India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజకీయ నాయకుడి జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నిన్నటితో ముగిసిన నెల రోజుల ప్రచారం ప్రిపరేషన్ అన్నమాట. ఇక నేతలందరికీ 13న పరీక్ష(ఓటింగ్). 21 రోజులకే ఫలితాలు. శ్రీకాకుళం 8 అసెంబ్లీ స్థానాలు 8 జాబ్స్ (MLA స్థానాలు) ఉండగా.. మొత్తం 73 మంది పరీక్ష రాశారు. వీరిలో టాప్ ర్యాంక్‌తో జాబ్ కొట్టేవారు ఎవరెవరో కామెంట్ చేయండి

గంపలగూడెం గ్రామ తూర్పు దళితవాడ నివాసి కొంగల సుధాకర్ (37) రోడ్డు ప్రమాదంలో శనివారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. విధి నిర్వహణలో భాగంగా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం బైకుపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ములుగుమాడు-శకుని వీడు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ మాధవ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

మైదుకూరు మండలం వనిపెంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో బాలకృష్ణుని విగ్రహం గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు బొమ్మిశెట్టి రమేశ్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఈ ఆలయంలోని మొగసాల మండపంను ముద్దరాజు కట్టించారు. ఈ మండపం రాతి కట్టడంపై బాలకృష్ణుని ప్రతిమను నిర్మించారని తెలిపారు.

★ ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
★ ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు
★ ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధం
★ మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం నిషిద్ధం
★ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.

రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ వద్ద ఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ లలో విధులు కేటాయించిన నోడల్ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు.

ఓటర్లు ప్రశాంతంగా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కోరారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, అభ్యర్థులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోలింగ్ కు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సహకరించాలని కోరారు.

సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శివాని ఇంజినీరింగ్ కళాశాలలో రిసెప్షన్ కేంద్రంలో ట్రయిల్ రన్‌ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్ శనివారం రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రతీ ఒక్క సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేశారని సూచించారు.

జిల్లాలో ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బందికి మూడవ రాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్ కుమార్ మెహర్డ సమక్షంలో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ అనంతరం సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సీల్డు కవర్‌లో పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ప.గో. జిల్లాలో గత 2 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. పోలింగ్ శాతం కొంతమేర తగ్గింది. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 82.25 శాతం పోలింగ్ జరగగా.. 2019 ఎన్నికల్లో 82.19 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఈ ఎన్నికల్లో మరింత పెంచేలా ఓటర్లుగా మనం ముందుకెళ్దాం.
– ఇంతకీ గత 2 ఎన్నికల్లో మీరు ఓటు వేశారా..?
Sorry, no posts matched your criteria.