India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం సతీమణి అయిన తమ్మినేని వాణిశ్రీ స్థానిక పోలింగ్ బూత్‌లు 158, 159లో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించడం చాలా దారుణమని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈసీకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు పేర్కొన్నారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు జాతీయ రహదారి వెంట ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయానికి సోమవారం విచ్చేశారు. మొదటిసారిగా పవన్ సతీమణి అన్నా లెజినోవా మంగళగిరి విచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చేనేత వస్త్రాలు బహుకరించారు.

ఓబులదేవరచెరువు మండలంలోని కుసుమ వారి పల్లిలో డీలర్ ఇంద్రప్పపై కత్తితో దాడి జరిగింది. సోమవారం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీకి చెందిన డీలర్ ఇంద్రప్పపై ఈశ్వరయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగా దాడి జరిగినట్టు సమాచారం.

తిరుపతి జిల్లా కలెక్టర్ , జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తన భార్యతో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఎస్వియూ క్యాంపస్ పాఠశాలలోని పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చిన దంపతులు ఓటు వేసినట్టు వేలును చూపించారు. జిల్లా కు చెందిన పలువురు నాయకులు ఓటు వేసారు.

శ్రీకాకుళం నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంటకు మొత్తం 40.56 శాతం నమోదైందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం :35.56 % , పలాస:40.56%, టెక్కలి: 46.00%, పాతపట్నం: 41.25%, శ్రీకాకుళం: 38.00%, ఆమదాలవలస: 40.5%, ఎచ్చెర్ల: 40.82%, నరసన్నపేట: 43.12% నమోదైందని వారు పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

మండలంలోని పోలింగ్ కేంద్రం వద్ద <<13238232>>ఉధృత వాతావరణం<<>> చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడు కొత్తపల్లి వెంకటేశ్వరరావుపై టీడీపీ నాయకుడు దాడి చేశాడు. టీడీపీ నేత శ్యామ్ కుర్చీతో దాడి చేయటంతో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలు అయినట్లు వైసీపీ నేతలు తెలిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

కాకినాడ జిల్లా యూ.కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఉప్పెన మూవీ డైరెక్టర్ సానా బుచ్చిబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన స్వస్థలమైన కొత్తపల్లిలో ఓటు వేసినట్లు తెలిపారు. ఓటు హక్కును అందరూ విధిగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్ని పనులున్నా ఈ ఒక్కరోజు మాత్రం పక్కన పెట్టి ఓటు వేయాలని అన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. పలు పోలింగ్ కేంద్రాల ఆవరణలో షామియానాలు వేయించకపోవడంతో ఎండ తీవ్రతకు మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. వీల్ చైర్లు కూడా లేక వృద్ధులకు తిప్పలు తప్పలేదు.

ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ షన్మోహన్ కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. ఈవీఎంలు మొరాయించిన స్థలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. సాయంత్రం 6 లోపు 100% పోలింగ్ నమోదయ్యేలా ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

ఉమ్మడి కడప జిల్లాలో చాలా చోట్ల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కడప జిల్లాలో 27.02 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టంలోనే ఇప్పటివరకు అత్యధికంగా ఓటింగ్ నమోదైంది మన జిల్లాలోనే కావడం విశేషం. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. దీంతో పోలీసులు అక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు.
Sorry, no posts matched your criteria.