Andhra Pradesh

News May 18, 2024

తిరుపతి జిల్లా SPగా హర్షవర్ధన్‌

image

తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌ను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు ఇక్కడ ఎస్పీగా పని చేసిన కృష్ణ కాంత్ పటేల్ తిరుపతి స్ట్రాంగ్ రూముల వద్ద జరిగిన గొడవను అదుపు చేయడంలో విఫలం అయ్యారంటూ ఆయన్ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్త ఎస్పీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

News May 18, 2024

మార్టూరు: కాలువలోకి బైక్.. వ్యక్తి మృతి

image

బైక్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మార్టూరు మండల పరిధిలోని కొమ్మూరు మేజర్ కాలువలో శనివారం చోటుచేసుకుంది. బల్లికురవ మండలం కొణిదెన గ్రామానికి చెందిన తన్నీరు లక్ష్మయ్య (60) బ్రహ్మంగారి మఠంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లక్ష్మయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News May 18, 2024

పెట్రోల్ ట్యాంకర్ టైర్ పేలి అయిదుగురికి తీవ్ర గాయాలు

image

ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ టైర్ పేలడంతో ఆ ట్యాంకర్ అదుపుతప్పి ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 18, 2024

BREAKING: పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్

image

పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్ నియమితులయ్యారు. ఆమె గతంలో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశారు. తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీగా రెండున్నరేళ్లకు పైగా పని చేశారు. అనంతరం తిరుపతి ఎస్పీగా పని చేశారు. మలికా గార్గ్ పశ్చిమ బెంగాల్‌కి చెందిన పోలీస్ అధికారిని.

News May 18, 2024

ఆలూరు ఏడీఈపై సస్పెన్షన్ వేటు

image

ఆలూరు విద్యుత్ శాఖ ఏడీఈ నాగేంద్ర ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల ముందు రోజు హాలహర్వి మండలంలో పలుచోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. హొలగుంద మండలంలో ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాల అనధికారిక ఏర్పాట్లు, మే 13న పలు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకు విద్యుత్ అసౌకర్యం నెలకొనడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం వహించడం, అవినీతికి పాల్పడడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు.

News May 18, 2024

ప్రకాశం: గెలుపుపై ఎవరి లెక్కలు వారివి

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు, ఓటములపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు మునిగితేలుతున్నారు. బూత్‌ల వారీగా పోలైన ఓట్లను సమీక్షిస్తూ లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మహిళల ఓటింగ్ ఎక్కువగా జరిగింది. దీంతో ఎవరిని విజయం వరిస్తుందో.. ఓటర్లు ఎవరి వైపు నిలిచారో తెలియాలంటే జూన్ 4న ఆగాల్సిందే.

News May 18, 2024

BREAKING: పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్ లాట్కర్

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్ లాట్కర్ నియమితులయ్యారు. ఈయన 2011 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రోస్‌ సంస్థకు, అగ్రికల్చర్‌ కోఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉపాధ్యక్షుడిగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా పనిచేస్తుండగా.. బదిలీపై పల్నాడుకు కలెక్టర్‌గా రానున్నారు.

News May 18, 2024

శ్రీశైలం ప్రాజెక్టులో కుక్కను చంపిన చిరుత

image

శ్రీశైలం వెస్టర్న్ కాలనీలోని నల్లబోతుల మల్లికార్జున ఇంటి ఆవరణలో కట్టేసిన కుక్కను చిరుత పులి చంపిన ఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. రాత్రి రెండు గంటల సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని ఆ సమయంలో బయటకు రాకుండా ఉదయం చూస్తే కుక్క చనిపోయి ఉందన్నారు. అటవీశాఖ సిబ్బంది వచ్చి పరిశీలించి చిరుతపులి దాడి చేసినట్లు పేర్కొన్నట్లు తెలిపారు.

News May 18, 2024

అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం: గోపీనాథ్ రెడ్డి

image

ఆంధ్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏపీ‌ఎల్ సీజన్‌పై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 30 నుంచి జూలై 13 వరకు ఈ సీజన్ కొనసాగుతుందని వివరించారు. మొత్తం 19 మ్యాచులు జరగనున్నట్లు వివరించారు. కడపలో 7, విశాఖలో 12 మ్యాచులు నిర్వహిస్తామన్నారు.

News May 18, 2024

ఏలూరు జిల్లాకు సాయిధరమ్ తేజ్

image

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పనవీడులో వేంచేసియున్న అభయ ఆంజనేయ స్వామిని సినీ హీరో సాయిధరమ్ తేజ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దెందులూరు జనసేన పార్టీ ఇన్‌ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి శాలువాతో ఆయణ్ను సత్కరించారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.