India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏలూరులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనంద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మదనపల్లెలో రికార్డుల దగ్ధం తర్వాత భూకబ్జా బాధితుల నుంచి ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరించింది. ఈక్రమంలో పెద్దిరెడ్డి, మాధవరెడ్డి, వైసీపీ నేతలు, తదితరులపై మొత్తం 229 ఫిర్యాదులు అందాయి. ఎవరిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయంటే..
➤ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: 20
➤ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి: 8
➤ వి.మాధవ రెడ్డి: 9
➤ వైసీపీ నేతలు: 27
➤ పేర్లు ప్రస్తావించనవి: 69
➤ ఇతరుల పేర్లుతో: 96

ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో 7 పెద్ద పులులున్నాయని జూ క్యూరేటర్ నందని సలారియ తెలిపారు. నాలుగు తెల్ల పులులు (రెండు జతలు) కాగా మరో మూడు ఎల్లో టైగర్స్ (ఒకటి మగ, రెండు ఆడ) సందర్శకులను అలరిస్తున్నాయని చెప్పారు. జంతు సంరక్షకులు వీటికి సమయానికి ఆహారం, నీరు అందిస్తున్నట్లు తెలిపారు.

మంగళగిరి పరిధి పెదవడ్లపూడి శివారులో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపిన వివరాల మేరకు.. కెనాల్ గేటు మీదపడటంతో శ్రీహర్ష(14) అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. బాలుడు అక్కడికి ఎందుకు వెళ్లాడు, ఎలా మృతి చెందాడనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గార మండలం కోళ్లపేట గ్రామంలో సాగునీటి కోసం జరిగిన తోపులాటలో వృద్ధుడు మృతి చెందిన ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తట్ట తౌడు(70) తన పొలానికి వెళ్తున్న సాగునీరు వంజల సునీత పొలం మీదుగా వెళుతుండడంతో నీటిని తౌడు తన పొలానికి మళ్లించాడు. ఇది తెలుసుకున్న సునీత పొలం వద్దకు వచ్చి ఘర్షణకు దిగి ఒకరికొకరు తోసుకోగా తౌడు కిందపడి గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

విజయనరగం జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపనున్నట్లు అధికారులు వెల్లడించారు. గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై ఎలాంటి సమాచారం ఉన్నా టాస్క్ ఫోర్స్ సీఐ 9121109416 నంబరును సంప్రదించాలని తెలిపారు.

వెంకటాపురంలోని ఉర్దూ స్కూల్ సమీపంలో ఆదివారం ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు నుంచి పాలు వస్తుండటంతో ఈ వింతను చూడటానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. చెట్టు బెరడులో నుంచి పాలు రావడం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చక్కర్లు కొడుతోంది.

సుమారు 75 మందిని మోసం చేసిన ఘరానా మోసగాడు పోలీసులకు చిక్కాడు. కమలాపురానికి చెందిన కైప నాగేంద్రప్రసాద్ శర్మ తక్కువ ధరలకే కార్లు, భూములు ఇప్పిస్తానని చెప్పి రూ.12.83కోట్లు దండుకున్నాడు. ఇతడిని 2021లో KPHB పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు. అరెస్ట్ చేద్దామని వస్తే వాగ్వాదం పెట్టుకునేవాడు. బెంగళూరులో ఉన్న అతడిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండుకు తరలించారు.

తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన యాడికి మండలంలో జరిగింది. లక్షుంపల్లికి చెందిన చంద్ర, దాసరి బలరాముడు అన్నదమ్ములు. ఈనెల 26న బలరాముడు గుండెపోటుతో మృతిచెందాడు. తమ్ముడి అంత్యక్రియలకు వెళ్లిన అన్న ఇంటికి తిరిగి వెళ్లలేదు. ఆదివారం ఉదయం తోటకు వెళ్లగా చెట్టుకు ఉరివేసుకుని ఉన్న చంద్ర కనిపించాడు. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

తనతో అప్పులు చేయించి భర్త మోసం చేశాడంటూ విశాఖపట్నంకు చెందిన అచ్యుతాంబ ఆదివారం ఆరోపించారు. కాకినాడ అర్బన్ జగన్నాథపురం ముత్తానగర్‌లో భర్త ఇంటి ముందు నిరసన చేపట్టారు. ముత్తానగర్‌కు చెందిన జయరాజు 2019లో తనను వివాహం చేసుకున్నారన్నారు. వ్యాపారం కోసం విశాఖలో పలువురి నుంచి రూ.28 లక్షలు తన ద్వారా అప్పుగా తీసుకున్నారని, 20 కాసుల బంగారం తాకట్టుపెట్టి రూ.10 లక్షలు ఇవ్వగా, తనను మోసం చేశాడని వాపోయారు.
Sorry, no posts matched your criteria.