India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఆయన గురువారం కోనసీమ జిల్లా చెయ్యేరు ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూముల వద్ద చేపట్టిన భద్రతా చర్యలపై సమీక్షించారు. మూడంచెల భద్రతలో భాగంగా కేంద్ర సాయుధ బలగాలు, సివిల్ పోలీసులను అక్కడ ఉంచామన్నారు. పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని చెప్పారు. ఎస్పీ శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై సీఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటువేసింది. డీఎస్పీతో పాటు తిరుపతిలోని పలువురు సబార్డినేట్ అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదికలు ఇవ్వాలని తెలిపింది. ఫలితాల వేళ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

నంద్యాల జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఓ పార్లమెంట్ సెగ్మెంట్‌కు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ఆర్ఓలు, నోడల్ అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ మేరకు JC రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్పీ రఘువీర్ రెడ్డితో కలిసి సమీక్షించారు. RGM, SREC కళాశాలలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అనంతరం EVM ఓట్లు లెక్కించాలన్నారు.

లింగాలలోని స్థానిక నందలి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ) నందు 2024-25 సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లింగాల ఐటిఐ ప్రిన్సిపల్ శాంతయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జూన్ 10వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఏలూరు జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని DRO పుష్పరాణి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఈ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. పరీక్షల కోసం జిల్లాలో 27 కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఫస్ట్ ఇంటర్ 7,744 మంది, ఒకేషనల్ 920 మంది, సెకండ్ ఇంటర్ 3,209 మంది, ఒకేషనల్ 924 మంది కలిపి మొత్తం 12,797 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు.

అనంతపురం జిల్లాలోని JNTUలో భద్రపరిచిన EVM స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అనంతపురం డీఎస్పీ ప్రతాప్, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజు ఆదేశించారు. జిల్లా ఎస్పీ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్ రూముల వద్ద సాయుధ పోలీసులచే గార్డులు నిర్వహిస్తూ నిరంతర భద్రత (24×7) కల్పిస్తున్నారు. JNTU వద్ద ఫుట్ పెట్రోలింగ్, వజ్ర వాహనం ద్వారా గస్తీ కొనసాగిస్తున్నారు.

కంచిలి మండలం మకరంపురం గ్రామానికి చెందిన బెందాళం సాత్విక్ ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 కు ఎంపికయ్యారు. ఏపీఎల్‌కు జరిగిన వేలం పాటలో బెందాళం సాత్విక్ 1.6 లక్షలకు ఉత్తరాంధ్ర లయన్స్ తరఫున ఆడబోతున్నట్లు సాత్విక్ తండ్రి భోగేశ్ తెలిపారు. ఈ మేరకు మకరంపురం గ్రామంలో పలువురు క్రీడాకారులు అభినందనలు తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల చివరి ప్రక్రియను అత్యంత ప్రణాళికా బద్ధంగా నిర్వహించేందుకు కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని, 117- నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ గురువారం తెలిపారు. స్థానిక కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఈఈ చంద్రయ్య, తదితరులతో కలిసి పరిశీలించారు.

పోలీసు అధికారులు, సిబ్బంది కృషితో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని అన్నారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల ఎస్పీలతో ఆయన జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఎన్టీఆర్ జిల్లా సమాచార శాఖకు మంజూరు చేసిన నికాన్ డీ 850 మోడల్ కెమెరాను గురువారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఆయన కార్యాలయంలో సమాచార శాఖ అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేవలం ఒక ఫోటోతో ఎన్నో భావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే అద్భుత శక్తి ఒక్క ఫోటోగ్రఫీకే ఉంటుందన్నారు. మానవ జీవితానికి ఫోటోగ్రఫీకి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఒక్క ఛాయాచిత్రంలో సమాచారం మొత్తం ఇమిడి ఉంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.