India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయవాడ మీదుగా వెళ్లే తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని రైల్వే అధికారులు మార్పులు చేశారు. ట్రాక్ నిర్వహణ కారణాల రీత్యా నం.17405 TPTY-ADB ట్రైన్‌ను ఈ నెల 16, 22 తేదీల్లో, నం.17406 ADB-TPTY ట్రైన్‌ను ఈ నెల 15, 21 తేదీల్లో విజయవాడ మీదుగా నడపమని అధికారులు తెలిపారు. విజయవాడ, మధిర, ఖమ్మం మీదుగా కాక తెనాలి, సికింద్రాబాద్ మీదుగా ఆయా తేదీల్లో ఈ రైళ్లు నడుపుతామన్నారు.

భీమిలిలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం భీమిలి టీడీపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో నమోదైన పోలింగ్ శాతమే దీనికి నిదర్శనమని అన్నారు. అధికార పార్టీ చాలా ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ కూటమి కార్యకర్తలు సంయమనం పాటించారని అన్నారు.

పిడుగుపాటుకు గురై గొర్రెల కాపారి మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. ఆత్మకూరు మండలం అమలాపురం గ్రామానికి చెందిన తెలుగు పెద్ద ఆంజనేయులు వెంకటాపురం గ్రామ శివారులో గొర్రెలు మేపుతున్నాడు. అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుడంగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

వజ్రకరూర్ మండలం తట్రకల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడి ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఉరవకొండ నుంచి గుంతకల్లుకు బండల లోడును ట్రాక్టర్‌లో వేసుకొని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కృష్ణా వర్శిటీ పరిధిలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కోర్సు అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. నిర్ణీత పని దినాలు ఉండేలా క్యాలెండర్ తయారు చేసినట్లు వర్శిటీ పేర్కొంది. 2024 జూలై, నవంబర్ నెలల్లో బీఈడీ విద్యార్థులకు మొదటి, రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయంది. క్యాలెండర్ పూర్తి వివరాలకు కృష్ణా వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

తాడిపత్రిలో జరుగుతున్న టీడీపీ-వైసీపీ దాడుల నేపథ్యంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు కేవలం గన్‌మెన్‌లను మాత్రమే అనుమతించినట్లు సమాచారం. పెద్దారెడ్డిని ఎక్కడికి తీసుకెళ్లారన్న సమాచారం పోలీసులు వెల్లడించలేదు.

శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం పెరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 72.41 శాతం నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో తాజా సమాచారం మేరకు 75.41 శాతం నమోదైంది. మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా గతంతో పోలిస్తే సుమారు 3 శాతం మేర ఓటింగ్ పెరిగింది. ఈ పెరిగిన ఓటింగ్‌తో అధికార, ప్రతిపక్షాలు తమకే మేలు జరుగుతున్నాయని ఆశిస్తున్నాయి.
– మరి మీ కామెంట్ ఏంటి..?

చాపాడు మండలంలోని మొర్రాయిపల్లెలో మంగళవారం పుష్పరాజ్ అనే ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి చెందినట్లు ఏపీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. గ్రామ సమీపంలోని పంట పొలాల్లో ఉపాధి పని చేస్తుండగా పుష్పరాజ్ గుండె నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని చికిత్స కోసం మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఉమ్మడి కృష్ణాలో అవనిగడ్డ అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంట్ నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో ఇక్కడ NDA కూటమి శ్రేణులు గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే అవనిగడ్డలో కూటమి అభ్యర్థులైన బాలశౌరి, బుద్ధప్రసాద్ ఎన్నికల గుర్తు ఒకటే కావడంతో తమకు భారీ స్థాయిలో ఓట్లు పోలయ్యాయని కూటమి శ్రేణులు భావిస్తుండగా, జూన్ 4న ఈ ప్రశ్నకు సమాధానం లభించనుంది.

వేటపాలెం సమీపంలోని నాగవరపమ్మ రైల్వేగేట్ వద్ద రైలు ఢీకొనడంతో ఓ మహిళ (50) మృతి చెందింది. ఆమె వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, మృతురాలు పసుపురంగు చీర ధరించిందని చీరాల జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని వారు పేర్కొన్నారు. కాగా మృతురాలి సమాచారం తెలిసిన వారు 9440627646 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.