం బెంగుళూరులో కారు ప్రమాదంలో మృతి చెందాడు. శివ కోటయ్య తెలుగుదేశం పార్టీకి వీర అభిమానిగా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానిగా గ్రామంలో సుపరిచితుడు. కుటుంబ సభ్యులు హుటాహుటీన బెంగుళూరుకు తరలి వెళ్లారు. విషయం తెలుసుకున్న పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఏపీ సార్వతిక విద్యాపీఠం (APOS) ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులకు అడ్మిషన్ పొందడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. పదో తరగతి చేరుటకు 14 ఏళ్లు, ఇంటర్మీడియట్ చేరుటకు 15 ఏళ్లు నిండిన వారు అర్హులు. అప్లికేషన్ ప్రారంభం తేదీ 31-07-2024, అప్లికేషన్ చివరి తేదీ 27-08-2024. వెబ్ సైట్: www.apopenschool.ap.gov.in

ఆన్‌లైన్‌లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అమలాపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ క్రిస్టోఫర్ మాట్లాడుతూ.. పట్టణంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద అంబికా లాడ్జిలో బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి ఐదు లాప్టాప్‌లు, 75 మొబైల్ ఫోన్లు, చెక్ బుక్కులు, 25 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఆగస్టు 1వ తేదీన “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే 100% పెన్షన్ పంపిణీ చేసేలా.. అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. విజయవాడ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఒకటో తేదీ 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఏర్పాటైన ‘యాంటి నార్కోటిక్ సెల్’ బృందాలు మంగళవారం 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాయని విజయవాడ సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సెల్ ద్వారా ఇప్పటివరకు 77 మందిని అదుపులోకి తీసుకుని 28 కేసులు నమోదు చేసి 185 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా గంజాయి కట్టడికై విజయవాడ పోలీసుల చొరవను డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రశంసించారు.

పోలవరం MLA చిర్రి బాలరాజుపై జరిగిన <<13739566>>దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నానని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. ‘X’ వేదిక స్పందిస్తూ.. దోషులు ఎవరైనా సరే కఠిన శిక్షపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం అవ్వకుండా కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు.
Sorry, no posts matched your criteria.