India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మేడం.. నేను చదువుకుంటాను అంటూ ఓ విద్యార్థిని కోరగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పందించి కేజీబీవీ పాఠశాలలో ప్రవేశం పొందేలా చర్యలు తీసుకున్నారు. ఒంగోలులోని బాలసదనం జిల్లా కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన కలెక్టర్ అక్కడి అమ్మాయిలతో మాట్లాడిన సమయంలో, ఒకరు చదువుకుంటాను అంటూ కలెక్టరును కోరారు. వెంటనే ఆమె స్పందించి కేజీబీవీలో సీటు కేటాయించారు.

‘ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం చంద్రబాబు క్లాస్మేట్స్. అప్పట్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారు’ అంటూ మాజీ సీఎం జగన్ నిన్న చేసిన కామెంట్స్‌లో నిజం లేదని చంద్రబాబు క్లాస్మేట్ దొరబాబు తెలిపారు. ‘ఎస్వీ యూనివర్సిటీలో చంద్రబాబుకు పెద్దిరెడ్డి జూనియర్. జగన్ అబద్ధాలు చెప్పారు. యూనివర్సిటీ రాజకీయాల్లో చంద్రబాబు చురుగ్గా ఉండేవారు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

కుక్కునూరు మండలం దాచారం R&R కాలనీ ముంపు ప్రాంతాల్లో మంత్రుల బృందం శనివారం పర్యటించింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. నిర్వాసితులకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, వరదలు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కాలనీల్లో ఉండొచ్చన్నారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తారని, వెళ్ళేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.3 వేల ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు.

ఈనెల 30న పార్వతీపురం govt జూనియర్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. sbi లైఫ్ ఇన్సూరెన్స్‌లో సేల్స్ అధికారి, అడ్వైజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 18 సం. పైబడిన పది, 12th, గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 80 ఖాళీలు ఉన్నాయని, www.ncs.gov.in వెబ్‌సైట్‌లోని job seeker లాగిన్‌లో నమోదుచేసుకొని బయోడేటా, 2 పాస్ ఫోటోలతో హాజరుకావాలన్నారు.

కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ సందర్భంగా జోగయ్య స్వగృహం వద్ద మీడియాతో మాట్లాడారు. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఈడబ్ల్యూఎస్‌లో 10శాతం కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్ టీడీపీ కల్పించిందన్నారు.

ఈ నెలలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు 81 మందికి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ రివార్డులు అందించారు. నగరంలో శనివారం నెలవారీ క్రైమ్ రెవ్యూ నిర్వహించారు. గంజాయి రవాణా, చోరీ సొత్తు రికవరీ తదితర సంఘటనలలో ప్రతిభ కనపర్చిన వారికి ప్రతి నెలా రివార్డులు అందజేసి వారిని ప్రోత్సహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

కడప జిల్లాలో వివిధ ప్రదేశాల్లో డీఎస్పీలుగా, సీఐలుగా పనిచేస్తున్న వారిని త్వరలో బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో విడుదల చేస్తారని పోలీసు వర్గాల ద్వారా వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కడప డీఎస్పీతో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలు మెడికల్ లీవ్‌లో వెళ్లడం గమనార్హం.

శ్రీసత్యసాయి జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుల నియామకాలకు దరఖాస్తులు చేసుకోవాలని శనివారం జిల్లా విద్య అధికారి మీనాక్షి తెలిపారు. ఈ ఉద్యోగాలకు గవర్నమెంట్ మున్సిపల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు అర్హులన్నారు. రెండేళ్లలోపు రిటైర్డ్ అయ్యేవారు, పూర్వం ఎస్‌జీఎఫ్‌గా పనిచేసిన వారు, సర్వీసులు ఏవైనా అనర్హతకు గురైన వారు ఈ పోస్టులకు అనర్హులన్నారు.

కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య పాలకొల్లులో శనివారం ఒక లేఖ రాశారు. గత టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్లకు ఆమోదం తెలిపినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అటకెక్కిందని, రిజర్వేషన్లపై పునరాలోచించాలని కోరారు. కూటమి ప్రభుత్వాన్ని కాపులు 99 శాతం ఓట్లు వేసి గెలిపించారని, పవన్ వల్ల కాపులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి రైల్వేస్టేషన్ అభివృద్ధి, ఇతర రైల్వే సమస్యలపై చర్చించారు. ఈ అభివృద్ధి పనులకు గాను బడ్జెట్‌లో రూ.269 కోట్లను కేటాయించినందుకు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.