India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈపూరు మండలం అరేపల్లి ముప్పాళ్లలో పిడుగుపాటుకు గురై కర్రి హనుమంతరావు (40) అనే రైతు మృతి చెందాడు. హనుమంతరావు శనివారం గేదెలను మేపేందుకు వెళ్ళినప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుండగా గ్రామ సమీపంలోని నరసింహస్వామి ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే పిడుగుపడి హనుమంతరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.

జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఇవాళ కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో సూక్ష్మ స్థాయిలో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ కౌంటింగ్‌లో క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ, ఎవరు, ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలిచ్చారు. జూన్ 1 నుంచి 6 వరకూ ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ తెలిపారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం రావులపాలెం వద్ద గౌతమి గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరొక యువకుడు ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టగా.. ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

సంగంలోని కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి సంగానికి చెందిన పెంచలయ్య అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై నాగార్జున రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం డివిఎన్ కాలనీలో శనివారం కురిసిన భారీ వర్షానికి చెట్టు కింద ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్న అలగసాని నారాయణ (37) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన కుటుంబసభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి తోడుగా పిడుగులు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జొన్నగిరి గ్రామ పొలాల్లోకి వెళ్లి వజ్రాల అన్వేషణ ను శనివారం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఆశలు చిగురించి ఈఏడాది జనం భారీగా పొలాల్లోకి తరలి వస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో తూ.గో కలెక్టర్ సూచనల మేరకు నన్నయ విశ్వవిద్యాలయంలో రోజువారి కార్యక్రమాలను జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు వీసీ కె.పద్మరాజు తెలిపారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న కారణంగా క్యాంపస్‌ను ‘నో మ్యాన్ జోన్’గా కలెక్టర్ ప్రకటించారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సహకరించాలని వీసీ కోరారు.

ఎన్నికల నేపథ్యంలో తూ.గో కలెక్టర్ సూచనల మేరకు నన్నయ విశ్వవిద్యాలయంలో రోజువారి కార్యక్రమాలను జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు వీసీ కె.పద్మరాజు తెలిపారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న కారణంగా క్యాంపస్‌ను ‘నో మ్యాన్ జోన్’గా కలెక్టర్ ప్రకటించారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సహకరించాలని వీసీ కోరారు.

సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం మాచర్ల పట్టణంలో శనివారం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు దిగారు. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల జరిగిన అల్లర్ల పై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను సస్పెండ్, అండ్ ట్రాన్స్ఫర్ చేసిన విషయం విదితమే. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ కూడా విధించారు.

అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమి శాలిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన అమిత్ బర్దర్‌ను ఎన్నికల ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన సంగతి విదితమే. నూతన ఎస్పీ గౌతమి శాలి వెంటనే వెంటనే విధుల్లో చేరాలని అదేశాల్లో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.