Andhra Pradesh

News May 15, 2024

జమ్మలమడుగు టాప్.. కడప లీస్ట్

image

ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. జిల్లాలో 23,39,900 మొత్తం ఓటర్లు ఉన్నారు. వీరిలో 18,37,711 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో జమ్మలమడుగు నియోజకవర్గం అత్యధికంగా 86.68% నమోదు కాగా, కడపలో 65.27% తక్కువగా నమోదైంది. అటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 99% మంది ఉద్యోగులు ఓటు వినియోగించుకున్నారు. అధికారులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

News May 15, 2024

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు‌పై బెట్టింగులు

image

పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలుపుపై జోరుగా పందేలు కాస్తున్నారు. జరిగిన పోలింగ్‌ ఫలితాల్లో పవన్‌ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని పలువురు బెట్టింగ్ వేస్తున్నారు. పవన్‌ గెలిస్తే రూ.లక్ష చెల్లిస్తామని.. ఒకవేళ వైసీపీ అభ్యర్థి గీత విజయం సాధిస్తే రూ.2 లక్షలు చెల్లించాలని ఉమ్మడి పార్టీల నాయకులు చెల్లించాలన్న ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం. దీనిపై మీ కామెంట్..

News May 15, 2024

శ్రీకాకుళం జిల్లాలో 76.81శాతం పోలింగ్

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 76.81శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 18,75,934 మంది ఓటర్లు ఉండగా 14,40,885 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. వీరిలో మహిళలు 7,39,852 పురుషులు 7,01,016 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఎచ్చెర్ల నియెజకవర్గంలో 83 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు.

News May 15, 2024

కురువళ్లిలో వంద శాతం ఓటింగ్‌

image

కర్నూలు జిల్లాలో 76.80 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా ఆలూరు మండలం కురువళ్లి గ్రామంలోని 109 పోలింగ్‌ కేంద్రంలో 100 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ పోలింగ్‌ కేంద్రంలో మొత్తం 940 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 460, మహిళలు 480 మంది ఉన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు మంగళవారం తెలిపారు.

News May 15, 2024

తాడిపత్రిలో యుద్ధ వాతావరణం.. భారీగా పోలీసు బలగాల మోహరింపు..!

image

తాడిపత్రిలో నిన్న 8 గంటల పాటు యుద్ధ వాతావరణం తలపించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి అనుచరులు రాళ్లతో దాడులు చేసుకున్నారు. విషయం తెలిసి పట్టణంలో డీఐజీ షిమోషీ వాజ్ పాయ్ పర్యటించారు. ఘర్షణలకు దారి తీసిన పరిస్థితులపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల కోసం మరిన్ని పోలీసు బలగాలను రప్పించారు. డీఐజీతో పాటు కర్నూలు డీఐజీ, ఎస్పీ, కడప, అన్నమయ్య, జిల్లాల ఎస్పీలు తాడిపత్రికి చేరుకున్నారు.

News May 15, 2024

గుంటూరు-విశాఖ, రాజమండ్రి – విశాఖ మధ్య రెండు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో భద్రత దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే సందీప్ తెలిపారు. గుంటూరు- విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 15 నుంచి 26 వరకు, విశాఖ- గుంటూరు మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు, రాజమండ్రి – విశాఖ- రాజమండ్రి మధ్య నడిచే రైలును ఈ నెల 15 నుంచి 26 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

News May 15, 2024

విశాఖ: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2024-2025 ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ తెలిపారు. ఇందుకోసం http://iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా జూన్ 10లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. నమోదు చేసుకున్న విద్యార్థులు జూన్ 10వ తేదీ లోపు కంచరపాలెం ఓల్డ్ ఐటీఐ, ప్రభుత్వ బాలికల ఐటీఐ, గాజువాక ప్రభుత్వ ఐటీఐ, నరవ ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.

News May 15, 2024

విజయనగరం: తెల్లవారుజాము వరకు పోలింగ్

image

గుర్ల: చింతలపేటలో తెల్లవారుజాము 3 గంటలవరకు పోలింగ్
విజయనగరం: కుమ్మరివీధి, చెరువుగట్టు ప్రాంతంలో రాత్రి 9.30 గంటల వరకు ఓటింగ్
పార్వతీపురం: జగన్నాథపురం, వివేకానందకాలనీలో రాత్రి 9.10కి ముగించారు
జామి: రామభద్రపురంలో పోలింగ్ పూర్తయ్యే సరికి అర్ధరాత్రి 12 దాటింది
భోగాపురం: అప్పన్నపేటలో వేకువజాము 2.30 గంటల వరకు
డెంకాడ: పెదతాడివాడలో 12 వరకు, నాతవలస, డి.తాళ్లవలసలో రాత్రి 11 వరకు పోలింగ్ జరిగింది.

News May 15, 2024

ప్రత్యేక కమిటీలో కొల్లు రవీంద్ర

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్లలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు చంద్రబాబు ఏడుగురు సీనియర్ నాయకులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రకు కూడా స్థానం దక్కింది. జిల్లాకు చెందిన వర్ల రామయ్య కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.

News May 15, 2024

పాశం సునీల్‌కు గాయం.. రవిచంద్ర పరామర్శ 

image

చిల్లకూరులోని పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గూడూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ చేతికి స్వల్ప గాయమైంది. ఈక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మంగళవారం ఆయనను పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. గూడూరు నియోజకవర్గంలో పోలింగ్ సరళిపైనా చర్చించారు.