India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 130 స్థానాల్లో గెలవబోతుందని కాపు బలిజ సంక్షేమ శాఖ అధ్యక్షులు, మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి 107 సీట్లు, జనసేన పార్టీకి 18 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 5 సీట్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

నిన్న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తెనాలి ఘటనలో ఓటరు సుధాకర్‌కు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే ఇతడిని కొట్టడం, తిరిగి ఇతను ఎమ్మెల్యేను కొట్టడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా, సుధాకర్ సివిల్ ఇంజినీర్. హైదరాబాద్, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేసి.. ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్నారు. ఓటు వేయడానికి ఆయన సోమవారం బెంగళూరు నుంచి వచ్చినట్లు తెలిసింది.

మాజీ మంత్రి, వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి సోమవారం పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఆయనకు ఓటు వేసేందుకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఒక్కరోజు అనుమతినిచ్చింది. భాక్రరాపురంలో ఓటు వేసి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.

పుట్టిన రోజునే ఓ బాలుడు కాన్సర్‌తో మృతి చెందిన విషాదకర ఘటన కంచిలిలో సోమవారం జరిగింది. పెద్దఖొజ్జిరియాకు చెందిన సనీత్ కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. 10 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సనీత్ మృతి చెందారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు పుట్టిన రోజునే మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ తను పోటీ చేసిన పర్చూరు నియోజకవర్గంలో ఓటు వేయడానికి అవకాశం లేకపోయింది. స్వగ్రామమైన చీరాలలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పర్చూరు నియోజకవర్గ వైసీపీ టికెట్ ఆయనకు ఖరారవడంతో ఆయన ఓటును పర్చూరుకి మార్చుకునే అవకాశం లేకపోయింది. కాగా కూటమి తరఫున పర్చూరులో ఏలూరి సాంబశివరావు పోటీలో ఉన్నారు.

గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఈ ఎన్నికల్లో బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈక్రమంలో ఆయన నిన్న గూడూరులో ఓటు వేశారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పాశం సునీల్ కుమార్ పోటీలో ఉండటంతో ఇక్కడ బీజేపీ ఎన్నికకు దూరంగా ఉంది. ఫలితంగా వరప్రసాద్ గూడూరులో తన పార్టీ(బీజేపీ)కి ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. మరొక ఓటు(ఎంపీ) తనకు తాను వేసుకునే ఛాన్స్ వచ్చింది.

జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్‌లో మహిళలు భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాత్రి 10.30 గంటల సమయానికి మొత్తం 13,93,858 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా వారిలో అత్యధికంగా 7,21,692 మంది మహిళలు ఓటు వేశారు. వారి తర్వాత 6,72,149 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 74.30 శాతం పోలింగ్ నమోదైదనట్లు అధికారులు తెలిపారు.

ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి వరకు వైసీపీ, టీడీపీ వర్గాలు దాడులకు దిగాయి. పోలింగ్ బూత్‌లో నెలకొన్న వివాదంతో పోలింగ్ ముగిశాక ఇరు వర్గాలు పెట్రోల్ బాంబులతో ఘర్షణకు దిగాయి. ఇరు వర్గాలు సోడాసీసాలు, రాళ్లు రువ్వుకుంటూ గ్రామంలో అలజడి సృష్టించాయి. ఈ క్రమంలో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

కృష్ణా జిల్లాలో సోమవారం విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓటేయడానికి వచ్చిన పలువురు వివిధ కారణాలతో మృతి చెందారు. పెనమలూరుకు చెందిన ఈశ్వరరావు(72) ఓటేసిన తర్వాత అస్వస్థతకు గురై మరణించగా.. పెనమలూరు మం. పెదపులిపాకకు చెందిన వెంకటేశ్వరరావు(75), కైకలూరు వాసి ప్రభాకరరావు(65) ఓటేసేందుకు వరుసలో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు. వీరితో పాటు మేడూరుకు చెందిన నాగభూషణం(54) ఓటుకు వెళ్తూ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు సొంత ఊరు చిత్తూరు. గత ఎన్నికల్లో ఆయన అక్కడే ఓటు వేశారు. జనసేనలో చేరిన తర్వాత ఆయన తన ఓటును తిరుపతికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నారు. చివరి నిమిషంలో ఓటు బదిలీ కాలేదు. చిత్తూరులోనే ఆయన ఓటు ఉండిపోయింది. ఈక్రమంలో ఆయన నిన్న తనకు తానే ఓటు వేసుకోలేకపోయారు. అలాగే తిరుపతిలో పోలింగ్ సరళిని పరిశీలిస్తూ చిత్తూరుకు కూడా వెళ్లి ఓటు వేయలేదు.
Sorry, no posts matched your criteria.