India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సర్వేపల్లిలో 2019లో 82.42 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 83.39 శాతం నమోదైంది. పాత ప్రత్యర్థులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హోరాహోరీగా తలపడ్డారు. కాకాణికి ప్రచారంలో కుమార్తె పూజిత అండగా నిలవగా, సోమిరెడ్డికి మద్దతుగా కుమారుడు రాజగోపాల్ రెడ్డి, కోడలు శృతిరెడ్డి, కుమార్తె సింధుతో పాటు పలువురు విస్తృతంగా ప్రచారం చేశారు. పెరిగిన 0.97 శాతం పోలింగ్ ఎవరిని గట్టెక్కిస్తుందో..?

విజయనగరం జిల్లాలో 81.06% ఓటింగ్ నమోదైంది. జిల్లాలో 15,85,206 మంది ఓటర్లు ఉండగా 12,84,900 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 6,36,609 మంది పురుషులు, 6,48,267 మంది మహిళలు, 24 మంది ఇతరులు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలు అధిక సంఖ్యలో ఉండటం విశేషం. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10 శాతం పోలింగ్ నమోదవ్వగా.. 6,04,064 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఫలితాల పర్వమే. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే జిల్లాలో ఇప్పటికే రెండు సార్లు గెలిచిన ఐదుగురు హ్యాట్రిక్ సాధిస్తారని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వారిలో వైఎస్ జగన్, రఘరామిరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్ భాషా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు ఉన్నారు. దీంతో ప్రజాతీర్పు కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

తుగ్గలి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మండలంలోని రాంపల్లికి చెందిన బోయ రమేశ్(25) పెండేకల్లు ఆర్ఎస్ నుంచి గ్రామానికి బైక్‌పై వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన బోయ నాగరాజు ఎదురుగా రావడంతో అదుపుతప్పి ఢీకొన్నాయి. ప్రమాదంలో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగరాజుకు తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంటుంటే.. వారి గెలుపోటములపై పందెంరాయుళ్లు బెట్టింగులు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో YCP ప్రభంజనంలోనూ విశాఖ సిటీలో TDP జెండా ఎగురవేసింది. ఆ స్థానాల్లో పందేలు జోరందుకున్నాయని టాక్ నడుస్తోంది. హాట్‌సీట్‌గా ఉన్న విశాఖ ఈస్ట్‌లో అభ్యర్థి గెలుపుతో పాటు, మెజార్టీపైనా బెట్టింగ్‌లు వేస్తున్నట్లు సమాచారం. అటు విశాఖ MP, పశ్చిమ అభ్యర్థులపైనా ఇదే పరిస్థితి.

నందిగాం మండలంలో విషాదం నెలకొంది. పెద్దలవునిపల్లెకు చెందిన శివానందం(24) పాము కాటుకు గురు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సోమవారం రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత శివానందం తన తల్లి, సోదరుడితో ఇంట్లో నిద్రపోయారు. ఓ కట్లపాము అర్ధరాత్రి శివానందను కరిచింది. మంగళవారం ఉదయం అతడికి వాంతులు, విరేచనాలు అవడంతో ఏం జరిగిందో తెలియని కుటుంబీకులు శ్రీకాకుళం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 79.36శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జగ్గయ్యపేటలో 89.88%, విజయవాడ పశ్చిమలో 66.46శాతం మంది ఓటేశారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
* విజయవాడ సెంట్రల్- 72.96%
* విజయవాడ తూర్పు- 71.33%
* తిరువూరు- 87.68%
* నందిగామ- 87.56%
* మైలవరం- 85.36%

తుగ్గలి మండలం జడ్పీటీసీ పులికొండ నాయక్ ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. చికిత్స కోసం ఆయనను కర్నూలులోని ఓ ఆసుపత్రికి తరలించారు. పత్తికొండ వైసీపీ అభ్యర్థి శ్రీదేవి ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.

కంబదూరు మండలం వైసీ పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి సుంకమ్మను కొడుకు వెంకటేశులు సుత్తితో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని సుంకమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జూన్ 29న మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. జిల్లా కోర్టులో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో రాజీ కాగలిగిన పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్ కేసులు, పౌర శిక్షాస్మృతిలోని కేసులు, చెల్లని చెక్కు కేసులు, సివిల్ తగాదాలు తదితర కేసులు రాజీ చేసుకోవచ్చని ఆయన అన్నారు.
Sorry, no posts matched your criteria.