India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీవారికి స్వరార్చన వారి నేతృత్వంలో పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య జయంతి వార్షికోత్సవాలు పట్టణంలోని స్ధానిక కత్తెర వీధి శ్రీ రాజరాజేశ్వరీ ఆలయంలో ఈ నెల 23 తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగనుంది. శ్రీకాకుళం పరిసర ప్రాంత గాయనీ గాయకులు అన్నమాచార్య కీర్తనలతో స్వరార్చన చేస్తారని అనంతరం విశాఖపట్నానికి చెందిన కళాకారులు చే గాత్ర కచేరీ ఉంటుందని నిర్వహకులు తెలిపారు,.

మనుబోలు మండల పరిధిలోని హైవేపై వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన సాంబశివరావు (40) మృతి చెందాడు. లారీ డ్రైవర్ సాంబశివరావు లారీతో గుంటూరు నుంచి తిరుపతి వెళుతున్నాడు. వీరంపల్లి రోడ్డు వద్ద లారీని ఆపి ఇంజిన్ ఆయిల్ పోస్తుండగా నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న వాహనం ఢీ కొని చనిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పదవ తరగతి సప్లి మెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి జూన్ 3 వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ దేవరాజు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. 2006 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.

డోన్ పట్టణ రైల్వే గేటు వద్ద ఈనెల 12న ఓ మగ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. డోన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిబ్బందితో కలిసి సీడీపీఓ.. పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించి బాబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కర్నూలు చైల్డ్ హోమ్‌కు తరలించారు. బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు, బంధువులు తగిన ఆధారాలు చూపించి తీసుకెళ్లాలని శుక్రవారం కోరారు.

చీరాల మండలం విజయనగర కాలనీలో విషాదం చోటుచేసుకుంది. వినోద్, దివ్య దంపతుల కుమారుడు వియాన్ హన్స్(11 నెలలు) ఆడుకుంటూ.. నీటి మోటార్ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో నెలలో మొదటి పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఆ చిన్నారి.. విగత జీవుడై మృత్యుఒడికి చేరడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజుల పాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ.రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నారు.

విద్యుదాఘాతంతో ఓ యువకుడుప్రాణాలు కోల్పోయిన ఘటన దత్తిరాజేరు మండలంలో జరిగింది. ఎస్సై శిరీష వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన కార్తికేయన్(43) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు.తమిళనాడు నుంచి డ్రైవర్ చంద్రకుమార్ తోకలిసి శ్రీకాకుళం జిల్లా పలాసకు టైర్ల లోడుతో వెళ్లాడు.అక్కడ టైర్లను దింపి పెదమానాపురం సంతకు వచ్చారు. వర్షం వస్తుందని టార్పాలిన్ కప్పేందుకు లారీ పైకి ఎక్కగా విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు.

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ, కూటమి పార్టీల నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి జరగడంతో ఓటర్లు ఇరు పార్టీల్లో సమానంగా ఓటువేశారని ప్రచారం జరుగుతోంది. రెండు ఓట్లు ఒకే పార్టీకి వేశారా..? లేక వేర్వేరు పార్టీలకు వేశారా..? అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఏదేమైనా జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

విశాఖ జూకి ఒకటి రెండు నెలల్లో కొత్త వన్యప్రాణులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు జూ క్యూరేటర్ నందిని సలారియ తెలిపారు. బెంగళూరు జూ నుంచి మీరు కాట్, రెడ్ నెట్ వాలబీ, స్వైరల్ మంకీస్, మర్మోసెట్స్,గ్రీన్ వింగ్డ్ మకావ్ తదితర జాతులను తీసుకురానున్నట్లు తెలిపారు. జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టోర్టోయిస్ లను తీసుకురావడానికి సిజెడ్ఏ అనుమతులు లభించినట్లు పేర్కొన్నారు.

విజయవాడ రైల్వే డివిజన్‌లో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి జాన్ 4 వరకు మచిలీపట్నం-విశాఖపట్నం మధ్య నడిచే రైలు నం.17219, రైలు నం.17220 రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.