India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాచర్ల మండలం జెపి చెరువు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ప్రతి శనివారం ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు శుద్ధిగా లేకపోతే ఆలయ సమీపంలో ఉండే తేనెటీగలు వారిని కుట్టి ఆలయ ప్రాంగణం నుంచి తరిమేస్తాయని ఇక్కడి వారి నమ్మకం. అందుకే భక్తులు శుద్ధిగా వచ్చి దైవదర్శనం చేసుకుంటారు.

సముద్ర తీరం వెంట కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బ్రిటీష్ హయాం నుంచి ప్రతిపాదనలకే పరిమితమైన నరసాపురం- మచిలీపట్నం మధ్య లైన్‌కు సర్వే చేయాలని నిర్ణయించింది. తాజా కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులు పూర్తయితే నరసాపురం పెద్ద జంక్షన్‌గా మారనుందని తీరప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖపట్నంలో 13 రైతు బజార్లో జేసీ కె.మయూర్ అశోక్ ఆదేశాలనుసారం వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రూ.38కే టమాటా విక్రయాలు జరిగాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారు. ఐదు రోజులుగా ధర తగ్గుతూ వస్తుండడంతో రైతు బజార్లో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా DCCB రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏఎస్. సాయిబాబా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ మూర్తి, కార్యదర్శిగా రామారావు, కోశాధికారిగా సూర్యచంద్ర రావు, ఈసీ మెంబర్‌గా రాంబాబు, ఇతర డైరెక్టర్లను ఎన్నుకొన్నట్లు వివరించారు. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. మంగళగిరి నగర పరిధిలోని అరణ్య భవన్‌లో సాయంత్రం నాలుగు గంటలకు సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసు అధికారులు బందోబస్తు పనుల్లో ఉన్నారు.

వినుకొండలో జరిగిన రషీద్ హత్యపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసులో మాట్లాడారు. వినుకొండలో వైసీపీ నాయకుడిని దారుణంగా చంపారని, నిందితుడు జిలానీకి టీడీపీ నేతలలో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వినుకొండ ఘటనను దారి మళ్లీంచేందుకే మదనపల్లి ఇష్యూ తెచ్చారని జగన్ ఆరోపించారు.

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ లా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 5 ఏళ్ల కోర్స్ విద్యార్థుల 10వ సెమిస్టరు ఫలితాలు వెలువడినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా రీ వాల్యుయేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3 సంవత్సరాల కోర్సు విద్యార్థుల 6వ సెమిస్టరు ఫలితాలు రావాలని, అవి కూడా విడుదల చేస్తారని పేర్కొన్నారు.

అల్లూరి జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాలు బోసిపోతున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏజెన్సీలో గడిచిన రెండు వారాలుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన అరకు, బొర్రా, చపారాయి, కొత్తపల్లి, వంజంగి హిల్స్ పర్యాటక కేంద్రాలు నిత్యం వందలాది మంది పర్యాటకుల సందర్శనతో కళకళ ఉండేవి. ప్రస్తుతం వాతారణం అనుకూలించకపోవడంతో పర్యాటకులు రావడం లేదు. దీంతో కళాహీనంగా దర్శన మిస్తున్నాయి.

ఒంగోలులోని రూడ్ సెట్ సంస్థలో ఆగస్టు 2వ తేదీ నుంచి పురుషులకు కంప్యూటర్ శిక్షణ ఉచితంగా ఇవ్వబడునని సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ పురుషులు అర్హులన్నారు. అలాగే 18 -45 సంవత్సరాలు వయసు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండవలెను, ఈ శిక్షణ కాలంలో శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పించబడతాయన్నారు.

రాష్ట్ర మంత్రివర్గంలో సుజనా చౌదరికి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఒక మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఆయన కోసమే ఉంచినట్లు ప్రచారం సాగుతోంది. ఆ సీటుపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ, కేంద్రమంత్రిగా చేసిన అనుభవం ఉండడంతో సుజనా చౌదరికే మంత్రి పదవి ఇవ్వాలని CM చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. తాజా ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి ఆయన భారీ మెజార్టీలో గెలిచిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.