Andhra Pradesh

News May 17, 2024

మట్టి పెళ్లలు పడి వ్యక్తి మృతి

image

గుమ్మగట్ట మండలం ఆర్.కొత్తపల్లి గ్రామ చెరువులో ఇసుక తవ్వుతుండగా రాజశేఖర్ అనే వ్యక్తిపై మట్టి పెళ్లలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గలగల గ్రామానికి చెందిన రాజశేఖర్ ట్రాక్టర్‌లో కూలి పనికి వెళ్లాడు. ఆర్.కొత్తపల్లి చెరువులో ఇసుక తవ్వుతుండగా మట్టి పెళ్లలు మీద పడ్డాయి. దీంతో ఊపిరాడక రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News May 17, 2024

వింజమూరు: పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై కత్తితో దాడి

image

వింజమూరు మండలం పాతూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించడంతో యువతిపై యువకుడు కత్తితో దాడికి దిగాడు. ఘటనలో అడ్డొచ్చిన యువతి తల్లికి కూడా తీవ్రగాయాలవ్వడంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నాగార్జునను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలయాల్సి ఉంది .

News May 17, 2024

తిరుపతి: ముప్పుతిప్పలు పెడుతున్న ఏనుగు

image

తిరుపతి జిల్లా పాకాలలో ఏనుగు అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. వారం క్రితం అరగొండ సమీపంలో ఒకరిని ,వెంగంపల్లి వద్ద మరొకరిని ఈ ఏనుగు పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.. దీంతో ఏనుగు కోసం అటవీ అధికారులు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఏనుగు ఎప్పుడు ఏ ప్రాంతంలోకి చొరబడుతుందో అని ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.

News May 17, 2024

ఓటు హక్కును వినియోగించుకోని ఎమ్మెల్యే బుర్రా

image

కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. మున్సిపాలిటీలోని మూడో వార్డు బూత్ నంబర్ 126లో నమోదైనా.. ఓటు వేయలేదు. నియోజకవర్గానికి ప్రథమ పౌరులైన తన ఓటు హక్కును వినియోగించుకోకపోవడంతో ప్రజాస్వామ్యవాదులు పలు విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎమ్మెల్యే వినియోగించుకోకపోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.

News May 17, 2024

రైల్వే కోడూరు విద్యార్థినికి రూ.1.42 కోట్ల జీతం

image

రైల్వే కోడూరుకు చెందిన నికిత ఏడాదికి రూ.1.42 కోట్ల జీతంతో అమెరికాలో ఉద్యోగం సాధించారు. రైల్వే కోడూరులోని మాచినేని విశ్వేశ్వర నాయుడు, షర్మిల దంపతుల కుమార్తె నికిత అమెరికాలోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. ఆమెకు న్యూజెర్సీలోని న్యూబిస్ కమ్యూనికేషన్స్ సంస్థలో సంవత్సరానికి రూ.1.42 కోట్ల జీతంతో ఉద్యోగం లభించింది.

News May 17, 2024

కూటమిదే విజయం: ఆనం రామనారాయణ రెడ్డి

image

సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది అధికారులు జగన్ రెడ్డికి ఊడిగం చేశారని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార యంత్రాంగం ఇంతకు దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సర్వే సంస్థతో తీసుకున్న సెల్ఫీ జగన్‌కి ముగింపు అని అన్నారు.

News May 17, 2024

టెక్కలి: అమ్మవారి విగ్రహాల ధ్వంసం

image

టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ పరిధిలోని జీడి పేట గిరిజన గ్రామం సమీపంలో ఉన్న శ్రీ వనదుర్గమ్మ తల్లి ఆలయంలోని విగ్రహాలను 2 రోజుల క్రితం దుండగులు ధ్వంసం చేశారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు శుక్రవారం నాటికి సామాజిక మాధ్యమాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విగ్రహాలు ధ్వంసం చేయడం చుట్టు పక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. టెక్కలి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం.

News May 17, 2024

VZM: రవాణా శాఖలో సాంకేతిక సమస్యలు..!

image

జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో పలు రకాల సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. వివిధ పనుల కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి చేరుకుంటున్న వాహనదారులు సర్వర్ డౌన్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ డౌన్‌కి సంబంధించిన సమాచారాన్ని నోటీసు బోర్డులో పెట్టడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు.

News May 17, 2024

TPT: దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నందు 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య (ఆన్ లైన్) విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రాంతీయ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://ignouadmission.samarth.edu.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 30.

News May 17, 2024

ఏలూరు: SO SAD: నాలుగేళ్ల బాలుడు గోతిలో పడి మృతి

image

నాలుగేళ్ల బాలుడు గోతిలో పడి మృతిచెందిన ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నామవరం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చంటి అమలాపురంలో SIగా విధులు నిర్వహిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి గ్రామానికి వచ్చారు. కాగా గురువారం ఎస్ఐ కుమారుడు (4) ఆడుకుంటూ ఇంటి వెనకాల ఉన్న గోతిలో పడి మృతి చెందారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.