Andhra Pradesh

News May 17, 2024

తూ.గో.: భార్యను తిట్టాడని.. హత్య

image

తూ.గో. జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో దారుణ హత్య జరిగింది. SI రామారావు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పులగం సూర్యనారాయణ రెడ్డి(65) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కాగా బుధవారం గ్రామానికి చెందిన శివారెడ్డి, అతని భార్యను దూషించాడు. దీంతో గురువారం రాత్రి గ్రామ శివారు దూడలపాకలో ఒంటరిగా ఉన్న సూర్యనారాయణరెడ్డిని శివారెడ్డి కర్రతో కొట్టి చంపాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేశామన్నారు.

News May 17, 2024

కృష్ణా: అభ్యర్థుల గెలుపోటములపై రూ.లక్షల్లో పందేలు

image

జిల్లాలో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, అభ్యర్థుల మెజారిటీ, గెలుపోటములపై రూ.లక్షల్లో పందేలు కాస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గన్నవరం, గుడివాడలో రూ.లక్షకు రూ.2 లక్షలు ఇచ్చేలా పందేలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మధ్యవర్తులూ బాగా వెనకేసుకుంటున్నారని, 10 శాతం కమీషన్ తీసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

News May 17, 2024

సంగం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సంగం మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతుడు మర్రిపాడు మండలం, ఇర్లపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్‌గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

News May 17, 2024

విజయనగరం రైలు ప్రమాదానికి వారి నిర్లక్ష్యమూ కారణమే: పాండీ

image

గతేడాది అక్టోబరు 29న కంటకాపల్లి-అలమండ స్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదానికి సీనియర్ రైల్వే ఆపరేటింగ్ అధికారుల నిర్లక్ష్యమూ కారణమేనని ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సంజయ్ పాండీ పేర్కొన్నారు. అదే రోజు మూడు రైళ్లు సిగ్నళ్లను జంప్ చేశాయన్న ఆయన.. నిర్దేశిత వేగం కంటే అధొక వేగంతో వెళ్లినట్లు డేటాలాగర్ పరికరంలో నమోదైనా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు.

News May 17, 2024

కూటమిదే అధికారం: కేఈ కృష్ణమూర్తి

image

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తదితరులతో పోలింగ్ సరళిపై విశ్లేషించారు. 2019లో జగన్ మోసపూరిత వాగ్దానాలతో గెలిచారన్నారు.

News May 17, 2024

పల్నాడు అల్లర్లు.. మరికొందరిపై వేటు

image

పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే పల్నాడు జిల్లా SPని సస్పెండ్ చేయగా.. కలెక్టర్‌ను బదిలీ చేశారు. గురజాల డీఎస్పీ ఎ.పల్లపురాజు, స్పెషల్ బ్రాంచ్ సీఐలుగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ రావు, బాల నాగిరెడ్డి‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కారంపూడి, నాగార్జునసాగర్ ఎస్సైలు.. ఎం.రామాంజనేయులు, డీవీ కొండారెడ్డిలపై కూడా సస్పెండ్ వేటు వేశారు.

News May 17, 2024

ఏలూరు: బాలికతో బలవంతంగా పెళ్లి.. అత్యాచారం

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. పెదవేగి SI రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి చదివిన బాలికను పెళ్లిచేసుకుంటానని ఈ నెల 10న కవ్వకుంటకు చెందిన బెజవాడ పవన్ బయటకు తీసుకెళ్లాడు. బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో.. యువకుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

News May 17, 2024

వెలిగండ్ల: దారుణం.. కొడవలితో దాడి

image

వెలిగండ్ల మండలం పందువ గ్రామంలో ఎస్సీ పాలెంకు చెందిన జుటికే తిమోతి టీడీపీకి ఓటు వేశాడని అదే గ్రామానికి చెందిన గురవయ్య కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తిమోతి చెవి భాగానికి నాలుగు కుట్లు పడ్డాయి. బాధితుడు తిమోతి గురువారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News May 17, 2024

కడప: భగ్గుమంటున్న కూరగాయల ధరలు

image

జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పచ్చిమిరపకాయల ధర ఒక్కసారిగా 70 రూపాయలకు చేరింది. అల్లం ధర రూ.170 పలుకుతోంది. బీన్స్ కిలో రూ.75 పలుకుతోంది. క్యాప్సికం, కాకర కిలో రూ.60, బీరకాయ, అలసంద కాయలు కిలో రూ.55 పలుకుతున్నాయి. టమోటా, వంకాయలు మాత్రమే కిలో రూ.20 ఉండగా మిగిలిన కూరగాయల ధరలన్నీ భారీగా పెరిగాయి.

News May 17, 2024

రవాణాలో విశాఖ పోర్ట్ సరికొత్త రికార్డు

image

సరుకు రవాణాలో విశాఖ పోర్ట్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 45 రోజుల్లో 10 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా గత ఏడాది రికార్డును అధికమించిందని పోర్టు కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. గత ఏడాది 2023-24లో 47 రోజుల్లో 10 మిలియన్ల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు తెలిపారు. అదే ఇంతవరకు రికార్డుగా ఉండేదని, ఆ రికార్డును తిరిగి రాసిందని అన్నారు.