Andhra Pradesh

News July 24, 2024

శ్రీకాకుళం: జీడి పరిశ్రమలు బంద్

image

శ్రీకాకుళం జిల్లాలో పలాస-కాశీబుగ్గతో పాటు పలు చోట్ల పారిశ్రామిక వాడలోని జీడికర్మాగారాలు బంద్ అయ్యాయి. ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ జీడిపప్పు ఎగుమతి లేదని జీడి వ్యాపారులు సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలాస- కాశీబుగ్గతోపాటు పారిశ్రామిక వాడలోని సుమారు 200 కర్మాగారాల్లో బాయిలింగ్ పనులు నిలిపివేశారు. దీనివల్ల కార్మికులకు ఉపాధిలేని పరిస్థితి ఏర్పడింది.

News July 24, 2024

నెల్లూరు జిల్లాలో 34 మంది తహశీల్దార్లు బదిలీలు

image

నెల్లూరు జిల్లాలో మొత్తం 34 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు వీరిని ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లా నుంచి నెల్లూరుకు మార్చారు. ఎన్నికలు ముగియడం సాధారణ పరిస్థితి రావడంతో తిరిగి తహశీల్దార్లను ప్రకాశం, గుంటూరులోని సొంత మండలాలకు బదిలీ చేశారు.

News July 24, 2024

తిరుపతి: దిండుతో అదిమి భర్తను చంపేసిన భార్య

image

పాడిపేట పంచాయతీ శివపురంలో దారుణం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ నరేశ్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. కొన్ని రోజులుగా భార్య ధనలక్ష్మి, నరేశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో నరేష్ మృతి చెందడంతో స్థానికులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మే హరి అనే వ్యక్తితో కలిసి తండ్రిని దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు కుమార్తె నిదిశ్రీ పోలీసులకు తెలిపింది.

News July 24, 2024

విశాఖలో యువతిపై అర్ధరాత్రి దాడి..?

image

కొమ్మాది ప్రాంతంలో బేకరీలో పనిచేస్తున్న యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. సోమవారం విధులు ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో వసతిగృహానికి వెళ్తున్న ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయాలతో హాస్టల్‌కి వెళ్లిన ఆమెను స్నేహితులు ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. కమిషనర్ శంఖబ్రత బాగ్చి దృష్టి సారించి విచారణను ఆదేశించినట్లు తెలుస్తోంది.

News July 24, 2024

బీ-ఫార్మసీ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల జరిగిన బీ-ఫార్మసీ 7వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.

News July 24, 2024

ఖమ్మం, మంచిర్యాల వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ మీదుగా ప్రయాణించే పట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయోగాత్మకంగా ఖమ్మం, మంచిర్యాల స్టేషన్‌లలో స్టాప్‌ ఇచ్చామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.22669 ఎర్నాకులం- పట్నా ట్రైన్‌కు ఈ నెల 27 నుంచి ఖమ్మం, మంచిర్యాలలో స్టాప్ ఇచ్చామన్నారు. ఈ నిర్ణయంతో ఈ రైలు బయలుదేరే, గమ్యస్థానం చేరుకునే సమయాలలో మార్పులు లేవని రైల్వే అధికారులు చెప్పారు.

News July 24, 2024

జిల్లాలోని ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి: కలెక్టర్

image

జిల్లాలోని ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో పారామెడికల్ సిబ్బంది నియామక నోటిఫికేషన్‌పై, కడప జీజీహెచ్, క్యాన్సర్ కేర్ సెంటర్, జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు, జీజీహెచ్ పులివెందుల ఆసుపత్రుల్లో సౌకర్యాలు, సదుపాయాలు తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

News July 24, 2024

నెల్లూరు: ఫలితాల కోసం వీఎస్‌యూ విద్యార్థుల ఎదురుచూపులు

image

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలోని విద్యార్థులు 4వ సెమిస్టర్ పరీక్షలు రాసి 3 నెలలు అవుతుంది. వచ్చే నెల 22వ తేదీన ఐసెట్ కౌన్సిలింగ్ చివరి తేదీ. అయినప్పటికీ ఇంకా 4వ సెమిస్టర్ రిజల్ట్స్ రాకపోవడంతో.. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షా ఫలితాలు ఆలస్యం కావడంతో విద్యార్థులు యూనివర్సిటీ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News July 24, 2024

బీ-ఫార్మసీ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల జరిగిన బీ-ఫార్మసీ 7వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.

News July 24, 2024

చిత్తూరు: విభిన్న ప్రతిభావంతులకు గమనిక

image

చిత్తూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు కృత్తిమ కాలు అమర్చేందుకు ఈనెల 26న ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. చెన్నైకు చెందిన ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులోని రాస్(తపోవనం) వద్ద నిర్వహించే శిబిరంలో అర్హులు పాల్గొనేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.51వేలు విలువైన ఆధునిక వెయిట్ లెస్ కాలు ఉచితంగా అమర్చుతారని చెప్పారు.