India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వజ్రకరూరు మండలం కమలపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కమలపాడుకు చెందిన రవితేజ, అజయ్, నరేష్ కొనకొండ్ల జడ్పీ పాఠశాలలో టెన్త్ పరీక్షలు రాశారు. బైక్‌లో ముగ్గురు కమలపాడుకు బయలుదేరారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు.
గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రహదారిపై ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయని, ఈ ఘటనలో ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైందన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కోటబొమ్మాళి మండల కేంద్రం స్టేట్ బ్యాంకు సమీపంలో పలాసకు చెందిన బతకల పార్వతి(45) శనివారం ఆటోనుంచి జారిపడి మృతి చెందింది. రెండు రోజుల క్రితం కోటబొమ్మాళి వంట పనులకు వచ్చి తిరిగి వెళుతుండగా ఆటోలో నుంచి జారిపడి తలకు దెబ్బ తగిలింది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కోటబొమ్మాళి ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
చెరువులో దూకి భవన కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శనివారం మదనపల్లి మండలంలో చోటుచేసుకుంది. తాలూకా సిఐ ఎన్ శేఖర్ కథనం మేరకు.. బసినికొండ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ వద్ద నివాసం ఉంటున్న కొండయ్య (37) వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు. శనివారం బసినికొండ పొంతల చెరువులోని నీటిపై మృతదేహం తేలియాడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొండయ్య మృతదేహాన్ని వెలికి తీశారు.
బనగానపల్లె పట్టణం ఖాజీ వాడలో నివాసం ఉంటూ యనకండ్ల గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షాషావలి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఖాజీ వాడాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చిన్ననాటి స్నేహితుడు టీచర్ షాషావలి మృతి చెందడం పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు.
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మురళీక్రిష్ణ శనివారం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించిన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కిలేశపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇరువురు హర్ష (21) వెంకటేష్ (21) గా గుర్తించారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ కాలేజ్ విద్యార్థులుగా తెలుస్తోంది.. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల కోడు ఉల్లంఘనలో భాగంగా ఎల్కోట మండలం ఖాసాపేట సచివాలయం పరిధిలో క్లస్టర్-6 వాలంటీర్ బొబ్బిలి శివను తొలగించినట్లు ఎల్ కోట ఎంపీడీవో కే రూపేష్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మొబైల్‌లో రాజకీయ నాయకుల స్టేటస్లు పెడుతూ ప్రచారం చేస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు పై ఇతనిపై చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వేతనం తీసుకుంటున్న అందరికీ నిబంధన వర్తిస్తుంది అన్నారు.
ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులు ఎట్టకేలకు ఖరారయ్యారు. పోలవరం టికెట్‌పై జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు కేటాయించగా.. కొద్ది రోజులుగా ఉన్న సందిగ్ధత వీడింది. పొత్తులో భాగంగా 6 స్థానాల్లో జనసేన, 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీకి పోటీ చేసే అవకాశం రాలేదు. మరి కూటమి అభ్యర్థులు ఎన్నింట విజయం సాధించేనో చూడాలి మరి.
పి.గన్నవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్లో గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఎకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి ఈ ఏడాది జనవరి 31న స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. పి.గన్నవరం మండలం ఉడిమూడికి చెందిన సత్యనారాయణ సీఆర్ రెడ్డి కళాశాలలో బీఏ, బీఎల్ చదివారు. 1961 మే 15న జన్మించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరి పి.గన్నవరం ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.