Andhra Pradesh

News May 15, 2024

బాపట్ల జిల్లాలో రీపోలింగ్ అవసరం లేదు: కలెక్టర్, ఎస్పీ

image

బాపట్ల జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడానికి సహకరించిన అధికారులకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

News May 15, 2024

నంద్యాల: ఎంసెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక

image

ఈనెల 17 నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవలే హాల్ టికెట్లు కూడా విడుదల చేశారు. పలువురు అభ్యర్థులకు నంద్యాల జిల్లాలోని ఆర్జీఎం, శాంతిరాం కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. అయితే ఈ కళాశాలల్లో ఈవీఎంలను భద్రపర్చడంతో ఆ 2 కళాశాలలను పరీక్షా కేంద్రాల జాబితా నుంచి తొలగించారు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లలో ఈ కేంద్రాలు ఉంటే మళ్లీ కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

News May 15, 2024

నిప్పులకొలిమిలా శ్రీకాకుళం

image

శ్రీకాకుళం జిల్లా నిప్పులకొలిమిలా మారింది. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రెండు రోజులుగా వాతావరణంలో వేడి ఎక్కువ కావడంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

News May 15, 2024

విశాఖ ఓటరు ఎటువైపు?

image

సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్ ప్రక్రియపై విభిన్న ఊహాగానాలు, విశ్లేషణలు ప్రచారం జరుగుతున్నాయి. ఉమ్మడి విశాఖలో ఉదయం ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు బాగా పోలైందని, సాయంత్రం నుంచి ప్రభుత్వ అనుకూల ఓటింగ్ భారీగా నమోదయిందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. పోలింగ్ విధానాన్ని విశ్లేషిస్తూ ఆయా పార్టీల నాయకులు విజయం తమదంటే.. తమదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరి మీ జిల్లా ఓటర్లు ఎటువైపు ఉన్నారో కామెంట్ చెయ్యండి?

News May 15, 2024

పల్నాడులో హింసాత్మక ఘటనలపై టీడీపీ ప్రత్యేక కమిటీ

image

పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఏడుగురితో ప్రత్యేక కమిటీని నియమించడం జరిగింది. కమిటీ సభ్యులుగా వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు.

News May 15, 2024

అనంత: YCPకి ఓటు వేసిందనే హత్య..?

image

కంబదూరు మండలం వైసీపల్లిలో మంగళవారం వెంకటేశ్ తన తల్లి సుంకమ్మను సుత్తితో కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. సుంకమ్మ వైసీపీకి ఓటు వేసిందనే వెంకటేశ్ ఆమెను హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. వెంకటేశ్ టీడీపీలో ఉన్నాడు. 13న తాను వైసీపీకి ఓటు వేసినట్లు వెంకటేశ్‌కు సుంకమ్మ చెప్పింది. ఆగ్రహంతో వెంకటేశ్ సుత్తితో కొట్టడంతో సుంకమ్మ మృతి చెందింది. పరారిలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News May 15, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

మందస మండలం బిన్నలమదనాపురం-బాలిగాం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచిలి మండలం గుండమూరుకు చెందిన లక్ష్మణరావు(43) 20 ఏళ్లుగా పలాసలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓటు వేయడానికి 13న బైక్‌పై సొంత గ్రామానికి వచ్చాడు. ఓటు వేసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆయన బైక్‌ను కారు ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య హైమావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News May 15, 2024

కర్నూలు: వామ్మో.. ఒక్కరోజే రూ.5 కోట్ల మద్యం అమ్మకాలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంగళవారం ఒక్కరోజే రూ.5 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు తెరుచుకోవడంతో మందుబాబులతో కిటకిటలాడాయి. భారీగా అమ్మకాలు జరగడంతో ఒక్కరోజే రూ.5 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

News May 15, 2024

ప్రకాశం : బైక్ లు ఢీకొని ఒకరు దుర్మరణం

image

మర్రిపూడి మండలం శివరాయునిపేటకు చెందిన మానివేల చిన్నవీరయ్య, చీమల వెంకటేశ్వర్లు బైక్ పై ఉప్పలపాడు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఇదే సమయంలో మర్రిపూడి మండలం చిమటకు చెందిన జానపల్లి వెంకటేశ్వర్లు బైకుపై మర్రిచెట్లపాలెం వెళ్తున్నారు. ఉప్పలపాడు సమీపంలో బైక్ లు ఢీకొనడంతో చిన్నవీరయ్యకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై కోటయ్య కేసు నమోదు చేశారు.

News May 15, 2024

తాడిపత్రిలో పోలీసుల ఆపరేషన్ స్టార్ట్

image

తాడిపత్రిలో పోలీసులు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. పట్టణంలోకి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పక్కాగా ఆపరేషన్ స్టార్ట్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జేసీ ఇంటి నుంచి 30 మంది, ఎమ్మెల్యే ఇంటి నుంచి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి మండల వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్నారు