India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తర్లపాడు మండలం సీతానాగులవరం గ్రామ సమీపంలో శనివారం బొలెరో వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో తర్లుపాడు ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుంది. ఇప్పటికే పార్లమెంటు స్థానంతో పాటు నెల్లూరు రూరల్, సిటీ, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను ప్రియదర్శిని కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.

జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఫలితాలకు 2 వారాలు సమయం ఉండటంతో బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో ఓ పార్టీ గెలుస్తుందని రూ. 10 లక్షలకు రూ.8 లక్షలు, మరో పార్టీ తరఫున రూ.10 లక్షలకు రూ. 6 లక్షలు చెల్లించుకునేలా పందేలు కాస్తున్నారని సమాచారం. పోలింగ్ శాతం భారీగా నమోదు కావడంతో ఇరు పార్టీల తమ అంచనాల మేరకు గెలుపుపై ధీమాగా ఉన్నారు.

గాజువాకకు చెందిన మూడున్నరేళ్ల సమ్మంగి వెంకట వేదాన్షిక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సంపాదించింది. ‘రోప్ నిచ్చెనను అధిరోహించడానికి, దిగడానికి అత్యంత వేగవంతమైన చిన్నారి’ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని వరల్డ్ బుక్ రికార్డ్స్ నిర్ధారించింది. వేదాన్షిక స్థానిక ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీ ప్రైమరీ క్లాస్ చదువుతోంది. ఈ సందర్భంగా వేదాన్షికను పాఠశాల అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.

రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ శనివారం ఉమ్మడి ప.గో. జిల్లాలో పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో, ప.గో.జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకులో వివిధ పాఠశాలలను సందర్శించనున్నారు. పాఠ్యపుస్తకాల వివరాలను స్టాక్ పాయింట్లను పరిశీలిస్తారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పాఠ్యపుస్తకాల వివరాలను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

కోడిగుడ్డు ధర పెరిగింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.7కు విక్రయం జరుగుతోంది. ప్రస్తుతం ధర పెరిగినప్పటికీ రైతుల నుంచి రూ.5కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 300 పౌల్ట్రీలు ఉన్నాయి. దాదాపు 1.40 కోట్ల కోళ్ల పెంపకం జరుగుతుంది. రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కోడిగుడ్డుకు నికరంగా రూ.6 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.

రొయ్యల చెరువులో పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కైకలూరు నియోజకవర్గ పరిధి ముదినేపల్లిలోని రొయ్యల చెరువులో కోల్‌కతాకు చెందిన షైపుల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన బొర్రా బాలసాయి పనిచేస్తున్నారు. శుక్రవారం షైపుల్లా స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని కాపాడే క్రమంలో బాలసాయి మృతి చెందాడు.

పల్నాడులో పెద్ద పెద్ద మెత్తంలో పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు విజయవాడ నగరంలో సీసాలు, డబ్బాలలో పెట్రోల్ విక్రయాలు నిషేదించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, పోలీస్ కమిషనర్ తమకు ఆదేశాలు జారీ చేశారని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు వెల్లడించాయి. ఈ మేరకు ఎం.జీ రోడ్డులోని పైలట్ సర్వీస్ స్టేషన్ యాజమాన్యం పెట్రోల్, డీజిల్‌ను డబ్బాలలో విక్రయించేది లేదని స్పష్టం చేశాయి

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా మంబై స్వదేశీ సర్వీస్ నడిపేందుకు ఎయిర్ ఇండియా విమాన సంస్థ ముందుకొచ్చింది. జూన్ 15 నుంచి ప్రత్యేక ముంబై సర్వీస్ నడపనున్నట్లు విమాశ్రయ అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రతిరోజు సాయంత్రం 3.55గంటలకు చేరుకోనున్న సదరు సర్వీస్ రాత్రి 7.10గంటలకు తిరిగి బయలుదేరి 9 గంటలకు ముంబై చేరుకుంటుందన్నారు. ఈ సర్వీస్ 180మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు.

ఎర్రగుంట్లలోని శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్టీపీపీ కాంట్రాక్ట్ కార్మికుడు వల్లెపురెడ్డి సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సుదర్శన్ రెడ్డి జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.