India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నంద్యాల జిల్లా పగిడ్యాల మండల కేంద్రంలోని మజారా
గ్రామమైన బీరవోలులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ నరసింహుడు(58) పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠానికి చెందిన కర్రి సత్యనారాయణ(52) ఫిట్స్‌తో మృతి చెందాడు. గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం ఓటు వేసిన అనంతరం ఫిట్స్‌తో స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే సత్యనారాయణ మృతితో కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది.

లేపాక్షి మండలం మానేపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ గోపీ తెలిపారు. దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి పడేశారని పేర్కొన్నారు. ఎక్కడో హత్యచేసి ఇక్కడ పడేశారా? లేక ఇక్కడే హత్య చేశారా? అనే కోణంలో విచారిస్తున్నామని చెప్పారు. హత్యచేసి దాదాపు పది రోజులై ఉంటుందని, మృతదేహం బాగా కుళ్లిపోయిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మాడుగుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి తను పోటీ చేసిన మాడుగుల నియోజకవర్గంలో ఓటు వేయడానికి అవకాశం లేకపోయింది. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో తన స్వగ్రామమైన వెన్నెలపాలెంలో తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ఆఖరి నిమిషంలో మాడుగుల నియోజకవర్గం టీడీపీ టికెట్ ఖరారవ్వడంతో ఆయన ఓటును మార్చుకునే అవకాశం లేకపోయింది. కాగా.. కూటమి తరఫున పెందుర్తిలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్ పోటీలో ఉన్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సోమవారం ఓటర్ల చైతన్యం కనిపించింది. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని ఓట్లు వేశారు. తాజా సమాచారం మేరకు.. పెడనలో అత్యధికంగా 87.72% పోలింగ్ నమోదైంది. విజయవాడ వెస్ట్‌లో అత్యల్పంగా 68.55% మంది ఓటేశారు. కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఉమ్మడి ప.గో జిల్లాలో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఏలూరు జిల్లాలో అత్యధికంగా 83.04%.. పశ్చిమ గోదావరి జిల్లాలో 81.12% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఉంగుటూరులో అత్యధికంగా 87.75%, అత్యల్పంగా ఏలూరులో 71.02% పోలింగ్ నమోదైంది.
NOTE: పూర్తి గణాంకాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పోలింగ్ శాతం మరింత పెరగొచ్చు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. సోమవారం రాత్రి భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పోలింగ్ సిబ్బంది నుంచి ఈవీఎంలను తీసుకునే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ దూది, మంగళగిరి ఆర్వో జి.రాజకుమారి పాల్గొన్నారు.

బాపట్ల జిల్లా కారంచేడులో ఓ మహిళ ఓటు విలువను చాటారు. గర్నెపూడి చిట్టెమ్మ గ్రామంలో వీవోఏగా పని చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో సోమవారం ఆమె భర్త సింగయ్య(62) మృతిచెందారు. కాగా, ఆ బాధలోనూ ఆమె ఓటు వేయాల్సిన బాధ్యతను మరవలేదు. 178వ పోలింగ్ కేంద్రంలో ఓటేసి పలువురికి ఆమె ఆదర్శంగా నిలిచారు.

గాజువాక నియోజకవర్గంలో ఓటు బహిర్గతం అయ్యినట్లు తెలుస్తోంది. ఓ పార్టీకి ఓటు వేసినట్లు ఈవీఎంల ఫొటోలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తి ఓటు వేస్తూ ఈవీఎంల ఫొటో తీశాడు. తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఓటు వేసిన వివరాలు బహిర్గతం కావడంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితే.. అది మాక్ పోలింగ్ జరిగినప్పుడు తీసిన ఫొటో అని కూడా ప్రచారం జరుగుతోంది.

నెల్లూరు జిల్లాలో ఓ MLA అభ్యర్థి ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్‌ను నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నిన్న పోలింగ్ సరళిని పరిశీలించడానికి కందుకూరులో విస్తృతంగా పర్యటించారు. ఈక్రమంలో ఆయన కనిగిరికి వెళ్లి ఓటు వేయలేకపోయారు. బుర్రా తీరుపై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.