Andhra Pradesh

News August 3, 2024

ప.గో.: 7 నెలల్లో 138 మంది మృత్యువాత

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో గడిచిన 7 నెలల్లో 162 రోడ్డుప్రమాదాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 1426 మంది క్షతగాత్రులవగా, 138 మంది మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఉమ్మడి జిల్లా వ్యా్ప్తంగా మొత్తం 280 బాక్ల్ స్పాట్లను గుర్తించారు. అయితే చాలా చోట్ల హెచ్చరిక బోర్డులు, ప్రమాద సూచికలు లేవనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News August 3, 2024

వేంపల్లి: IIIT కౌన్సెలింగ్ లిస్ట్ విడుదల.. టైమింగ్స్ ఇవే.!

image

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024-25 విద్యా సంవత్సర ప్రవేశాలకు తొలి విడత కౌన్సెలింగ్ లో 3396 సీట్లు భర్తీ అయ్యాయి. తొలి విడతలో అడ్మిషన్లు పొంది క్యాంపస్ మార్పుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు లిస్టు, మిగిలిన సీట్ల భర్తీకి ఎంపిక చేసిన విద్యార్థుల సెకండ్ లిస్ట్ నేటి మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. కాగా లిస్టులను ఆర్జీయూకేటీ వెబ్సైట్ ‘www.rgukt.in’లో పొందుపరుస్తారని అధికారులు తెలిపారు.

News August 3, 2024

విజయవాడలో యువతి మిస్సింగ్ 

image

పాయికాపురం ప్రాంతానికి చెందిన ఒక యువతి (20) బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి కనిపించలేదని యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. యువతి ప్రకాశం జిల్లాలో డిగ్రీ చదువుతూ సెలవులకు ఇంటికి వచ్చింది. రాత్రి అందరితో కలిసి ఇంట్లో ఉండగా.. అర్ధరాత్రి దాటిన తరువాత ఇంట్లో చూడగా యువతి కనిపించలేదు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నున్న పోలీసులు చెప్పారు. 

News August 3, 2024

సంతకవిటి: వైరల్ జ్వరాలతో వణుకుతున్న ప్రజలు

image

సంతకవిటి మండలంలో గోళ్లవలస పంచాయతీలో జంట గ్రామాలుగా ఉన్న ఎస్సార్ అగ్రహారం, ఎమ్మార్ అగ్రహారం గ్రామాల ప్రజలను వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున జ్వరపీడితులు ఉన్నారు. వందల మంది వరకూ టైఫాయిడ్ జ్వరాల బారిన పడి మంచం పట్టడంతో ఇరు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విజృంభించిన జ్వరాలు అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News August 3, 2024

కడప: పెన్షన్ల పంపిణీలో అలసత్వం.. నోటీసులు జారీ

image

పెన్షన్ల పంపిణీలో అలసత్వం వహించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో సచివాలయ సిబ్బంది ఉదయం 8 గంటల వరకు పింఛన్లు పంపిణీ ప్రారంభించలేదనే ఆరోపణతో, పెన్షన్ల పంపిణీ ఆలస్యంపై కారణం తెలపాలంటూ ఆయా మండలాల MPDOలకు ZP సీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో మొత్తంగా 166 మంది సచివాలయ సిబ్బంది పెన్షన్ల ఆలస్యంగా పంపిణీ చేసినట్లు నోటీసుల్లో పాల్గొన్నారు.

News August 3, 2024

బొబ్బిలి: పాము కాటుతో వ్యక్తి మృతి

image

పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన బొబ్బిలి మండలం చింతాడ గ్రామంలో చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన టి.సుధీర్ (27) తన పొలానికి వెళ్లగా పాము కాటు వేసింది. పురుగు కుట్టిందనుకొని పట్టించుకోకుండా వదిలేశాడు. కాలు వాపు వచ్చి నొప్పి ఎక్కువ అవడంతో స్నేహితులతో కలిసి ఆసుపత్రికి వెళ్లాడు. పరిస్థితికి విషమించడంతో మృతిచెందాడు.

News August 3, 2024

చిత్తూరు: బస్సు బోల్తా.. 13 మందికి గాయాలు

image

బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్ వద్ద బెంగళూరు నుంచి వెళ్తున్న బస్సు వేకువ జామున బోల్తా పడింది. మొత్తం 28 మంది ప్రయాణికులు ఉండగా, 13 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

News August 3, 2024

ఏలూరులో ఆగనున్న వందే భారత్..?

image

‘వందే భారత్’ రైలును ఏలూరులో ఆపేందుకు రైల్వే ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ దేవేంద్రకుమార్ హామీ ఇచ్చారని ఏలూరు ఎంపీ మహేశ్ కుమార్ తెలిపారు. వందే భారత్‌ను ఏలూరులో ఆపాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆపేలా చేస్తామని చెప్పారన్నారు.

News August 3, 2024

నెల్లూరు: అన్నను చంపిన తమ్ముడు

image

నెల్లూరులో జరిగిన అనుమానాస్పదమృతి కేసును పోలీసులు హత్యగా నిర్ధారించారు. సొంత తమ్ముడే అన్నను హత్య చేశాడని విచారణలో వెల్లడైంది. నెల్లూరు నగరంలోని తిప్పరాజువీధికి చెందిన బి.చంద్ర, ముత్యాలు దంపతులు తమ కుమారులు రాజేశ్(34), ఈశ్వర్‌తో కలిసి ఉంటున్నారు. గురువారం రాజేశ్ మద్యం ఫూటుగా తాగి ఇంటికి వెళ్లాడు. ఈక్రమంలో అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొంది. ఈశ్వర్ చపాతి కర్ర, కత్తితో అన్న రాజేశ్‌పై దాడికి పాల్పడ్డాడు.

News August 3, 2024

సారవకోటలో 24 మంది సచివాలయ ఉద్యోగులకు నోటీసులు జారీ

image

సారవకోట మండలంలోని 24 మంది సచివాలయ ఉద్యోగులకు ఎంపీడీవో రాంబాబు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మండలంలో 8,420 మంది సామాజిక భద్రత పింఛనుదారులు ఉండగా వీరికి పింఛను మొత్తాలు అందించడానికి 181 మంది సచివాలయ ఉద్యోగులను నియమించారు. ఈనెల 1న ఉదయం 5:30 గంటల నుంచి పింఛను మొత్తాలు అందించాలని సూచించినప్పటికీ 24 మంది ఉదయం 6:30 గంటల వరకు లాగిన్ కాకపోవడంతో చర్యలు తీసుకున్నామన్నారు.