Andhra Pradesh

News May 14, 2024

ఇందిరా గాంధీ జూలో మే 21 నుంచి సమ్మర్ క్యాంప్

image

ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో మే 21 నుంచి సమ్మర్ క్యాంప్-2024 నిర్వహిస్తున్నట్లు క్యూరేటర్ డా.నందని సలారియా తెలిపారు. 5 సంవత్సరాల వయస్సు నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు ఎవరైనా ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనవచ్చు అన్నారు. 5 నుంచి 11 సంవత్సరాల వారికి మే 21 నుంచి 25 వరకు, 12-18 సంవత్సరాల వారికి మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు రెండు బ్యాచ్‌లుగా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News May 14, 2024

శ్రీకాకుళం వాసులకు హెచ్చరిక

image

ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. రేపు ఎండల తీవ్రతతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. ప్రజలు తగుజాగ్రత్తలు పాటించాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది.

News May 14, 2024

ఏలూరు: ACCIDENT.. మామాఅల్లుడు మృతి

image

ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికుల వివరాలు.. ఏలూరులోని సత్యనారాయణపేటకు చెందిన గొర్రెల ప్రకాష్(30) వృత్తిరీత్యా పాలిష్ వర్క్ చేస్తుంటాడు. మంగళవారం మేనమామ రంగారావు(50)తో కలిసి బైక్‌పై పెదవేగి మండలం వేగివాడకు బయలుదేరాడు. దెందులూరు మండలం నాగులదేవునిపాడు వద్ద టిప్పర్ లారీ ఢీ కొంది. ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందగా, రంగారావు ఏలూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు.

News May 14, 2024

బి.మఠం: TDP యూత్ లీడర్ మృతి

image

బ్రహ్మంగారి మఠం మండలం, గొల్లపల్లి గ్రామానికి చెందిన వళ్లెం వీరారెడ్డి (30) మంగళవారం అనారోగ్యంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతను టీడీపీ యూత్ కమిటీలో కీలక నేతగా పనిచేసేవాడన్నారు. ఆయన మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరారెడ్డి మరణించడంతో పలువురు టీడీపీ నేతలు పార్థివ దేహానికి సంతాపం తెలిపారు.

News May 14, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

నావెల్ డాక్ యార్డ్ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ మంగళవారం మృతి చెందింది. గాయపడిన మహిళను పోలీసులు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు మల్కాపురం పోలీసులు తెలిపారు. మృతురాలిని ఎవరైనా గుర్తిస్తే మల్కాపురం పోలీస్ స్టేషన్‌‌ను సంప్రదించాలని కోరారు.

News May 14, 2024

సర్వేపల్లి స్ట్రాంగ్ రూమ్‌‌కు సీల్

image

సర్వేపల్లి నియోజకవర్గంలో చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పకడ్బందీ భద్రత మధ్య నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు సీల్ వేశారు.

News May 14, 2024

జమ్మలమడుగులో 144 సెక్షన్ కొనసాగుతోంది: డీఎస్పీ

image

జమ్మలమడుగులో 144 సెక్షన్ కొనసాగుతోందని DSP టీడీ.యస్వంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో YCP MLA అభ్యర్థి సుధీర్ రెడ్డికి, కూటమి MLA అభ్యర్థి ఆది నారాయణ రెడ్డికి, MP అభ్యర్థికి భూపేశ్ రెడ్డికి 2+2 గన్ మ్యాన్లతో భద్రతను పెంచారు. ఇప్పటికే ఇద్దరు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జమ్మలమడుగులో ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే నాన్‌బెయిలబుల్ కింద కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.

News May 14, 2024

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు

image

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో సహా 11 మంది అనుచరులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం పోలింగ్ సందర్భంగా చాపాడు మండలం చిన్నగులవలురులో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇద్దరు టీడీపీ ఏజెంట్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో సహా 11 మందిపై చాపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 14, 2024

మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో పోలింగ్ అనంతరం ఈవీఎంలను కృష్ణా విశ్వవిద్యాలయంలో భద్రపరిచారు. మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరిచినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో ఉంచామని కలెక్టర్ పేర్కొన్నారు.

News May 14, 2024

నంద్యాల: పోలింగ్ కేంద్రం వద్దే భూమా ముఖ్య అనుచరుడి మృతి

image

మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన భూమా కుటుంబ ముఖ్య అనుచరుడు నాలి వలి గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతిచెందారు. ఓటు వేసేందుకు వెళ్లిన ఆయన.. పోలింగ్ కేంద్రం వద్దే కుప్పకూలి మరణించారు. మృతి పట్ల టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం శిరివెళ్లకు చేరుకుని వలి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు.